జ‌గ‌న్‌కు, బాబుకు పోలిక‌.. ఈ విష‌యంలో బానే కుదిరిందిగా..!

June 10, 2019 at 6:00 pm

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుల మ‌ధ్య పోలికులు కుద‌ర‌డం అంటే అంత తేలిక‌కాదు. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు వి విధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు వివిధ రూపాల్లో విధానాలు రూపొందించుకుని ముందుకు సాగుతుంటారు. దీంతో రెండు పార్టీల మ‌ధ్య సారూప్య‌త అనేది క‌ష్టం. అయితే, తాజాగా ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌స‌మ‌యంలో అనుస‌రించిన విధానం కూడా దాదాపు ఒకేలా ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ ఇద్ద‌రి పాల‌న విష‌యంపై చ‌ర్చ న‌డుస్తోంది. రాష్ట్రంలో సునామీని సృష్టించుకుని మ‌రీ అధికారంలోకి వ‌చ్చారు జ‌గ‌న్‌.

ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌కు అన్ని విధాలా అండ‌గా నిలిచిన రెడ్డి సామాజిక వ‌ర్గానికి ఆయ‌న త‌న ప్ర‌బుత్వంలో ఎక్కువ‌గా ప్రాధా న్యం ఇస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వ‌ర్గాల‌కు జ‌గ‌న్ ప్రాధాన్యం ఇ చ్చారు. అది కూడా గ‌తంలో చంద్ర‌బాబు ఎలాంటి ప్రియార్టీ ఇచ్చారో సేమ్ టు సేమ్ అంతే ప్రియార్టీ ఇచ్చారు. కాపులు, బీసీల విష‌యంలో సేమ్ టు సేమ్ అనే చెప్పాలి. ఇక‌, ఎస్సీ, ఎస్టీల విష‌యంలో మాత్రం నాలుగు అడుగులు ఎక్కువ‌గానే వేశారు జ‌గ‌న్‌. బాబు మంత్రి వ‌ర్గంలో బీసీ వ‌ర్గానికి 8 బెర్త్‌లు ద‌క్కాయి. జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో ఏడుగురు బీసీ నాయ‌కుల‌కు అవ‌కాశం క‌ల్పించారు.

అదేవిధంగా బాబు త‌న కేబినెట్‌లో కాపుల‌కు 4 బెర్త్‌లు కేటాయించారు. ఇప్పుడు జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో న‌లుగురు కాపు నాయ‌కుల‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం ద్వారా తాను కాపుల‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని చెప్ప‌క‌నే చెప్పారు. ఇక‌, క‌మ్మ వ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. చంద్ర‌బాబు న‌లుగురికి అవ‌కాశం ఇచ్చారు. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ కేవ‌లం ఒకే ఒక్క‌రికి కొడాలి నానికి అవ‌కాశం క‌ల్పించారు. అదేవిధంగా త‌న సామాజిక వ‌ర్గ‌మే అయినా.. జ‌గ‌న్ రెడ్డి వ‌ర్గానికి కేవ‌లం న‌లుగురికి మాత్ర‌మే అవ‌కాశం ఇచ్చారు. ఎస్సీ విష‌యానికి వ‌స్తే.. చంద్ర‌బాబు క‌న్నా కూడా జ‌గ‌న్ పెద్ద ఎత్తున వారికి అవ‌కాశం క‌ల్పించారు. ఐదుగురికి జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించారు. అదేవిధంగా ఎస్టీ వ‌ర్గానికి కూడాజ‌గ‌న్ ఏకంగా డిప్యూటీ సీఎం ప‌ద‌వినే ఇచ్చారు. అయితే, చంద్ర‌బాబు త‌న మంత్రి వ‌ర్గంలోకి బీసీల‌ను కానీ, ఎస్సీల‌ను కూడా ఒకే సారి కాకుండా విడ‌త‌ల వారీగా తీసుకున్నారు. మ‌ధ్య‌లో వారి అవినీతిని భ‌రించ‌లేక ప‌క్క‌న పెట్టిన మంత్రులు కూడా ఉన్నారు. అయితే, ఇప్పుడు జ‌గ‌న్ మంత్రి వ‌ర్గ కూర్పుపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

జ‌గ‌న్‌కు, బాబుకు పోలిక‌.. ఈ విష‌యంలో బానే కుదిరిందిగా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share