దానిపై చంద్రబాబుకు ఫుల్ క్లారిటీ!

April 13, 2019 at 11:30 am

తాను ఓడిపోతాన‌ని చంద్రబాబుకు ముందే ఎలా తెలిసింది. పోలింగ్ స్టార్టైన గంట వ‌ర‌కు కూడా ధీమాగా ఉన్న చంద్ర‌బాబు దాదాపు 10గంట‌ల త‌ర్వాత మాత్రం ఈవీఎంల‌పై నెపం మొద‌లుపెట్టారు. పోలింగ్ స‌ర‌ళిపై ఖ‌చ్చిత‌మైన అంఛాన‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు ఆపై వైసీపీని, ఈసీని టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. ఏపీలో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల్లో కూడా త‌మ పార్టీ మాత్ర‌మే న‌ష్ట‌పోయింద‌న్న‌ట్లుగా చెప్పుకోచ్చారు. అయితే సాయంత్రం 4గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ స‌మాజం ఎటు పోతోందంటూ త‌న న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. ఆయ‌న‌లా ఆక‌స్మాత్తుగా ప్రెస్‌మీట్‌లో మాట్లాడ‌డానికి ఒక‌టే కార‌ణంగా తెలుస్తోంది.

అనేక చోట్ల పోలింగ్ ఆల‌స్యంగా మొద‌లు కాగా హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న ప్రాంతాల్లో ఎంతో కొంత తిరిగి చివ‌రి ఓట్ల రూపంలో క‌లిసివ‌స్తుంద‌న్న ఆశే ఆయ‌న్ను మీడియాతో మాట్లాడించేలా చేసింద‌ని తెలుస్తోంది. ఓట‌మిపై క్లారిటీ తెచ్చుకున్న చంద్ర‌బాబు ఓటింగ్ పూర్త‌యిన మ‌రునాడు నుంచే భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ మొద‌లుపెట్టార‌ట‌. ఢిల్లీలో నేను దీక్ష‌కు దిగుతా అంటూ ప్ర‌క‌ట‌న చేయ‌డం ఇందులో భాగ‌మేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇక టీడీపీ ముఖ్య నేత‌లెవ‌రూ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అధినేత‌ను క‌ల‌వ‌క‌పోవ‌డం విశేషం. పైపెచ్చు వైసీపీలో త‌మ‌కు స‌న్నిహితంగా ఉండే ముఖ్య‌నేత‌ల‌తో వారు ట‌చ్‌లో ఉండ‌టం విశేషం. పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌నే సందేశాల‌ను వారు ఇప్ప‌టికే పంపిన‌ట్లు తెలుస్తోంది.

కడప నుంచి టీడీపీ ముఖ్య‌నేత వీరశివారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయన బాటలోనే మరికొంతమంది నేతలు న‌డిచేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలతో ట‌చ్‌లో ఉన్న‌ట్లు సమాచారం. వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తెలుస్తుండ‌టంతో గెలుపుపై విశ్వాసం ఉన్న టీడీపీ సీనియ‌ర్లు కూడా వైసీపీలోకి జంప్ కావాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అధికార పార్టీలో ఉంటే క‌నీసం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీలైన నెర‌వేర్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని వారు యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక వ‌చ్చే ఐదేళ్లు వైసీపీకి పండుగ కాగా…టీడీపీకి క‌ష్ట‌కాలం కానుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

దానిపై చంద్రబాబుకు ఫుల్ క్లారిటీ!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share