బాబు ఆట‌కు బ‌ల‌వబోతున్న భ‌ర‌త్‌..

April 15, 2019 at 9:44 am

ఆంధ్ర‌ప్ర‌దేశ్లో ఎన్నిక‌లు ముగిశాయి.. పార్టీలు హోరాహోరీగా, ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లుగా ప్ర‌చారాలు చేసుకున్నాయి. హుందాగా న‌డుచుకోవాల్సిన నాయ‌కులు కూడా దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు దిగి ప‌రువు తీసుకున్నారు. ప్ర‌జాద‌ర‌ణ లేకుండా పోవ‌డంతో ఏం చేస్తున్నామో తెలియ‌కుండా ఇష్ట‌మున్న‌ట్టు వ్య‌వ‌హ‌రించి అబాసుపాల‌య్యారు. ఎలాగోలా ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఇప్పుడు ఈవీఎంల‌పై నెపం నెడుతూ చంద్ర‌బాబు మ‌రోమారు కొత్త‌రాజ‌కీయం చేయ‌డానికి ప‌న్నాగాలు ప‌న్నుతున్న విష‌యం తెలిసిందే. కాగా, అదే స‌మ‌యంలో ఎన్నిక‌లు కొన్ని కుటుంబాల మ‌ధ్య చిచ్చును రాజిన‌ట్టు తెలుస్తోంది.

చంద్ర‌బాబు ఆడిన రాజ‌కీయ జూదం ఇటు నారా వారి కుటుంబానికి, అటు నంద‌మూరి ఫ్యామిలీకి మ‌ధ్య అగ్గి రాజేసింది. విశాఖ ఎంపీ టిక్కెట్‌ను మొద‌ట జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌కు కేటాయించిన‌ట్టు లీకులిచ్చి బాబు వేడుక చూశారు. అదే స‌మ‌యంలో ఆ టిక్కెట్టును లోకేశ్ తోడ‌ల్లుడు భ‌ర‌త్‌కు ఇవ్వాల‌ని ఒత్తిడి రావ‌డంతో ల‌క్ష్మీనారాయ‌ణను త‌న మిత్ర ప‌క్ష‌మైన జ‌న‌సేన‌కు పంపించి అక్క‌డ నుంచి పోటీలో నిలిపారు. పేరుకు మాత్రం టీడీపీ త‌ర‌ఫున భ‌ర‌త్ బ‌రిలో నిలిచారు. కానీ తెలుగుదేశం మ‌ద్ద‌తు మాత్రం ముమ్మాటికి జేడీకే ఉన్న‌ట్టు తెలుస్తోంది. జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఓట్లేయించ‌డానికి లోకేశ్‌, చంద్ర‌బాబు తీవ్రంగా మంత‌నాలు జ‌రిపిన‌ట్టు స‌మాచారం.

ఎన్నిక‌ల్లో త‌న‌కు జ‌రిగిన అవ‌మానానికి భ‌ర‌త్ తీవ్రంగా నొచ్చుకున్నాడు. కావాల‌ని త‌న‌ను తొక్కేశార‌ని తీవ్రంగా నొచ్చుకున్న భ‌ర‌త్ ఈ మ‌ధ్య ఎన్నిక‌ల త‌ర్వాత ఏర్పాటు చేసిన విందుకు కూడా హాజ‌రుకాలేద‌ని తెలుస్తోంది. సొంత మ‌నిషిన‌ని కూడా చూడ‌కుండా త‌న‌తో రాజ‌కీయంగా ఆడుకున్న తోడ‌ళ్లుడు, ఆయ‌న తండ్రిగారైన చంద్ర‌బాబు వైఖ‌రిపై భ‌ర‌త్ తీవ్ర అస‌హ‌నంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా మొన్న‌టి ఎన్నిక‌లు అటు నారా వారి కుటుంబానికి, ఇటు నంద‌మూరి కుటుంబానికి చిచ్చుపెట్టే మాదిరిగా మారాయి. చూద్దాం ఏం జ‌రుగుతుందో.

బాబు ఆట‌కు బ‌ల‌వబోతున్న భ‌ర‌త్‌..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share