రెండేళ్ల‌లో జైలుకు బాబు..బీజేపీ కీలక నేత వ్యాఖ్యలు

June 26, 2019 at 12:21 pm

రాజ‌కీయాల్లో శాస్వ‌త మిత్రులు, శాస్వ‌త శ‌తృవులు ఉండ‌ర‌ని అంటారు. ఎరైనా స‌రే ప్ర‌త్య‌ర్థులేన‌ని చెబుతారు. కానీ, కేం ద్రంలో న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. మ‌న‌కు ఆస‌క్తిక‌ర అంశాలు క‌నిపిస్తున్నాయి. త‌మ మాట విన‌నివారిని త‌మ దారికి తెచ్చుకునేందుకు గ‌తంలో యూపీఏ హ‌యాంలో కాంగ్రెస్ కేసులు పెట్టి బెదిరించేది. మ‌హా అయితే, జైలుకు పంపి..బెయిలు వ‌చ్చేలా చేసేది. కానీ, మోడీ ప్ర‌భుత్వంమాత్రం ఒక్క సారి ఎవ‌రినైనా జైలుకు పంపితే.. ఇక‌, అక్క‌డే మ‌గ్గిపోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు బిహార్‌లో లాలూ ప్ర‌సాద్‌, త‌మిళ‌నాడులో శ‌శిక‌ళ‌.. ప్రొఫెస‌ర్ సాయిబాబు వంటి వారు క‌నిపిస్తున్నారు.

క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డంలో మోడీ స‌ర్కారును మించిన ప్ర‌భుత్వం లేద‌ని అంటున్నారు. ఇప్పుడు తాజాగా ఇదే విధంగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబును కూడా జైలుకు పంపాల‌నే వ్యూహంలో బీజేపీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి రాష్ట్రంలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. బాబుకు జైలు త‌ప్ప‌ద‌ని ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నాయ‌కులే బ‌హిరంగంగా ప్ర‌క‌టించి, ప్ర‌చారం కూడా చేశారు. అయితే, బాబును జైల్లో పెట్ట‌డం అంటే.. అంత‌మాట‌లు కాద‌నే విష‌యం త‌మ్ముళ్లు చెప్పారు. కానీ, ఇప్పుడు కేంద్ర‌మే త‌లుచుకుంటే.. బాబుకు జైలు ఖాయం. ఇదే విష‌యాన్ని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

‘రెండేళ్లలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును జైలుకు పంపడం ఖాయం. పేదల సంక్షేమం కోసమే పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయించినా వాటిని పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడ్డారు. ఎన్టీఆర్‌ బాహుబలి అయితే చంద్రబాబు కట్టప్ప మాదిరిగా తయారయ్యాడు. ఆయనను ఉపేక్షించడం జరగదు’’ అని దేవ‌ధ‌ర్ ప్ర‌క‌టించారు. అదేస‌మ‌యంలో ఆయ‌న మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

ఏపీని త్రిపుర చేసినట్లుగా చేస్తామని.. అక్కడ లాగా ఇక్కడ కూడా బీజేపీ జెండా ఎగరేస్తామని.. ప‌లువురు పేర్కొన్నారు. త్రిపుర విషయంలో బీజేపీ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం.. సునీల్ ధియోధర్. కొన్నాళ్ల క్రితం సునీల్‌ని బీజేపీ కో ఇన్చార్జ్ గా నియమించారు. మురళీధరన్ అనే ఇంకో నేతను ఇన్చార్జ్ గా నియమించింది. ఇప్పుడు ఈ మురళీధరన్‌కు కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. దీంతో సునీల్ ప్రధాన ఇన్‌చార్జ్ అయిపోయారు. సునీల్ దియోదర్ నరేంద్రమోడీకి సన్నిహితుడు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి.

రెండేళ్ల‌లో జైలుకు బాబు..బీజేపీ కీలక నేత వ్యాఖ్యలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share