గెల‌వ‌లేక గుండాగిరి..!

April 12, 2019 at 11:35 am

తెలుగుదేశం ఐదేళ్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం వెల‌గ‌బెట్టిన పార్టీ. కొత్త‌గా ఏర్ప‌డిన ఒక రాష్ర్టాన్ని త‌న చేతుల్లో ఇష్ట‌మున్న‌ట్టుగా ఆటాడించిన ఘ‌న చ‌రిత్ర ఉన్న నాయ‌కులున్న పార్టీ. అభివ్రుద్ధిని ప‌క్క‌న పెట్టి అరాచ‌కాల‌ను పోషిస్తూ అనుచ‌ర‌గ‌ణానికి స‌ర్వ హ‌క్కులు అంట‌గ‌ట్టిన పెద్ద‌మ‌నిషిని క‌లిగిన గొప్ప పార్టీ. ఎన్నిక‌ల వేళ ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ప‌డ‌రాని పాట్లు ప‌డిన స‌ద‌రు పార్టీ నాయ‌క‌త్వానికి నిన్న‌టి ఎన్నిక‌లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీకి ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన ఆద‌ర‌ణ‌ను జీర్ణించుకోలేక అఘాయిత్యాల‌కు పాల్ప‌డిన త‌మ్ముళ్ల‌ను పోషించిన పార్టీ.

ఏప్రిల్ 11న ఓట‌రు త‌న తీర్పును నిక్షిప్తం చేసే రోజు ఎంతో హుందాగా నడుచుకోవాల్సిన దినం. అధికారం చేతులో ఉన్న‌ప్పుడు ఇంకా అప్ర‌మ‌త్తంగా ఉండాలి. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల్ని నీరు గార్చే ప‌నికి ఎవ‌రు పాల్ప‌డినా క‌ఠినంగా శిక్షించాల్సిన త‌రుణం. అలాంటి నిన్న ఆంధ్ర‌ప్రదేశ్ మొత్తంగా తెలుగుదేశం నాయ‌కుల దౌర్జ‌న్యాల‌తో అట్టుడికిపోయిందంటేనే పాల‌న ఎంత అధ్వానంగా మారిందో తెలుసుకోవ‌చ్చు. చంద్ర‌బాబు మ‌రోమారు పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్ట‌డానికి నానా హంగామా చేస్తూ పైకెళ్లి ప్ర‌తిప‌క్షాల‌ను నిందించ‌డం ప‌నిగా పెట్టుకుని అడ్డంగా దొరికిపోయారు.

అధికారాన్ని వెల‌గబెట్టే పార్టీలు ఎప్పుడైనా ఎన్నిక‌ల వేళ చాలా ప్ర‌భావితం చేస్తాయ‌నే క‌నీస ధ‌ర్మాన్ని మ‌రిచి గెల‌వ‌డం చేతగాక వైసీపీ నేత‌ల‌పై దాడుల‌కు తెగించేలా బాబుగారు డైరెక్ష‌న్ చేశారు. ఆయ‌న ఆదేశాల‌తో రెచ్చిపోయిన తెలుగుదేశం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప‌లు ప్రాంతాల్లో వైసీపీ నేత‌ల‌పై భౌతిక దాడుల‌కు దిగారు. ఎమ్మెల్యే అభ్య‌ర్థులపై కూడా ఇష్టారాజ్యంగా దాడుల‌కు దిగారు. కొన్ని ప్రాంతాల్లో స్వ‌యంగా పోలీసుల సాక్షిగా వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేసుకుని హింసించారు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టి ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేశారు. అధికారంలో ఉన్న ఒక పార్టీ ఇంత నీచంగా ప్ర‌వ‌ర్తించ‌డం పై రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న బాబు లాంటి వ్య‌క్తి ప‌వ‌ర్ కోసం ఇంత నీచ‌మైన చ‌ర్య‌ల‌కు పూనుకోవ‌డంపై ప‌లువురు మండిప‌డుతున్నారు. ప్ర‌జ‌ల‌కు సేవ‌చేయ‌డానికి పోటీ ప‌డాల్సిన నాయ‌కులు పీఠాన్ని ద‌క్కించుకోవ‌డానికి చ‌ట్ట‌వ్య‌తిరేక కార్యాల‌కు పాల్ప‌డ‌డంపై తీవ్ర అసంత్రుప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటిది ముమ్మాటికి ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లిపెట్టే అని పేర్కొంటున్నారు.

గెల‌వ‌లేక గుండాగిరి..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share