ఈ చిత్త శుద్ది హోదా మీద ఏది బాబు ?

November 9, 2018 at 3:55 pm

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల లో భారతీయ జనతా పార్టీ తో పొత్తు పెట్టుకుని గెలిచి కేంద్రం లో మంత్రి పదవులు కూడా అనుభవించారు. వారి హవా తగ్గిపోతున్నదని అనిపించగానే, ఇప్పుడు బిజెపి పార్టీ తో తెగతెంపులు చేసుకుని, ఆ పార్టీ కి వ్యతిరేకంగా జాతీయ స్ధాయిలో కూటమి ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనికి సంబంధించి ఆయన రెండు సార్లు డిల్లీ కి వెళ్లి బిజెపి కి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరే పనిలో బిజీ గా ఉంటున్నారు. ఇందులో భాగంగానే తమ తెలుగుదేశం పార్టీ బద్ద శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సైతం కలిశారు. బెంగుళూర్ లో జెడియస్ అధినేత, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ని, ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ ను కలిసి బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు పై మంతనాలు సాగించి, వారి ‘ఆశీస్సులు’ పొందారు. శుక్రవారం నాడు డియంకె అధినేత స్టాలిన్ కూడా కలిసి చంద్రబాబు కూటమి కి మద్దతును పొందేందుకు చర్చలు జరపనున్నారు.45687976_2354880981192146_6738098810276282368_n

మొన్నటి దాకా బిజెపి తోనే కలసి ఉన్న చంద్రబాబు, ఇప్పుడు ఆ పార్టీతో విడాకులు అయిన వెంటనే ఆ పార్టీ కి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కై చూపిస్తున్న శ్రద్ద లో కొంతైనా ప్రత్యేకహోదా పై చూపించిఉంటే.. ఎప్పుడో హోదా వచ్చి ఉండేదనే విమర్శలు ఇప్పుడు మిక్కిలిగా వినిపిస్తున్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ కు హోదా తోనే మనుగడ అని ఏపి ప్రజలు బలంగా భావిస్తున్నారు.04VJPG6-STALIN

ప్రత్యేక హోదా పై రకరకాల టర్న్ లు తీసుకున్న చంద్రబాబు, హోదా ను సాకు గా చూపి బిజెపి తో వేరు పడ్డ చంద్రబాబు, బిజెపి పార్టీ ని అధికారం లోకి రాకుండా చేసేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్న బాబు, హోదా విషయంలో మాత్రం అంత చిత్త శుద్ది ని ప్రదర్శించ లేకున్నారు. బిజెపి వ్యతిరేక కూటమి కి మద్దతుగా పొరుగు రాష్ట్రాల పార్టీ ల నేతలతోమంతనాలు సాగిస్తున్న ఆయన ప్రత్యేక హోదా సాధన లోను అదే పొరుగు రాష్ట్రాల మద్దతు ను ఏ మేరకు పొందగలరో వేచి చూడాలి.

నిజానికి ఇప్పుడింత కష్టపడి తిరుగుతూ రాజకీయం కోసం మద్దతు కూడగడుతున్న చంద్రబాబు.. ఇటీవల అవిశ్వాస తీర్మానం సమయంలో.. ఇదే తరహాలో తమ హోదా డిమాండుకు ఇతరుల మద్దతు కూడగట్టలేదని విమర్శలున్నాయి. ఆ కోణంలో చూసినప్పుడు ఆయనలో ఎంతమాత్రమూ చిత్తశుద్ధి లేదని, కేవలం రాజకీయ వ్యూహశుద్ధి మాత్రమే ఉన్నదని అనిపిస్తోంది.

ఈ చిత్త శుద్ది హోదా మీద ఏది బాబు ?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share