రాజ‌కీయాల్లో ఆ చెత్త రికార్డు చంద్ర‌బాబుదే

June 14, 2019 at 3:44 pm

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నో అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు. సమైక్య రాష్ట్రంతో కలుపుకుంటే మొత్తం 14 సంవత్సరాలు తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్న ఘనత చంద్రబాబుకే దక్కింది. పార్టీ పెట్టకుండా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన చేతుల్లోకి తీసుకుని తొలిసారి సీఎం అయిన చంద్రబాబు.. ఆ తర్వాత 1999లో మరోసారి విజయం సాధించి రెండోసారి సీఎం అయ్యారు. ఆ తర్వాత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి దెబ్బతో వరుసగా రెండు ఎన్నికలలో ఓడిపోయి ప్రతిపక్ష స్థానానికే పరిమితం అయ్యారు. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్రలో జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి సీఎం అయిన చంద్రబాబు…. తాజా ఎన్నికల్లో మరోసారి ఓడిపోయారు.

చంద్రబాబు నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్ని రికార్డులు ఉన్నాయో… తాజా ఎన్నికల్లో ఓటమితో ఓ చెత్త రికార్డు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఈ త‌ర‌హా రికార్డు ఏ నాయ‌కుడికి కూడా లేదు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సీనియర్‌ నాయకుడైన చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో బుధవారం అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ క్ర‌మంలోనే తండ్రి దివంగ‌త రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి, త‌న‌యుడు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి ఇద్ద‌రికి అసెంబ్లీలో విప‌క్ష నేత‌గా కూర్చోవాల్సి వ‌చ్చింది. అలాగే బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు తండ్రి, కొడుకులు ఇద్ద‌రు కూడా విప‌క్షంలో ఉన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు చంద్రబాబుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. 1999 నుంచి 2004వరకూ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు. చంద్ర‌బాబుపై ఎన్నో పోరాటాలు చేసిన వైఎస్ ఎట్ట‌కేల‌కు 2004లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చారు. 2009లో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ మ‌రోసారి వైఎస్ విజ‌యం సాధించి రెండోసారి సీఎం అయ్యారు. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు రెండోసారి సీఎం అయ్యాక కొద్ది రోజుల‌కే వైఎస్ ఆక‌స్మికంగా మృతి చెందారు. ఆ త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీని స్థాపించారు. వైఎస్ దెబ్బ‌తో చంద్ర‌బాబు ప‌దేళ్ల పాటు ప్రతిప‌క్షంలో కూర్చొన్నారు.

2014లో రాష్ట్రం విడిపోయింది. నవ్యాంధ్ర తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికయ్యారు. ఆ ఎన్నిక‌ల్లో 67 సీట్లు గెలుచుకున్న జ‌గ‌న్ ప్ర‌తిపక్ష స్థానంలో కూర్చున్నారు. ఇక తాజా ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన జ‌గ‌న్ న‌వ్యాంధ్ర‌కు రెండోసీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ముఖ్యమంత్రిగా సభలో జగన్‌ కూర్చోగా ప్రతిపక్ష నేత స్థానంలో చంద్రబాబు ఉన్నారు. ఇలా తండ్రి, కొడుకుల‌ను ప్ర‌తిప‌క్షంలో కూర్చొపెట్టిన చంద్ర‌బాబు… వాళ్లు సీఎంగా ఉన్న‌ప్పుడు తాను ప్ర‌తిప‌క్షంలో కూర్చోవాల్సి వ‌చ్చింది.

రాజ‌కీయాల్లో ఆ చెత్త రికార్డు చంద్ర‌బాబుదే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share