బాబుకు దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చిన ఉద్యోగులు

May 23, 2019 at 10:08 am

టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఉద్యోగులు భారీ షాక్ ఇచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపులో అధికార తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీని నేల‌కు కొట్టారు. చంద్ర‌బాబు పాల‌న‌ను తీవ్రంగా తిరస్కరించారు. దీనికి ప్రతిఫలంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

గురువారం ఉద‌యం ప్రారంభ‌మైన పార్ల‌మెంట్‌, అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్‌లో పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గణనీయమైన మెజార్టీ సాధించింది. ఈ ట్రెండింగే ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న విజ‌యానికి సంకేత‌మ‌ని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీసీ విజయానికి శుభ సంకేతమని ప‌లువురు రాజకీయ విశ్లేషకులు అంచ‌నావేస్తున్నారు.

చంద్ర‌బాబు పాల‌న‌లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నారు. వారికి ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో చంద్ర‌బాబు పూర్తిగా విఫ‌లం చెందారు. అంతేగాకుండా.. ఏపీ బాగుప‌డాలంటే.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌తోనే సాధ్య‌మ‌వుతుంద‌నే అంచ‌నాకు ఉద్యోగులు వ‌చ్చార‌ని, అందుకే పోస్ట‌ల్ బ్యాలెట్లు మెజార్టీగా వైసీపీకి వేశార‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

బాబుకు దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చిన ఉద్యోగులు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share