చంద్ర‌బాబు…చాప్ట‌ర్ ఫినిష్‌..!

April 10, 2019 at 6:46 pm

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ఖాయంగా క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు త‌న స‌హ‌జ‌శైలి న‌ట‌నను, సెంటిమెంట్‌ను ప్ర‌జ‌ల ముందు పండిస్తున్నారనే అభిప్రాయం జ‌నాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే ఎంత న‌ట‌న ప్ర‌ద‌ర్శించినా ఈసారి చంద్ర‌బాబుకు బుద్ధి చెప్పాల‌నే కృత‌నిశ్చ‌యం ప్ర‌జ‌ల్లో బ‌లంగా క‌న‌బ‌డుతోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని అర్థం చేసుకున్న టీడీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్న‌ట్లు స‌మాచారం. అయితే చివ‌రి ప్ర‌య‌త్నంగా కోటానుకోట్ల రూపాయాల‌ను ప్ర‌జ‌లను ప్ర‌లోభ‌పెట్టేందుకు వినియోగిస్తున్న‌ట్లు స‌మాచారం. విప‌రీతంగా మందు, మ‌నీ పంచుతూ ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే ఈ ప్ర‌భావం కేవ‌ల 5శాతానికి మించి ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. వైసీపీ ఘ‌న విజ‌యాన్ని ఎవ‌రూ ఎన్నికుయుక్తులు ప‌న్నినా ఆప‌లేరన్న‌ది ఆ పార్టీ నేత‌ల ధీమా..! మరోసారి చంద్రబాబు చేతిలో వంచనకు గురి కావద్దు అన్న భావన నాలో బలంగా కనబడుతోంది. ఇక తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కేసీఆర్‌ను దూషించి త‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు బాబు చేస్తున్న కుటిల నీతి వ్య‌వ‌హారాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, ప్ర‌జ‌లు ఓటుతోనే రెండు క‌ళ్ల సిద్ధాంతం చంద్ర‌బాబుకు త‌గిన బుద్ధి చెబుతార‌ని వైసీపీ నేత‌లు పేర్కొంటున్నారు.

ఇప్ప‌టికే పేప‌ర్‌, టీవీల్లో త‌న‌కు అనుకూలంగా ప్ర‌చారం చేసుకుంటూ జ‌నాల‌ను న‌మ్మించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌తో జ‌నాల్లో ఈస‌డింపు మొదలైంద‌ని తెలుస్తోంది. ఇదే విష‌యంలో ఆయ‌న చేయించుకున్న స‌ర్వేల్లోనూ వెల్ల‌డైన‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ ఘ‌న విజ‌యం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. జ‌గ‌న్ రావాలి..జ‌గ‌న్ కావాలి అన్న నినాదానికి జ‌నాలు క‌నెక్ట‌య్యార‌ని, రాజ‌న్న రాజ్యం మ‌ళ్లీ రావాల‌ని కోరుకుంటున్నార‌ని పేర్కొంటున్నారు. మ‌రి కొద్ది రోజుల్లో చంద్రబాబు పీడ విర‌గ‌డ‌వుతుంద‌న్న భావ‌న జ‌నాల్లో వ్య‌క్త‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇక టీడీపీ బ‌లంగా ఉందనుకుంటున్న ఉభ‌య గోదావ‌రి, విశాఖ ప‌ట్ట‌ణం లాంటి ప్రాంతాల్లో ఆ పార్టీకి నామ రూపాల్లేని ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయ‌ని తెలుస్తోంది.

చంద్ర‌బాబు…చాప్ట‌ర్ ఫినిష్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share