తండ్రిది అయిపోయింది.. ఇక త‌న‌యుడి వంతు..

April 12, 2019 at 1:17 pm

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కొద్ది రోజులుగా తీవ్ర అస‌హ‌నంతో ఆందోళ‌న‌ల‌కు దిగుతున్న విష‌యం తెలిసిందే. రాష్ర్టాన్ని మొత్తంగా త‌నే కాపాడుతున్న వేళ ఎవ‌రో త‌న ప‌నుల‌కు అంత‌రాయం క‌లిగిస్తున్నారనే ధోర‌ణిలో తీవ్ర అసౌక‌ర్యానికి గుర‌వుతున్న తీరు చూస్తున్న‌దే. అధికారంలో ఉండి వెల‌గ‌బెట్టేది లేక ప్ర‌తీ సంద‌ర్భంలో ప్ర‌తిప‌క్ష పార్టీపైనే విరుచుకుప‌డ‌డం, త‌న‌కు అనుకూలంగా లేద‌ని ఏదైనా అనిపిస్తే ఓపిక కోల్పోయి అంద‌రూ త‌న‌ను కావాల‌నే టార్గెట్ చేస్తున్నార‌ని మండిప‌డ‌డం అలవాటు చేసుకుంటున్నారు.

ఎన్నిక‌ల వేళ శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌డానికి ఏమాత్రం చ‌ర్య‌లు తీసుకోకుండా, త‌న అనుకున్నఅధికారుల‌ను త‌న‌కిష్ట‌మైన పోస్టుల్లో కూర్చోబెట్టుకుని తైత‌క్క‌లాడిన బాబుకు ఆ త‌ర్వాత అన్ని చెడు శ‌కునాలే ఎదుర‌య్యాయి. ఈసీ నుంచి మొట్టికాయ‌లు ప‌డ‌డంతో క‌ళ్ల‌కున్న పొర‌లు తొల‌గిపోయాయి. ప‌లువురు ఐపీఎస్‌ల‌ను బ‌దిలీ చేయ‌డం, కొత్త వారిని ఆయా స్థానాల్లో నియ‌మించ‌డం మింగుడు ప‌డ‌ని బాబు ప‌లుమార్లు ధ‌ర్నాకు దిగ‌డం, అధికారంలో ఉండి నిర‌స‌న‌ల‌కు దిగిన ఏకైక నేత‌గా చ‌రిత్ర స్రుష్టించిన విష‌యం కూడా తెలిసిందే.

ఏపీ ప్ర‌జ‌లు కీల‌క‌మైన తీర్పు ఇవ్వ‌నున్నార‌ని తెలిసి బాబులో ఇంకా అస‌హ‌నం పెరిగి తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఓట‌మిని ఒప్పుకోలేక బాబు గారి త‌న‌యుడు లోకేశ్‌బాబు కూడా నిర‌స‌న‌కు దిగారు. నిన్న‌టి ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న నియోజ‌క వ‌ర్గంలో పలు పోలింగ్ బూత్‌ల‌ను ప‌రిశీలించారు. మంగ‌ళ‌గిరిలోని క్రిస్టియ‌న్ గూడెం బూత్‌ను సంద‌ర్శించిన లోకేశ్ అక్క‌డ ఏదో అవ‌మానం జ‌రిగింద‌ని ఆందోళ‌న‌కు దిగారంట‌. నిన్న‌టి వ‌ర‌కు తండ్రిగారి ఆందోళ‌న‌లు, లేఖ‌లు, ధ‌ర్నాలు, మీడియాతో చిట్‌చాట్లు చూసిన త‌మ‌కు ఇప్పుడు చిన్న‌బాబుగారి ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు చూసే అవ‌కాశం వ‌చ్చింద‌నుకుంటున్నారు రాష్ర్ట ప్ర‌జ‌లు.

తండ్రిది అయిపోయింది.. ఇక త‌న‌యుడి వంతు..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share