ఆంధ్ర‌లోచెల్ల‌ని రూపాయి.. ఢిల్లీలో చెల్లుద్దా…?!

April 13, 2019 at 4:13 pm

చంద్ర‌బాబు మాన‌సిక స్థితి ఏం బాలేదు. ఓట‌మి పాలైతామ‌ని చెప్పి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. రాజ‌కీయ నాయ‌కుడు ఎప్పుడూ ఒకే తీరుగా వ్య‌వ‌హ‌రించాలి. ఈవీఎంలు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టి తెప్పించుకున్న బాబు ఇప్పుడు మాత్రం ఈవీఎంల‌పై అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం మ‌రీ విడ్డూరంగా ఉంది. ఇలాంటి అవ‌కాశ వాద నాయ‌కుడిని దేశం మొత్తంగా ఎక్క‌డ చూసినా క‌నిపించరు. అని బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్ట ఉపాధ్య‌క్షుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు. మీడియా ముందు బాబు మాట్లాడుతున్న తీరుపై ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

టెక్నాల‌జీని వాడుకోవ‌డంలోత‌న త‌ర్వాతే ఎవ‌రైనా అని చెప్పే బాబుగారు, ఎన్నిక‌ల వేళ అస‌లు రూపం చూపించార‌న్నారు. ఓటు వేసిన వ‌చ్చిన రెండు గంట‌ల త‌ర్వాతే 30 శాతం ఈవీఎంలు ప‌నిచేయ‌డం లేద‌ని అస‌త్య‌పు ఆరోప‌ణ‌కు దిగార‌న్నారు. రూ.5 కోట్లు ఇస్తే ఈవీఎంల‌ను మేనేజ్ చేస్తామ‌ని త‌న‌తోనే చెప్పార‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం చూస్తుంటే ఆయ‌న కార్యాల‌యం దొంగ‌ల‌కు అడ్డ‌గా మారింద‌నే విష‌యాన్ని ఒప్పుకున్న‌ట్టే న‌ని చెప్పారు. ఏపీ దొంగ‌లంతా చంద్ర‌బాబు చుట్టే ఉన్నార‌ని విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి పేర్కొన్నారు.

త‌న ఓటు త‌న‌కే ప‌డిందో లేదోన‌ని అనుమానంగా ఉంద‌నిచంద్రబాబు మాట్లాడ‌డం చూస్తుంటే కేఏపాల్ మాటల్లోని హాస్యానికి, ఆయ‌న మాటల్లోని హాస్యానికి తేడాలేద‌న్నారు. అయినా వీవీ ప్యాట్స్ కావాల‌ని చెప్పింది కూడా చంద్ర‌బాబే అని ఆయ‌న గుర్తు చేశారు. ఈడీలు, సీబీఐలు రావొద్ద‌ని జీవోలు ఇచ్చింది బాబుగారేన‌ని, టీడీపీ నేత‌ల‌ను ఇష్టారీతిగా వ్య‌వ‌హ‌రించండి అని చెప్పింది కూడా ఆయ‌నే దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ప‌నిమ‌నుషుల్లా చూసే బాబుకు మాన‌సిక స్థితి ఎలా ఉందో అర్థం కావ‌డం లేద‌ని, ప్ర‌తిప‌క్షాల‌ను క‌లుస్తాన‌ని చెప్పిన ఆయ‌న రాష్ర్టంలోనే చెల్ల‌డం లేద‌ని, ఇక ఢిల్లీలో ఎలా చెల్లుతారో అర్థం కావ‌డం లేద‌న్నారు.

ఆంధ్ర‌లోచెల్ల‌ని రూపాయి.. ఢిల్లీలో చెల్లుద్దా…?!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share