అనుభ‌వానికి ప‌దునేది బాబూ..!

July 20, 2019 at 11:13 am

అనుభవం (సీనియార్టీ) మ‌నిషిని స‌మున్న‌తంగా తీర్చితిద్దుతుంది. ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి అనుభ‌వ‌మే పెద్ద కొల‌మానం. ఈ అనుభ‌వాన్ని చూస్తే 2014 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో చంద్ర‌బాబు పాల‌న‌కు ప్ర‌జ‌లు జైకొట్టారు. విభ‌జ‌న‌తో అల్లాడిపోతున్న రాష్ట్రాన్ని ఆయ‌న ముందుండి న‌డిపిస్తార‌ని, రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో దూసుకుపోయేలా చేస్తార‌ని అంతా అనుకుని టీడీపీకి ఓట్లేసి గెలిపించారు. క‌ట్ చేస్తే.. ఐదేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు ఆనుభ‌వం అవినీతి, అక్ర‌మాల‌కు పెద్ద ఎస్సర్టుగా మారిపోయింద‌నేది నేడు జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో స్ప‌ష్టంగా గోచ‌రిస్తోంది. ప్ర‌తి విష‌యంలోనూ చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టార‌నే అప్ప‌టి ప్ర‌తిప‌క్షం, నేటి అధికార పార్టీ వైసీపీ చేస్తున్న విమ‌ర్శ‌లు నిజ‌మే!అని అనిపించేలా ప‌రిస్థితి మారిపోయింది.

ముఖ్యంగా రెండు విష‌యాలు రాష్ట్ర అసెంబ్లీని కుదిపేస్తున్నాయి. వీటిలో న‌దుల వెంబ‌డి నిర్నించుకున్న అక్ర‌మ నిర్మాణాలు, రెండు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఈ రెండు విష‌యాల‌పై కూడా అప్ప‌టి అధికార ప‌క్షం నిబంధ‌న‌ల‌ను బేఖాత‌రు చేసి, త‌మ వాళ్లు అనుకున్న వారికి పెద్దపీట వేసింది. అక్ర‌మ నిర్మాణాల‌ను ప్రోత్స‌హించేలా చంద్ర‌బాబు స్వ‌యంగా కృష్ణాన‌ది గ‌ర్భంలో నిర్మించిన లింగ‌మ‌నేని ఎస్టేట్స్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీనిని కూల్చివేస్తామ‌ని ప్ర‌స్తుత ప్ర‌భుత్వాధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఇది చిలికి చిలికి గాలి వాన అయింది. ఎక్క‌డా ఏ కోర్టూ కూడా అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను ప్రోత్స‌హించిందిలేదు. పైగా వాటిని కూల్చివేయాల‌ని ఎన్నో సంద‌ర్భాల్లో సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. దీనిని కూడా తోసిరాజ‌ని చంద్ర‌బాబు అలాంటి అక్ర‌మ నివాసంలోనే కొలువుదీరారు.

నేడు దానిపై చ‌ర్చించాల్సి వ‌చ్చే స‌రికి పార‌ద‌ర్శ‌కంగా ఉండాల్సిన చంద్ర‌బాబు.. న‌దీగ‌ర్భంలో అక్ర‌మ నివాసాల‌పై చ‌ర్చ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేలా వ్య‌వ‌హ‌రించారు. రోడ్ల మ‌ధ్య‌లో వైఎస్ విగ్ర‌హాలు ఉన్నాయ‌ని, వాటి వ‌ల్ల యాక్సిడెంట్లు జ‌రుగుతున్నాయ‌ని వాటిని తొలిగిస్తారా? అని ప్ర‌శ్నించారు. అదే స‌మయంలో రాష్ట్రంలో 72 వేల అక్ర‌మ క‌ట్ట‌డాలు ఉన్నాయి వాటి మాటేమిట‌ని ప్ర‌శ్నించారు. నిజానికి అనుభ‌వం వ‌ల్ల నాయ‌కుడిగా, రాష్ట్రాన్ని ఇటీవ‌ల వ‌ర‌కు పాలించిన సీఎంగా ఆయ‌న ఈ మాట‌లు అన‌డం దారుణ‌మే అవుతుంద‌ని అంటున్నారు. మేధావులు.

ఇక‌, అదే స‌మయంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల‌ను ఇష్టారాజ్యంగా చేసుకుని, అయిన వారికి కాసుల వ‌ర్షం కురిపించారు. ముఖ్యంగా ప‌వ‌న విద్యుత్ విష‌యంలో చేసుకున్న ఒప్పందాల్లో కోట్ల‌కు కోట్లు చేతులు మారాయ‌ని అధికార ప‌క్షం అక్షేపించింది. దీనికి త‌గురీతిలో స‌మాధానం చెప్పి అధికార ప‌క్షాన్ని నిలువ‌రించాల్సిన అనుభ‌వంగ‌ల నాయ‌కుడు చంద్ర‌బాబు. అలా చేయ‌డం మానేసి.. జ‌గ‌న్ కుటుంబానికి చెందిన సండూర్ ప‌వ‌ర్ ప్రాజెక్టు త‌మ విద్యుత్‌ను క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి ఎక్కువ మొత్తానికి అమ్ముకున్నార‌ని ఆరోపించారు. అయితే, ఇది అన‌వ‌స‌ర‌మైనా వాద‌న. కర్ణాట‌క‌లో జ‌గ‌న్ కంపెనీ ఎంత‌కు అమ్ముకున్నా ఏపీ ప్ర‌జ‌లు న‌ష్టం గానీ, లాభం గానీ ఉండ‌దు. అక్క‌డ రాష్ట్రం చూసుకుంటుంది.

కానీ ఒక అంశంపై నిర్మాణాత్మ‌క‌మైన చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు త‌న అనుభ‌వాన్ని రంగ‌రించి ఎదురు ప్ర‌శ్న‌ల‌తో ప్ర‌భుత్వాన్ని డిఫెన్స్‌లో ప‌డేయాల్సిన నాయ‌కుడు.. ఇలా అడ్డ‌మైన విష‌యాల‌ను చ‌ర్చిండంపై మేథావులు న‌వ్విపోతున్నారు. న‌ల‌బై ఏళ్ల అనుభవం.. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ముందు చ‌తికిల ప‌డిందా? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.మొత్తానికి ఇప్ప‌టికేనా చంద్ర‌బాబు త‌న అనుభ‌వాన్ని పెంపొందించుకుని దాని ప్ర‌కారం వ్య‌వ‌హ‌రిస్తే బాగుంటుంద‌ని అంటున్నారు.

అనుభ‌వానికి ప‌దునేది బాబూ..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share