ప‌బ్లిక్ టాక్‌: బాబుకు అదిరిపోయే కౌంట‌ర్‌

April 22, 2019 at 1:27 pm

ప్ర‌జ‌లు చాలా తెలివైన వారు. ఈ విష‌యంలో వారిని రాజ‌కీయ నేత‌లే అనేక నోళ్ల కొనియాడుతూ ఉంటారు. ప్ర‌జ‌లు తెలి వైన వార‌ని ఎవ‌రికి ప‌ట్టం క‌ట్టాలో వారికి తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌ద‌ని కూడా అంటూ ఉంటారు. ఇక‌, ఈ విష‌యంలో ప్ర‌జ‌లుకూడా చాలా చురుగ్గానే క‌నిపిస్తున్నారు. ముఖ్యంగా సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక ప్ర‌జ‌లు నిర్మొహ‌మా టంగాస్పందిస్తున్నారు. మంచిని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారో.. చెడును కూడా అంతే బాగా రిసీవ్ చేసుకుంటు న్నారు. అధికార ప‌క్ష‌మైనా.. విప‌క్షమైనా.. కూడా ప్ర‌జ‌లు బాగానే స్పందిస్తున్నారు. నాయ‌కుల వ్యాఖ్య‌ల‌పై వెంట‌నే స్పందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా సీఎం చంద్ర‌బాబు చేసినవ్యాఖ్య‌ల‌పైనా స్పందించారు.

నేనున్న‌ది రాష్ట్ర ప్ర‌జ‌ల కోస‌మేన‌ని, నేనేం చేసినా.. వారి ప్ర‌యోజ‌నం కోస‌మేన‌ని చెప్పే చంద్ర‌బాబు.. విష‌యంలో ప్ర‌జ లు కూడా అంతేవేగంగా స్పందించారు తాజాగా చంద్ర‌బాబుత‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా దాదాపు రెండు గంట‌ల పాటు ప్ర‌సంగించారు. ఎన్నికలనేవి ఐదేళ్లకు ఒకసారి జరిగే ప్రజాస్వామ్య పం డగని, ఆ పండగలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ బాధ్యతలను రాగద్వేషాలకు అతీతంగా, కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా నిర్వహిస్తారని బాబు చెప్పారు. నా కు ఆ నమ్మకం వారిపై ఎప్పుడూ ఉంద‌న్నారు. అయితే దేశంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నిష్పక్షపాత ఎన్నికలు జరపాలని పదేపదే ఈసీని ఈసారి కోరాల్సి వచ్చింద‌ని ఆయ‌న అన్నారు.

అయితే, చంద్ర‌బాబు చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌జ‌లు మండి ప‌డుతున్నారు. త‌ప్పులు చేయ‌డం ఆన‌క వాటిని స‌రిదిద్దు కోవ‌డం కోసం `ప్ర‌జాప్ర‌యోజ‌నం` అనే మాట‌లువాడ‌డం బాబుకు బాగానే అల‌వాటైంద‌ని చెబుతున్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలోనూ ప్యాకేజీని ఒప్పుకుని త‌ర్వాత ప్ర‌జ‌లు హోదాకోరుతున్నార‌ని ధ‌ర్మ పోరాట దీక్ష‌ల‌కు దిగిన సంద‌ర్బాల‌ను వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇక‌, ఎన్నిక‌ల సంఘంతో ఘ‌ర్ష‌ణ‌కు దిగి.. తీరా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదానికి దారి తీయ‌డంతో వాటిని కూడా ప్ర‌జా కోణంలోనే చూడాల‌ని బాబు సెల‌వివ్వ‌డంపైనా ప్ర‌జ‌లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నేరుగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంను చంద్ర‌బాబు నిందితుడిగా పేర్కొన‌డం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

దీని నుంచి బ‌య‌ట ప‌డ‌డం కోసం చంద్ర‌బాబు మ‌రోసారి తాను అధికారుల‌కు వ్య‌తిరేకంగా లేన‌ని చెప్పుకోవ‌డం ద్వారా త‌న‌పై వ‌స్తున్న అప‌వాదుల నుంచి బ‌య‌ట‌పడేందుకు ప్ర‌య‌త్నించ‌డంపై మండిప‌డుతున్నారు. ఇలా ఎన్నిసార్లు నాట‌కం ఆడ‌తారు బాబూ అంటూ నిప్పులు చెరుగుతున్నారు. మ‌రి ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీలో బాబు చేసిన త‌ప్పులకు ఆమాత్రం ప్ర‌శ్నించేహ‌క్కు ప్ర‌జ‌ల‌కు ఉంద‌ని స‌రిపెట్టుకోవాలో.. లేక బాబు విఫ‌ల‌మ‌య్యార‌ని అనుకోవాలో తెలియ‌డం లేద‌ని మేదావులు సైతం అంటున్నారు.

ప‌బ్లిక్ టాక్‌: బాబుకు అదిరిపోయే కౌంట‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share