బాబు- ప‌వ‌న్ చీక‌టి ముసుగు తొల‌గింది..!

May 21, 2019 at 2:50 pm

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు రాష్ట్రంలో 5th స్టాండర్డ్ పిల్లాడికి కూడా పవన్ – బాబు ఒక్కటే అన్న విషయంపై సంపూర్ణమైన క్లారిటీ వచ్చేసింది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు, బిజెపికి బహిరంగంగా సపోర్ట్ చేసి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడేళ్ల పాటు ప‌వ‌న్- బాబు మ‌ధ్య‌ సంబంధాలు బాగానే ఉన్నాయి. స‌డెన్‌గా ప‌వ‌న్ వివిధ‌ జిల్లాల్లో బ‌హిరంగ స‌భ‌లు స్టార్ట్‌ చేసిన త‌ర్వాత చంద్ర‌బాబు, టీడీపీ ప్ర‌భుత్వాన్ని ప‌థ‌కం ప్ర‌కారం టార్గెట్ చేస్తు వ‌చ్చారు. ప‌వ‌న్ ఒక్క సారిగా యూట‌ర్న్‌ తీసుకోవ‌డంతో నిజంగానే బాబు ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ప‌వ‌న్ పోరాటం చేస్తున్నాడేమో ? అన్న సందేహాలు చాలా మందికి క‌లిగాయి.

కట్ చేస్తే ఎన్నికలకు ఆరు నెలల ముందే జనసేన పూర్తిగా చప్పబడిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి అభ్యర్థుల పేర్లు ఖరారు చేసే క్రమంలో పవన్ పై చాలా మందికి పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. జనసేన పవన్‌ ఒక మంచి పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. జనసేన వీరాభిమానులకు సైతం పవన్ పై ఉన్న నిద్ర మత్తు పూర్తిగా వదిలింది. ఇక ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి ఫలితాలు వెలువ‌డేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని బంపర్ మెజారిటీతో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ప్రకటించేశాయి. చంద్రబాబుకు ఓటమి తప్పదని తేలిపోయింది. ఇక మిగిలిందల్లా పవన్ కళ్యాణ్… జనసేన ఈ ఎన్నికల్లో అతి చెత్త పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని… పవన్ పోటీ చేసిన రెండు చెట్లలోనూ ఒక చోట ఓడిపోతాడని కూడా చాలా సర్వేలు స్పష్టం చేశాయి.

ఇక చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించేశారు. ఈయన లోపాలపై చంద్రబాబు ఢిల్లీ వేదికగా సమరశంఖం పూరిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తన ఓటమిపై నోరు మెదపకపోయినా తాను ఎన్నికల్లో ఓటుకు నోట్లు పంచ లేదని నిజాయితీతో ఓటర్‌ని.. ఓటు అడిగానని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ ఫలితాలకు ముందే ఓ విషయంలో చేతులు కలుపుతున్నారు. వీవీ ప్యాట్ల విషయంలో చంద్రబాబుకి మద్దతుగా మాట్లాడిన పవన్ ఇప్పుడు బహిరంగంగానే ఆయనకు వంతపాడే ఛాన్స్ వచ్చింది. సర్వేలన్నీ ఏపీలో టీడీపీకి ఓటమి తప్పదని తేల్చేశాయి. అదే సమయంలో ఏపీలో జనసేన మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే సీన్ లేదని కూడా తెలిసిపోయింది.

ఫలితాల తర్వాత పవన్ తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి టిడిపితో కలిసి పోవాల్సిందే. అసెంబ్లీలో బలంగా ఉన్న అధికార వైసీపీని మరో ఐదేళ్ళ పాటు ఎదుర్కోవాలంటే జనసేన గెలిచే ఒకటి రెండు సీట్ల‌తో ఏం ఒరిగేది ఉండ‌దు. ప‌వ‌న్‌కు ఎలాగో అధికార ప‌క్షాన్ని ఒంట‌రిగా ఎదుర్కొనే స‌త్తా లేదు. ఈ టైమ్‌లో జ‌న‌సేన ముందున్న ఏకైక ప్ర‌త్యామ్నాయం ఇప్ప‌టి వ‌ర‌కు చాటుమాటుగా టీడీపీతో న‌డిపిన వ్య‌వ‌హారాన్ని ఇక నుంచి ఓపెన్‌గా చేసుకోవ‌డ‌మే. ఏదేమైన ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల ముందే వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్ చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ని ఓపెన్‌గా ఒక‌టి చేశాయి.

బాబు- ప‌వ‌న్ చీక‌టి ముసుగు తొల‌గింది..!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share