బాబు దూకుడు.. హ‌ద్దులు మ‌రిచారా..!

April 19, 2019 at 11:47 am

ఏపీలో సీఎంగా చంద్ర‌బాబు దూకుడు ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ఏం చేయాల‌న్నా .. ప్ర‌చారం కోరు కుంటారు. ఆయ‌న బావ‌మ‌రిది మృతి చెందిన సంద‌ర్భాన్ని కూడా ఆయ‌న త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్లారు. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో, మాట‌లు వ‌ల్లెవేయ‌డంలోను చంద్ర‌బాబును మిం చిన నాయ‌కుడు మ‌రొక‌రు లేర‌నే చెప్పాలి. త‌న‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ప్ర‌తిప‌క్షంపై ఎవ‌రో వ‌చ్చి దాడి చేసినా కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో చంద్ర‌బాబును మించిన అప‌ర చాణిక్యుడు లేర‌నే వాద‌న ఒక‌టి తెర‌మీదికి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు కూడా త‌న‌కు తానే సాటి అని అనిపించుకునేందుకు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంది. మొత్తం ఏడు విడ‌త‌ల్లో సాగుతున్న ఎన్నిక‌ల క్ర‌తువులో తొలి భాగం గా ఏపీలో తొలివిడ‌త ఎన్నిక‌లు ముగిశాయి. అయిన‌ప్ప‌టికీ.. ఫ‌లితం మాత్రం మే 23 వ‌ర‌కు వెలువ‌డ‌దు కాబ‌ట్టి అప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోనే ఉంటుంది. అంటే.. ఎన్నిక‌ల సంఘ‌మే దేశ‌వ్యాప్తంగా సుప్రీంగా వ్య‌వ‌హ‌రి స్తుంది. ఈ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా కూడా అంద‌రూ సీఎంలు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రులే అవుతారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన ఏపీలో సీఎంకు అస‌లు అధికారాలు కానీ, ఆదేశాలు ఇచ్చే ప‌రిస్థితి కానీ ఎట్టిప‌రిస్థితిలోనూ ఉండ‌దు. అధికారిక స‌మీక్ష‌లు కానీ, ఆదేశాలుకానీ, అధికారుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించే అవ‌కాశం కానీ ఆయ‌న‌కు ఉండ‌దు.

అయితే, ఈ విష‌యం తెలిసి కూడా చంద్ర‌బాబు హ‌ద్దులు మీరార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా ఆయ‌న పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌పై అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. నెల రోజులు ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం ఉండ‌డంతో పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌ట్టించుకున్న నాధుడు క‌నిపించ‌లేదంటూ.. ఆయ‌న మొస‌లి క‌న్నీరు కార్చారు. ఈ క్ర‌మంలో ప‌నులు వేగిరం కావాలంటూ అధికారుల‌ను ఆదేశించారు. అంతేకాదు, జూన్ నాటికిగ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అయితే, ఇక్క‌డే చంద్ర‌బాబు ఎన్నిక‌ల సంఘానికి అడ్డంగా దొరికి పోయార‌ని అంటున్నారు.

ఆయ‌న ప్ర‌స్తుతం ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి హోదాలోనే ఉన్నార‌ని, ఆయ‌న వేసే ప్ర‌తి అడుగు కూడా ఎన్నికల సంఘం చెప్పిన‌ట్టు లేదా ఎన్నిక‌ల సంఘానికి చెప్పి న‌డుచుకోవాల‌ని అంటున్నారు. మ‌రి ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీకి ఆమాత్రం తెలియ‌దా? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కొస‌మెరుపు ఏంటంటే.. ఒంటిమిట్టలో జ‌రిగి రాములోరి క‌ల్యాణానికే ఎన్నిక‌ల‌సంఘం అనుమ‌తిస్తేకానీ హాజ‌రుకాలేని ప‌రిస్థితిలోఉన్న చంద్ర‌బాబు పోల‌వ‌రం పై ఎలా స‌మీక్షించారో ఆయ‌న‌కే తెలియాలి!!

బాబు దూకుడు.. హ‌ద్దులు మ‌రిచారా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share