ఓట్ల కోసం కోట్లు ఖ‌ర్చు చేస్తున్న చంద్ర‌బాబు..!

April 10, 2019 at 6:39 pm

చంద్ర‌బాబు గెలుపుకోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. నాలుగున్న‌రేళ్లుగా బీజేపీతో వంత‌పాడిన చివ‌రి నిమిషంలో ఆ పార్టీతో తెగ‌తెంపులు పెట్టుకుని ఎప్పుడూ జ‌ట్టు క‌ట్ట‌ని కాంగ్రెస్‌తో దోస్తీ కుదుర్చుకున్నారు. ఇన్నేళ్లు రాష్ర్ట ప్ర‌జ‌ల‌ను న‌మ్మిస్తూ, నటిస్తూ వ‌చ్చిన చంద్ర‌బాబు మ‌రోమారు గ‌ద్దెను ఎక్క‌డానికి ఇప్పుడు ప్ర‌జాధ‌నాన్ని త‌న సొంత సొమ్ము అయిన‌ట్టు మంచినీళ్ల‌లా ఖ‌ర్చు చేస్తున్నారు. నాలుగున్న‌రేళ్లుగా చేయ‌ని కార్యాల‌నకు కేవ‌లం ఈ రెండు మూడు నెలల్లోనే వేల కోట్ల రూపాయ‌లు విదిల్చారు.

ఐదేళ్ల కింద‌ట దాదాపు 650 హామీల‌తో పీఠాన్ని ఎక్కిన సీఎం చంద్ర‌బాబు నాలుగున్న‌రేండ్లుగా ఆ ఊసే మ‌రిచిపోయారు. మ‌ళ్లీ గ‌డిచిన మూడు నెల‌లుగా మాత్రం ఏకంగా రూ.50 వేల కోట్ల వ‌ర‌కు ప్ర‌జాధ‌నాన్ని ఎన్నిక‌ల మామూళ్లుగా ప్ర‌క‌టించేశారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే సుమారు స‌గం ల‌బ్ధిదారుల‌కు ఫ‌లితాలు చేర‌గా, మిగిలింది రుణ‌మాఫీ రూపంలో చేరాల్సిన వారికి చేర్చేశారు. ప‌క్కా వ్యూహంతో ఇన్నేళ్లు నాన్చుతూ వ‌చ్చిన గ్రుహ రుణాలను కూడా చంద్ర‌బాబు మాఫీ చేశాడంటేనే అర్థం చేసుకోవ‌చ్చు ఆయ‌న గారి ఎన్నిక‌ల జిమ్మిక్కులు.

104 మున్సిపాలిటీల ప‌రిధిలో సుమారు ఏడు ల‌క్ష‌ల మంది లబ్ధిదారుల‌కు సుమారు రూ.21,044 కోట్ల గ్రుహ‌రుణాలు మాఫీ చేసి, ఆ విధంగా ఓట్ల‌ను కొనుగోలు చేయ‌డానికి చంద్ర‌బాబు ప‌క్కాగా ప్ర‌ణాళిక‌లు రూపొందించి అమ‌లు చేశారు. అలాగే, పేరుకుపోయిన డ్వాక్రా మ‌హిళ‌ల రుణాలు వ్య‌వ‌హారం, ల‌క్ష‌ల మందికి అంద‌ని ప‌సుపు-కుంకుమ ప‌థ‌కం ఫ‌లాల‌ను చంద్ర‌బాబు ఈ మూడు నెలల్లోనే క్లియ‌ర్ చే శారు. రైతుల‌ను కూడా మ‌భ్య‌పెట్టేలా అన్న‌దాత సుఖీ భవ పేరిట స‌ర్కార్ ఖ‌జానా నుంచే డ‌బ్బులు ఖ‌ర్చు చేసి ఓట్ల పండుగ‌లో పంప‌కాన్ని అధికారింగా చేసి త‌న అస‌మ‌ర్థ‌త‌ను క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నాలుచేశారు. జ‌గ‌న్ న‌వ‌ర‌త్న ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి ఎన్నిక‌ల ప్ర‌చార వేళ నానా జిమ్మిక్కులు చేశారు.

ఓట్ల కోసం కోట్లు ఖ‌ర్చు చేస్తున్న చంద్ర‌బాబు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share