చంద్రబాబు.. ఇప్పుడెలా బుకాయిస్తారో?

September 8, 2018 at 3:39 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుకాయించడంలో ఉద్ధండులు. తాను ఏం చేస్తే అది చాలా సబబు అని ప్రజలను తాను ఈజీగా నమ్మించగలనని ఆయనకు ఒక విశ్వాసం. ప్రజలు తాను ఏం చెప్పినా నమ్మేసే వెర్రివాళ్లని కూడా ఆయనకు విశ్వాసం ఉండొచ్చు. అందుకే ఎన్నిసార్లు ప్లేటు ఫిరాయించడానికైనా.. ప్రతి తప్పునూ ఇతరుల మీదకి నెట్టడానికి, ప్రతి ఒప్పునూ తన ఖాతాలో వేసుకోవడానికి ఆయన వెనకాడరు. అలాంటి చంద్రబాబు ఇరకాటంలో పడే పరిస్థితి వచ్చిందిప్పుడు. మరి ఈ సందర్భంలో ఆయన ప్రజలను ఎలా బుకాయించగలుగుతారో వేచిచూడాలి.chandrababu-naidu

ఇంతకూ విషయం ఏంటంటే… దేశంలో పెట్రో ధరలు ఎంత అసహ్యంగా, అనూహ్యంగా పెరుగుతున్నాయో అందరికీ తెలుసు. కేంద్రం ఈ విషయంలో నీరో పాలనను గుర్తుకు తెస్తోంది. ధరలు ఎలా పెరిగినా మాకు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. మొన్నటిదాకా మోడీ పల్లకీ మోసిన చంద్రబాబునాయుడు, ఆరోజుల్లో కూడా పెట్రోధరలు విపరీతంగా పెరిగినా స్పందించలేదు గానీ.. ఇప్పుడు కేంద్రం మీద కత్తులు నూరుతున్నారు. ప్రజలు ఎంత అమాయకులని ఆయన అనుకుంటారో ఏమో తెలియదు గానీ.. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కంటె ఆంధ్రప్రదేశ్ లో పెట్రోధరలు ఎక్కువగా ఉన్నా.. కేంద్రాన్ని మాత్రం నిందిస్తూ గడిపేస్తున్నారు. రాష్ట్రం విధించిన అదనపు పన్నుల ఊసెత్తకుండా.. ప్రజల మీద పడే భారానికి కేంద్రాన్ని మాత్రం బాధ్యత వహించమంటున్నారు. అదంతా కూడా ఓకే అనుకోవచ్చు.

మరి ఇప్పుడు.. పెట్రో ధరల పెంపునకు వ్యతిరేకంగా 10వతేదీన బంద్ కు విపక్షాలు పిలుపు ఇచ్చాయి. తన రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏ బంద్ జరిగినా సరే.. తన పార్టీకి సంపూర్ణమైన క్రెడిట్ దక్కే అవకాశం లేనప్పుడు.. పోలీసు బలగాలతో ఆ ఉద్యమాన్ని అణచివేయడం చంద్రబాబుకు అలవాటు. ఇన్నాళ్లూ ఆయన కేంద్రానికి కొమ్ముకాశారు గనుక… సరిపోయింది. కానీ ఇప్పుడైనా అంటే తాను కూడా వ్యతిరేకిస్తున్న పెట్రోధరల విషయంలో జరగబోయే బంద్ ను ఆయన అడ్డుకోకుండా ఉంటారా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది._60614756_60611822

నిజానికి భాజపాతో కటీఫ్ చెప్పిన తర్వాత కూడా, ప్రత్యేకహోదా కోసం వైకాపా రాష్ట్ర బంద్ నిర్వహిస్తే.. చంద్రబాబు దానిని అణచివేయడానికి ప్రయత్నించి తన సంకుచిత బుద్ధిని చాటుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్రో బంద్ కు పిలుపు ఇస్తున్నది గనుక.. క్రెడిట్ తమకు రాదు గనుక.. దానిని తొక్కేస్తారా? లేదా, కాంగ్రెస్ తో పొత్తులకు తహతహలాడుతున్న తరుణంలో అనుమతించి.. మరో రకంగా బుకాయిస్తారా? వేచిచూడాలి.

చంద్రబాబు.. ఇప్పుడెలా బుకాయిస్తారో?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share