బాబుకు ఈసీ మ‌ళ్లీ షాక్‌..!

April 20, 2019 at 12:20 pm

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుకు ఆ రాష్ర్ట ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం తేరుకోలేని షాక్ ఇచ్చారు. ఎన్నిక‌ల కోడ్కు వ్య‌తిరేకంగా బాబు స‌ర్కార్ విడుద‌ల చేసిన 18 జీవోల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం సిఫార్సుల‌తో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో సుబ్ర‌హ్మ‌ణ్యం ఆయా జీవోల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు తేల్చేశారు. అలాగే, బాబు నిర్వ‌హించిన స‌మీక్షాస‌మావేశాల‌కు హాజ‌రైన సుమారు 16 మంది అధికారుల‌కు ఎన్నిక‌ల సంఘం నుంచి సంజాయిషీ ఇవ్వాల‌ని నోటీసులు కూడా అందాయి.

నిజానికి ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌చ్చిన త‌ర్వాత ఒక రాష్ర్ట ముఖ్య‌మంత్రి స‌మీక్ష‌లు నిర్వ‌హించొద్ద‌నే నిబంధ‌న ఉంది. కేవ‌లం ప్ర‌క్రుతి విప‌త్తులు, అత్య‌వ‌స‌రాలు అయిన‌ప్పుడు మాత్ర‌మే అది కూడా ఈసీ ముంద‌స్తు అనుమ‌తితో మాత్ర‌మే మీటింగ్‌లు నిర్వ‌హించాల్సిన వేళ చంద్ర‌బాబు ఒంటెత్తు పోక‌డ‌ల‌కు పోయి ఏక పక్షంగా స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. అది కూడా పోల‌వ‌రం, సీఆర్డీయేపై స‌మీక్ష‌లు జ‌రిపి అందునా పార్టీకి ల‌బ్ధి చేకూర్చే విష‌యాల‌పై మాత్ర‌మే మాట్లాడిన‌ట్టు తెలుస్తోంది. వీట‌న్నింటిపై ఈసీ సీరియ‌స్ అయ్యింది.

కాగా, ఆప‌ద్ధ‌ర్మంగా కొన‌సాగుతున్న చంద్ర‌బాబు, కోడ్ అమ‌లులో ఉండ‌గా విడుద‌ల చేసిన జీవోల‌న్నీ కూడా కాంట్రాక్ట‌ర్ల బిల్లుల‌కు సంబంధించిన‌వే అని తేల‌డంతో వాట‌న్నింటినీ ర‌ద్దు చేస్తున్న‌ట్టు సీఎస్ తెలియ‌జేశారు. పైగా స‌మీక్ష‌ల‌కు హాజ‌రైన అధికారులు కూడా వెంట‌నే సంజాయిషీ ఇవ్వాల‌ని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కోడ్ స‌మ‌యంలో బాబు నిర్వ‌హించిన స‌మీక్ష‌ల‌కు ఎలా హాజ‌ర‌వుతార‌ని స‌ద‌రు అధికారుల‌పై ఈసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. మొత్తంగా బాబుకు ఈసీ మ‌రో జ‌ల‌క్ ఇవ్వ‌డంతో త‌మ్ముళ్లు మ‌రింత గంద‌ర‌గోళం ప‌డ్డారు.

బాబుకు ఈసీ మ‌ళ్లీ షాక్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share