బాల‌య్య అల్లుడిగారి గురి మారింది..!

February 27, 2019 at 4:16 pm

అధికార పార్టీ టీడీపీలో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ కొత్త‌కొత్త ముఖాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇందులో అటు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో.. ఇటు జ‌నంలో ఆస‌క్తిరిరేకెత్తిస్తున్న ముచ్చ‌ట‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాల‌య్య చిన్న‌ల్లుడు ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారు..? అసెంబ్లీకా.. లేక ఎంపీకా.. మ‌ధ్య ఎమ్మెల్సీకా.. అని తెగ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. ఇందులో మ‌ధ్య‌లో ఎమ్మెల్సీగా వెళ్లే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విశాఖ ఎంపీగా పోటీ చేయాల‌ని చూసిన బాల‌య్య అల్లుడు భ‌ర‌త్ గురి మారిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

నిజానికి.. భ‌ర‌త్ తాత ఎంవీవీఎస్ మూర్తి ఎంపీగా పని చేశారు. ఎమ్మెల్సీగా ఉన్న స‌మ‌యంలో అమెరికాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇటీవ‌ల ప్రెస్‌మీట్ పెట్టి.. త‌న‌కు ఎంపీగా పోటీ చేయాల‌ని ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. కానీ.. రాజ‌కీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఎంపీ టికెట్ ద‌క్క‌ద‌నే టాక్ వినిపిస్తోంది. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా.. బీజేపీ నుంచి హ‌రిబాబు ఎంపీగా గెలిచారు. అయితే.. ఈసారి సామాజిక స‌మీక‌ర‌ణాలు కీల‌క పాత్ర పోషించే అవ‌కాశాలు ఉన్న నేప‌థ్యంలో టీడీపీకి కాపు, బీసీ సామాజిక‌వ‌ర్గాలు అత్యంత కీల‌కం కానున్నాయి.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ క‌మ్మ‌సామాజిక‌వ‌ర్గానికి చెందిన సినీ నిర్మాత‌, బిల్డ‌ర్ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ను బ‌రిలోకి దింపాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతోనే టీడీపీకి కూడా వ్యూహం మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈసారి మంత్రి, భిమిలీ ఎమ్మెల్యే కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌ గంటా శ్రీ‌నివాస‌రావును బ‌రిలోకి దించాల‌ని చూస్తోంద‌ట‌. ఆయ‌న‌కు క‌మ్మ సామాజిక‌వ‌ర్గంతో కూడా మంచి సంబంధాలు ఉన్న‌యి. అందుకే గంటాకు అవ‌కాశం ఇస్తే.. ఇటు కాపులు, అటు క‌మ్మ సామాజిక‌వ‌ర్గం నుంచి క‌లిసివ‌స్తుంద‌ని బాబు అనుకుంటున్నార‌ట‌. అందుకే ఈసారికి భ‌ర‌త్‌ను ఎమ్మెల్సీగా పంపించాల‌ని చంద్ర‌బాబు చూస్తున్నార‌ట‌.

బాల‌య్య అల్లుడిగారి గురి మారింది..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share