బాబు రివ్యూ …టీడీపీ నేతల్లో ఒణుకు

May 1, 2019 at 3:26 pm

ఏపీ అధికార పార్టీ టీడీపీలో టెన్ష‌న్ మొద‌లైంది. ముఖ్యంగా దిగువ శ్రేణి నాయ‌కుల్లో మ‌రింత‌గా ఒణికి పోతున్నారు. దీనికి కార‌ణం.,. పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు రివ్యూ ప్రారంభించ‌డ‌మే. ఈ నెల 11న జ‌రిగిన ఎన్నిక‌ల‌కు సంబంధించి చం ద్ర‌బాబు పార్టీ నేత‌ల ప‌నితీరుపై పోస్ట్ మార్ట‌మ్ ప్రారంభించారు. బుధ‌వారం నుంచి ఆయ‌న వ‌రుస‌గా అన్ని పార్ల‌మెం ట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కుల‌ను నేరుగా అమ‌రావ‌తికి పిలిపించి తలం టేందుకు రెడీ అయ్యారు. వాస్త‌వానికి రివ్యూ మీటింగ్ అని అంటున్నా.. దీనికి చాలా కార‌ణాలే ఉన్నాయి. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ఎన్నిక‌ల స‌మ‌యంలో స‌రిగా ప‌నిచేయ‌ని నాయ‌కుల‌కు ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు క్లాస్ తీసుకుంటార‌ని అం టున్నారు.

ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌ల‌ను చంద్ర‌బాబు చాలా సీరియ‌స్‌గా తీసుకున్న విష‌యం తెలిసిందే. గ‌తానికి భిన్నంగా ఆయ న ఒంట‌రిగా రంగంలోకి దిగారు. తొలిసారి ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా, సెల‌బ్రిటీల ద‌న్ను తీసుకోకుండానే చంద్ర‌బాబు ఫైట్ చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీలోని ప్ర‌తి ఒక్క‌రికీ ఈ ఎన్నిక‌ల ప్రాధాన్యాన్ని దాదాపు ఏడాది ముందు నుంచి వివ‌రించారు. ప్ర‌తి ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని, ఎంత ప‌నిచేస్తే.. అంత గుర్తింపు ఇస్తాన‌ని, ప్ర‌మోష‌న్లు ఉంటాయ‌ని కూడా ఊరించారు. ప్ర‌తి ఒక్క‌రిపైనా బాబు అనేక ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, ఇది ఎంత వ‌ర‌కు ప‌నిచేసింది? ఏమే ర‌కు త‌మ్ముళ్లు క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు? ఎంత వ‌ర‌కు టీడీపీని గెలిపించేందుకు ముందుకు సాగారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి.

ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత టీడీపీ ఓడిపోతుంద‌నే ప్ర‌చారం జోరుగా సాగిన నేప‌థ్యంలో ఒకానొక ద‌శ‌లో హేమాహేమీలు కూడా ఓడిపోతార‌నే సంకేతాలు వెలువ‌డిన నేప‌థ్యంలో అస‌లు త‌న గ‌ణం ఏమేర‌కు పోల్ మేనేజ్‌మెంట్‌లో పాల్గొన్న‌దీ బాబును క‌ల‌వ‌ర‌ప‌రిచిన విష‌యం వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే పోల‌వరం, మాచ‌ర్ల‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, నంద్యాల‌, క‌ర్నూలు, గాజువాక‌, భీమ‌వ‌రం, ఏలూరు, విశాఖ ఎంపీ, రాజ‌మండ్రి సిటీ, రాజ‌మండ్రి ఎంపీ స్థానాల్లో ఏమేర‌కు సీనియ‌ర్లు స‌హ‌క‌రించార‌నే విష‌యంపై చంద్ర‌బాబు ఇప్ప‌టికే నివేదిక‌లు తెప్పించుకున్నారు. దీని ఆధారంగా ఆయ‌న ఆయా నియోన‌జ‌క‌వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కుల‌తో భేటీ అయి.. ప‌నిచేయ‌డంలో ఎందుకు అల‌స‌త్వం వ‌హించార‌నే విష‌యంపై దృష్టి పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్ర‌మంలో బాబు ఏం చేస్తార‌నే ఆస‌క్తి ఒకప‌క్క‌, త‌మ భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందోన‌నే ఆందోళ‌న మ‌రోప‌క్క నాయ‌కుల‌ను వెంటాడుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

బాబు రివ్యూ …టీడీపీ నేతల్లో ఒణుకు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share