తమ్ముళ్లు జర జాగ్రత్త ..లైట్ తీసుకో బాబు

November 9, 2018 at 5:22 pm

అంద‌రూ త‌న‌లా ఉండాల‌ని అనుకోవ‌డం త‌ప్పు. అంద‌రూ త‌న‌లాగా నిరంత‌రం కృషి చేయాల‌ని భావించ‌డం భ్ర‌మ‌. కానీ , ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం.. ఆ త‌ప్పును ప‌దే ప‌దే చేస్తూ.. ఈ భ్ర‌మ‌లో నిత్యం నివ‌సిస్తున్నార‌ని అం టున్నారు ప‌రిశీల‌కులు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇంటింటికీ టీడీపీ, ద‌ళిత తేజం వంటి కార్య‌క్ర‌మాల‌ను రంగంలోకి దిం పారు చంద్ర‌బాబు. ఈకార్య‌క్ర‌మాల ఆధారంగా త‌మ్ముళ్ల‌కు మార్కులు వేశారు. ప్ర‌జ‌ల్లో తిరిగితేనే నేత‌ల‌కు టికెట్లు అంటు న్నారు. ఇక‌, గ్రామ‌ద‌ర్శినిని తెచ్చారు. ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌తి ప‌నీ కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ఆయ‌న చెబుతున్నారు. ఈ క్ర‌మంలో గ్రామ‌ద‌ర్శినిని అధికారుల‌తోనూ చేయించారు. ఆఖ‌రుకు పోలీసుల‌కు కూడా ఈకార్య‌క్ర‌మాన్ని అప్ప‌గించారు.45705407_2352369171443327_4718664711648837632_n

నేత‌ల విష‌యానికి వ‌స్తే.. కొత్త‌గా ఎన్నికైన వారు ఒక‌మేర‌కు ఫ‌ర్వాలేదు కానీ, రాజ‌కీయంగా కొంత స్థిర‌త్వం చూపించిన ఎ మ్మెల్యేలు ఎక్క‌డా ఈ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌లేదు. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబే ఇటీవ‌ల స్వ‌యంగా వెల్ల‌డించారు. దాదాపు 67 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు గ్రామ‌ద‌ర్శిని కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌లేద‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, ఇప్పుడు తాజాగా చంద్ర‌బాబు ర‌చ్చ‌బండ పేరుతో మ‌రో వినూత్న కార్య‌క్ర‌మానికి తెర‌దీశారు ప్ర‌తి ఒక్క‌రూ ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములు కావాల‌ని, ఏ ఒక్క‌రినీ విడిచి పెట్టేది లేద‌ని ఆయ‌న అంటున్నారు. అంతేకాదు, ఈ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి స‌ర్వే కూడా చేయిస్తాన‌ని, వీటి రిజ‌ల్ట్ ఆధారంగానే తాను మార్కులు వేసి.. టికెట్లు ఇస్తాన‌ని ఆయ‌న చెబుతున్నారు. కానీ, ఈ వ్యాఖ్య‌ల‌ను, బాబు బెదిరింపుల‌ను నేత‌లు పెద్ద‌గా లెక్క‌చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం

దీనికి కార‌ణం ఏంటి? అని చూస్తే.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో అక్క‌డి సిట్టింగు టీడీపీ నాయ‌కుల‌కు ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ డ‌మే. ప్ర‌స్తుతం సిట్టింగులుగా ఉన్న నాయ‌కులకు ప‌నిచేయ‌డం లేద‌ని పేర్కొంటూ టికెట్ నిరాక‌రించే ప‌రిస్థితి లేదు. ఇలా ఒక‌టి కాదు రెండు దాదాపు 60 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల‌ను చంద్ర‌బాబుకు మార్చే ప‌రిస్థితి లేదు. ఇక్క‌డ ప్ర‌త్యామ్నాయంగా ఎవ‌రిని నిల‌బెట్టినా.. సిట్టింగుకు ఆగ్ర‌హం తెప్పించినా.. ఆటోమేటిక్‌గా.. వైసీపీ లేదా మ‌రో పార్టీ గెలిచి సీటు ద‌క్కించుకునే ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు పైకి ఎలాంటి హెచ్చ‌రిక‌లు చేస్తున్నా.. వాస్త‌వ ప‌రిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఒక చెవితో వింటున్న ఇలాంటి నాయ‌కులు మ‌రో చెవితో విడిచిపెడుతున్నారు. ఈ ప‌రిణామం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉండ‌డంతో బాబు మాట‌లు రాసుకోడానికి, విన‌డానికే ప‌రిమిత‌మ‌వుతున్నాయ‌ని అనంత‌పురానికి చెందిన ఓ సీనియ‌ర్ నాయ‌కుడు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. సో.. మొత్తానికి బాబు క్ర‌మ‌శిక్ష‌ణ ఇదీ!!

తమ్ముళ్లు జర జాగ్రత్త ..లైట్ తీసుకో బాబు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share