రాష్ట్రంపై బాబు దెబ్బ‌.. ఎవ‌రొచ్చినా చేతులు ఎత్తేయ‌డ‌మే..!

April 16, 2019 at 4:08 pm

విజ‌న్ ఉన్న సీఎంగా త‌న‌ను తాను ప్రొజెక్ట్ చేసుకున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు దెబ్బ‌తో ఏపీ లాభ‌ప‌డిందా? లేక న‌ష్ట‌పో యిందా? అనే చ‌ర్చ‌లు సాగుతున్నాయి. హోరా హోరీగా త‌ల‌ప‌డిన ఎన్నిక‌ల్లో టీడీపీ త‌న అదికారం నిల‌బెట్టుకునేందు కు, ఎట్ట‌ప‌రిస్థితిలో తాము అధికారంలోకి వ‌చ్చేందుకు వైసీపీ చేసిన ప్ర‌య‌త్నాలు మ‌న‌కు క‌నిపించాయి. అయితే, రాష్ట్రా నికి ఎవ‌రు సీఎం అయితే బాగుంటుంది? అనే ప్ర‌శ్న నుంచి ఇప్పుడు ఎవ‌రు సీఎం అయినా .. ప‌రిస్థితి ఒక్క‌టే అనే రేం జ్‌లో స‌మాధానం వ‌స్తోంది. విజ‌న్ మాటున చంద్ర‌బాబు చేసిన దుబారా దెబ్బ‌తో రాష్ట్రం తీవ్ర‌స్థాయిలో అప్పుల పాలైంది. ప‌సుపు-కుంకుమ నిధులు, రైతుల రుణ‌మాఫీ, ధ‌ర్మ పోరాట దీక్ష‌లు, పోల‌వ‌రం, అమ‌రావ‌తి సందర్శ‌న‌ల పేరుతో చేసిన హ‌డావుడి.. ఇలా చేతికి ఎముక లేకుండా చంద్ర‌బాబు చేసిన ఖ‌ర్చు అంతా ఇంతా కాదు.

దీంతో రాష్ట్రం త‌న ప‌రిధిని మించిపోయి మ‌రీ అప్పులు తెచ్చుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రోప‌క్క‌, పింఛ‌న్లు, సంక్షే మ ప‌థ‌కాలు వంటివి అమ‌లు చేయ‌డం కూడా చంద్ర‌బాబుకు త‌ల‌కు మించిన భారంగా మారిపోయింది. మ‌రోప‌క్క‌, విశాఖ‌లో నిర్వ‌హించిన పెట్టుబ‌డుల స‌ద‌స్సులు కూడా ఖ‌ర్చును మిగిల్చాయే త‌ప్ప‌.. లాభాలు రాబ‌ట్టింది ఏమీ లేద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలిసిందే. ఇక‌, తోఫాలు, కార్పొరేష‌న్ల ఏర్పాటు ఇలా ఒక్క‌టేమిటి.. నోటికి ఏమొస్తే.. అది అమ‌లు చేసిన ఫ‌లితంగా ఇప్పుడు రాష్ట్ర ఖ‌జానా ప్ర‌బుత్వ ఉద్యోగుల జీత‌భ‌త్యాల‌కు వెతుకులాడుకునే ప‌రిస్థితికి చేరిపోయింది. ఇక‌, రాబోయే ఐదేళ్ల ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. రాష్ట్రంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డినా.. వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డినా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు.

ఎవరు అధికారంలోకి వచ్చినా, ఇప్పుడు ఇస్తున్న పింఛన్లు మూడు వేలు చేయాలి. నిరుద్యోగ భృతి పెంచాలి. కేంద్రం ఇచ్చిన వ్యవసాయ హామీకి తన హామీ జత చేయాలి. ఇంకా చాలా హామీలు వున్నాయి. వీటన్నింటికీ డబ్బు కావాలి. ఎక్కడి నుంచి తేవాలి? పసుపు కుంకుమ కోసం బ్యాంకుల దగ్గర బాండ్లు పెట్టి అప్పు తెచ్చారు. మ‌రోప‌క్క‌, కేంద్రం నుంచి వ‌చ్చే నిధులు ఇప్ప‌టికే సింహ‌భాగం ఇచ్చేశామ‌ని చెబుతున్న నేప‌థ్యంలో మ‌రోసారి మోడీ ప్ర‌భుత్వ‌మే వ‌స్తే.. రాష్ట్రానికి మొండి చేయి త‌ప్ప కేంద్రం నుంచి వ‌చ్చేది ఏమీ ఉండ‌దు. ఎడా పెడా రుణాలు తెచ్చుకునే వీలు వుండదు. గత అయిదేళ్లలోనే రుణ స్థాయిని మించి చంద్ర‌బాబు అప్పులు తెచ్చారు. ఈ విష‌యంలో కాగ్ కూడా త‌ప్పుప‌ట్టింది.

డ‌బ్బులు కావాలి కాబ‌ట్టి పన్నులు పెంచితే ప్ర‌జ‌లు ఊరుకుంటారా? విద్యుత్ చార్జీలు పెంచే అవ‌కాశం ఉందా? ఆర్టీసీ బ‌స్సు చార్జీలు పెంచే సాహ‌సం చేయ‌గ‌ల‌రా? ఇలాంటి అనేక ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో ఉద్యోగుల పీఆర్సీ బ‌కాయి వుంది. దాని అరియర్స్ వున్నాయి. చిరకాలంగా డిఎ బకాయిలు వున్నాయి. వీటన్నింటికి నిధులు కావాలి. ఎక్సయిజ్, రిజిస్ట్రేషన్, జీఎస్టీ ఆదాయాలే దిక్కు. ఇలా మొత్తంగా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి చ‌క్ర‌బంధంలో చిక్కుకు పోయింది. అమ‌రావ‌తి నిర్మాణం, పోల‌వ‌రం ప్రాజెక్టు, పారిశ్రామికీక‌ర‌ణ వంటి అనేక స‌మ‌స్య‌లు ఇప్పుడు రాబోయే ప్ర‌భుత్వానికి పెను ముప్పుగా ప‌రిణ‌మించ‌నున్నాయ‌న‌డంలో సందేహం లేదు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

రాష్ట్రంపై బాబు దెబ్బ‌.. ఎవ‌రొచ్చినా చేతులు ఎత్తేయ‌డ‌మే..!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share