బాబు రాజ‌కీయంలో మ‌రో నీతిమాలిన కార్యం

March 29, 2019 at 3:23 pm

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార పార్టీ టీడీపీ మ‌రి ఘోరంగా బ‌రితెగించింది. గెలుపుకోసం చంద్ర‌బాబు ఎన్నో ఎత్తులు, జిత్తులు వేస్తాడ‌ని తెలుసుగానీ, మ‌రీ ఇంత అస‌హ్యించుకునే రీతిలో ఉంటాయ‌ని మాత్రం ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. ఐదేళ్ల అరాచ‌కాల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డానికి మొత్తం యంత్రాంగాన్ని ఉన్న‌తాధికారుల‌ను గుప్పిట పెట్టుకున్న బాబు ఇప్పుడ ఎన్నిక‌ల వేళ మ‌రిన్ని చ‌వ‌క‌బారు ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. టీడీపీ డ‌బ్బులు పంచుతుంద‌ని తెలుసుకానీ, మ‌రీ ఇంత‌ల స‌ర్కార్ ఉద్యోగుల చేత అందునా శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడాల్సిన ర‌క్ష‌క భ‌టుల చేత ఇలాంటి ప‌నులు చేయిస్తార‌ని మాత్రం ఎవ‌రూ అనుకుని ఉండ‌రు. ఇక లాభం లేదు అనుకున్నారో ఏమో, డ‌బ్బులు పంప‌కాన్ని ప‌ట్టుకోవాల్సిన పోలీసుల‌తోనే పంప‌కానికి శ్రీ‌కారం చుట్టి చంద్ర‌బాబు చ‌రిత్ర స్రుష్టించారు.

గెలుపు గుర్రాలు జ‌గ‌న్ చేతిలోకి వెళ్లిపోయే ప్ర‌మాదం ఉంద‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబు క్యాడ‌ర్‌ను నైతికంగా అన్ని కార్యాల‌కు సిద్ధంచేశారు. ఇక ఎలాగైనా గెలుపును వ‌శం చేసుకోవాల‌ని, ఎంత‌కైనా తెగించాల్సిందేన‌ని ఆదేశాలు జారీ చేశారు. అంతే నీతిమాలిన ప‌నుల‌కు తెర‌లేపారు. అలాంటి ప‌నుల‌కు త‌న పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను వాడుకుంటే కొత్త విష‌య‌మేమి కాదు. అయినా అలాంటి విష‌యాలు బాబు రాజ‌కీయ చ‌రిత్ర ఎన్నో ఉన్నాయి కూడా. కానీ, చంద్ర‌బాబు ఇప్పుడు ఏకంగా పోలీసు కానిస్టేబుళ్లతో, స్వ‌యంగా వారి చేతుల మీదుగా ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తూ అడ్డంగా దొరికిపోయారు.

త‌న గుప్పిట్లో ఉన్న పోలీసు బాస్‌ల అండ‌దండ‌ల‌తో ఏదైనా చేయొచ్చ‌నే ఆలోచ‌న‌లో ఉన్న బాబుకు కానిస్టేబుళ్లు డ‌బ్బులు పంచుతూ దొరికిన ఘ‌ట‌న కాస్త ఇబ్బందిక‌రంగానే మారి ఉంటుంది. అయినా త‌న అనుయాయుల‌ను కాపాడుకోవ‌డానికి, త‌న కార్యాల‌ను పూర్తి చేసుకోవ‌డానికి ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌ను సైతం చంద్ర‌బాబు లెక్క‌చేయ‌ని విష‌యం తెలిసిందే. పోలీసు ఉన్న‌తాధికారి బ‌దిలీకి ఆదేశాలు ఇచ్చిన ఈసీ ఉత్త‌ర్వుల‌ను నిలువ‌రిస్తూ రాత్రికి రాత్రి చీఫ్ సెక్ర‌ట‌రీతో కొత్త‌కొత్త జీవోలు విడుద‌ల చేయించిన ఘ‌నుడు చంద్ర‌బాబు. ఎన్నిక‌ల వేళ ఓట‌ర్ల‌కు పంప‌కాలు, ప్ర‌స‌న్నాలు చేసుకోవ‌డానికి ట‌క్కుట‌మారి విద్య‌లు ప్ర‌ద‌ర్శించేందుకు ఇలాంటి అనుచ‌ర‌ణ గ‌ణం ఎంతైనా అవ‌స‌ర‌మ‌నే బాబు గారు ఎక్క‌డి అధికారుల‌ను అక్క‌డ సెట్ చేసి పెట్టుకుని ఉండి ఉంటారు. ఎన్నిక‌ల్లో గెలుపుకోసం ఇంత నీచ‌స్థాయికి దిగ‌జారిన బాబును మ‌రెక్క‌డా చూసి ఉండ‌మేమో. ఇంకా పద‌కొండు రోజుల ప్ర‌చార ప‌ర్వంలో ఇలాంటి నీతిమాలిన కార్యాలు ఎన్ని చూడాల్సి వ‌స్తుందో. ఎంతైనా బాబు గారా మ‌జాకా..!

బాబు రాజ‌కీయంలో మ‌రో నీతిమాలిన కార్యం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share