న‌మ్మితే.. ఇంత‌ నాకించేస్తావా బాబూ..?

April 23, 2019 at 12:34 pm

న‌మ్మకం.. వెన్నుపోటు.. తెలుగు భాష‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు న‌చ్చ‌ని రెండే రెండు ప‌దాలు ఇవే! న‌మ్మితే నాకించేయ‌డం ఆయ‌న‌కు బాగా తెలిసిన విద్య‌గా టీడీపీ త‌మ్ముళ్లే పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, త‌న‌ను న‌మ్మి.. ఓట్లేసి గెలిపించిన ఏపీ ప్ర‌జ‌ల‌ను కూడా బాబు గారు బాగానే నాకించేశార‌ని అంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. దేశంలో దుబారా సీఎంగా చంద్ర‌బాబు కు పెద్ద పేరు ఉండ‌డం గ‌మ‌నార్హం. పోల‌వ‌రం ప్రాజెక్టును చూపించేందుకు, అమ‌రావ‌తి విహారానికి, పుష్క‌రాల‌కు ఇలా ఒక్క‌ట‌నేమిటి.. త‌న ద‌ర్పం ప్ర‌ద‌ర్శించేందుకు చంద్ర‌బాబు చేయ‌ని ఖ‌ర్చు లేదు. ఇక‌, ధ‌ర్మ‌పోరాట దీక్ష‌ల‌తో త‌న అస‌మ‌ర్ధ‌త‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు కూడా చంద్ర‌బాబు ప్ర‌జాధ‌నాన్నే వినియోగించారు.

ఇక ఈ ఏడాది తొలి మూడు నెలల్లో సీఎం చంద్రబాబు ఇష్టానుసారంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయ‌డం ఇప్పుడు చర్చ‌కు దారితీస్తోంది. బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో అత్యధిక వడ్డీలకు భారీ అప్పులు చేశారు. హద్దు లేకుండా అప్పుల మేళా కొనసాగిందని ఆర్థిక శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. గత ఏడాదంతా చేబదుళ్లు, ఓవర్‌ డ్రాఫ్ట్‌లతోనే ప్రభుత్వం నెట్టుకొచ్చిందని పేర్కొంటున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వానికి అప్పులూ పుట్టని పరిస్థితిలోకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు దిగజార్చారని ప్రభుత్వ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరోవైపు కొత్త ఆర్థిక ఏడాదిలో సెక్యూరిటీల విక్రయం ద్వారా ఓపెన్‌ మార్కెట్‌లో భారీ అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అయింది. అయితే ఆర్బీఐ ఏప్రిల్‌ 2వ తేదీన సెక్యూరిటీల విక్రయాన్ని రద్దు చేసింది. అనంతరం 9వ తేదీన సెక్యూరిటీల విక్రయానికి అనుమతించింది. దీంతో రాష్ట్రంలో పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల విక్రయం ద్వారా ఓపెన్‌ మార్కెట్‌లో రూ.5,000 కోట్ల అప్పు చేసింది. 8.18 శాతం వడ్డీకి ఈ అప్పు తీసుకుంది. ఒక్క నెలలోనే రూ.5,000 కోట్ల అప్పు చేయడంతో ఇక మూడు నెలల్లో ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా ఇక రూ.3,000 కోట్ల అప్పు చేసేందుకు మాత్రమే అనుమతి ఉంది. మొత్తానికి ఈ ప‌రిణామం కొత్త‌గా ఏర్ప‌డే ప్ర‌భుత్వానికి చుక్క‌లు చూపిస్తుంద‌ని అంటున్నారు ఆర్థిక నిపుణులు. అంటే, న‌మ్మినందుకు బాబు బాగా నాకించేశార‌ని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

న‌మ్మితే.. ఇంత‌ నాకించేస్తావా బాబూ..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share