సీఎస్‌-సీఎంల మ‌ధ్య సంధి కుదిరిందా?

May 8, 2019 at 11:49 am

ఏ రాష్ట్రంలో అయినా ప్ర‌భుత్వ పాల‌న సాగేందుకు కీల‌కం.. రాష్ట్ర అధికారిక‌ నాయ‌కుడిగా.. ముఖ్యమంత్రి ఎంత ముఖ్య మో.. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను క్షేత్ర‌స్థాయిలో అమ‌లు చేయాల్సిన బాధ్య‌త, చేయించాల్సిన బాధ్యత ఉన్న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పాత్ర కూడా అంతేముఖ్యం. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. సీఎం త‌ర్వాత సీఎం అంత‌టి అధి కారిక హోదా ఉన్న అధికారి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. అయితే, ఏపీలో గ‌డిచిన రెండు వారాలుగా నెల‌కొన్ని ప‌రి స్థితి ఆందోళ‌న‌కు దారితీసింది. ఏపీలో ఎన్నిక‌లకు ముందు, త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రిం చుకున్నాయి.

ముఖ్యంగా రాష్ట్రంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న సీఎం చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి చేసిన ఫిర్యాదులో కొంద‌రు అధికారులు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, వారిని మార్చాల‌ని కోరింది. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను కూడా అప్ప‌డి సీఎస్ పునేఠా కోర్టులో స‌వాల్ చేయ‌డం ద‌గ్గ‌ర మొద‌లైన వివాదం ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. ధిక్కారమున్ సైతువా! అంటూ.. పునేఠాపై కేంద్రం ఎన్నిక‌ల సంఘం కొర‌డా ఝ‌ళిపించింది. పునేఠాను బ‌దిలీ చేసి, ఆయ‌న స్థానంలో ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంను నియ‌మించింది.

అయితే, త‌ను ఏరికోరి పెట్టుకున్న సీఎస్ను మార్చ‌డంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై కారాలు మిరియాలు నూరిన చం ద్ర బాబు ఈసీ నియ‌మించిన సీఎస్ ను కూడా అవ‌మానించేలా వ్య‌వ‌హ‌రించారు. ఒక నిందితుడికి సీఎస్ ప‌గ్గాలు ఎలా ఇస్తా ర‌ని ప్ర‌శ్నించి తీవ్ర వివాదానికి కార‌ణ‌మ‌య్యారు. ఈ ప‌రిస్థితితో రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర‌బాబు వార్త‌ల్లో వ్య‌క్తిగా మారా రు. ఇక‌, ఎల్వీ కూడా చంద్ర‌బాబుతో వివాదానికే మొగ్గు చూపారు. ఈ క్ర‌మంలోనే పోల‌వ‌రం స‌మీక్ష‌కు హాజ‌రైన అధికా రుల నుంచి వివ‌ర‌ణ కోరారు. స‌మీక్ష‌లు నిర్వ‌హించేందుకు వీలు లేద‌ని చెప్పారు. దీంతో చంద్ర‌బాబు -సీఎస్‌ల మ‌ధ్య వివాదం తార స్థాయికి చేరింది.

తాజాగా మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్వ‌హ‌ణ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య మ‌రింత వివాదం ముదురుతుంద‌ని భావించారు. ఈ నెల 10న కేబినెట్ భేటీ నిర్వ‌హించి తీరుతాన‌ని, కోడ్ త‌న‌కేనా.. మిగిలిన వారికి వ‌ర్తించ‌దా? అంటూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌తో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. అయితే, ఈ క్ర‌మంలో ఏం జ‌రిగిందో ఏమో.. సీఎస్ నుంచి సానుకూల స్పంద‌న వ‌చ్చింది. తాను ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌ల‌నే అమ‌లు చేస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రానికి ముఖ్య‌మంత్రే బాస్ అని అంటూనే .. కోడ్ ఉన్న నేప‌థ్యంలో ఈసీ చెప్పిన‌ట్టే వ్య‌వ‌హారాలు న‌డ‌వాల‌న్నారు. దీంతో మెత్త‌బ‌డ్డ ముఖ్యమంత్రి ఎల్వీ సూచ‌న‌ల‌తో దిగివ‌చ్చారు. మొత్తానికి రాష్ట్రంలో ఇలాంటి ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం ఏర్ప‌డ‌డాన్ని ప్ర‌జాస్వామ్య వాదులు సైతం జీర్ణించుకోలేక పోతున్నారు. మొత్తానికి ఇద్ద‌రి మ‌ధ్య‌సంధి కుద‌ర‌డం ఆ హ్వ‌నించ‌ద‌గిన ప‌రిణామంగా చెబుతున్నారు.

సీఎస్‌-సీఎంల మ‌ధ్య సంధి కుదిరిందా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share