చంద్రబాబు తాను మునిగాడు… కాంగ్రెస్‌ను ముంచాడు..!

November 2, 2018 at 1:27 pm

ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుకు సిద్ధం కావడం ఖాయం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో తాను నిండా మునగడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ఆనవాళ్లు లేకుండా చెస్తున్నట్టే స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు రాజకీయ జిమ్మిక్కులతో ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్లోజ్‌ అయ్యింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బ్రతికించుకొనేందుకు మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయ వైరం ఉండి ఏ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేఖంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో అదే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నిన్న తాజాగా ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని క‌లవడంతో పాటు… ఏపీ ఎన్నికల్లోనూ ఆ పార్టీతో పొత్తుకు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు ఇవ్వడంతో చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఎంత నిలువునా ముంచేశాడో జాతీయ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. 45214687_2344396942240550_8580180579536863232_n

తెలుగుదేశం, కాంగ్రెస్ మధ్య‌ ఎంత బద్దమైన వైరం ఉందంటే ఇప్పటికీ ఈ రెండు పార్టీల్లో ఉన్న కొంత మంది నాయకులు రాజకీయంగా నిత్యం విమర్శలు చేసుకుంటుంటారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎంతో మంది సీనియర్లు ఆ పార్టీ ఆవిర్భవానికి ముందు సైతం కాంగ్రెస్‌తో విబేధించినవారే. కాంగ్రెస్‌ పార్టీ నియంతృత్వం, నిరంకుశ రాజకీయ విధానాలకు వ్యతిరేఖంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలోకి వచ్చిన పలువురు సీనియర్లు ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో చంద్రబాబు చెలిమి చెయ్యడాన్ని ఏ మాత్రం సహించలేకపోతున్నారు. అదే టైమ్‌లో తెలుగుదేశం పార్టీ అంటే ఏ మాత్రం సహించక కాంగ్రెస్ వాదులుగానే దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న సీనియర్లు ఉన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీ తమను వ్యతిరేకిస్తూ పుట్టిన తెలుగుదేశంతో చేతులు కలపడాన్ని కాంగ్రెస్ వాదులు సైతం సహించలేని పరిస్థితి.45367204_2344480632232181_265614323911491584_n

దశాబ్దాల వైరం ఉన్న కాంగ్రెస్‌, తెలుగుదేశం కలిసి తెలంగాణ ఎన్నికలతో పాటు ఇటు ఏపీలోనూ కలిసి పోటీ చేసేందుకు దాదాపు రెడీ అవ్వడంతో పాటు చివరకు చంద్రబాబు డైరెక్షన్‌లో కాంగ్రెస్‌ నడుస్తుండడాన్ని సహించలేని భయంకర కాంగ్రెస్ వాదులు సైతం ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ సీనియర్‌ కాంగ్రెస్ నేత‌లు ఆ పార్టీకి షాక్‌ ఇస్తున్నారు. తాజాగా ఆ రెండు పార్టీల మధ్య‌ పొత్తు కుదరడంతో ఏపీకి చెందిన మాజీ మంత్రి వ‌ట్టి వసంత కుమార్‌ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసారు. తెలుగుదేశంతో కాంగ్రెస్‌ అవగాహనకు రావడం తనకు ఏ మాత్రం నచ్చలేదని కాంగ్రెస్ వాదిగా దీనిని తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీకి పంపిన తన రాజీనామ లేఖలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. 45104688_2344480642232180_8739492435647791104_n

వ‌ట్టి వసంత కుమార్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడాన్ని సహించలేని నాయకులు పలువురు ఇప్పుడు అదే బాటలో ఉన్నారు. ఏదేమైనా తన రాజకీయ లబ్ది కోసం, తెలుగుదేశం పార్టీని బ‌తికించుకోవడం కోసం చంద్రబాబు వేసిన రాజకీయ స్కెచ్‌లో తాను నిండా మునగడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీని సైతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత లోతుకు ముంచేసినట్లేనని పలువురు రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

చంద్రబాబు తాను మునిగాడు… కాంగ్రెస్‌ను ముంచాడు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share