బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ రేటు గుట్టు ర‌ట్ట‌య్యిందిగా…

June 18, 2019 at 12:56 pm

చంద్ర‌బాబు ఆక‌ర్ష్ రేట్ గుట్టు ర‌ట్ట‌యింది.. 2014లో గెలిచిన త‌ర్వాత చంద్ర‌బాబు వైసీపీని దెబ్బ‌తీసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. విచ్చ‌ల‌విడిగా ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించారు. వైసీపీ ఎమ్మెల్యేల‌ను టీడీపీలో చేర్చుకునేందుకు భారీ మొత్తంలో వారికి ఇచ్చార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను, ముగ్గురు ఎంపీల‌ను టీడీపీలోకి లాగేశారు. వీరికి ఒక్కొక్క‌రికి సుమారు రూ.30 కోట్లు ఇచ్చార‌నే టాక్ అప్ప‌ట్లో బ‌లంగా వినిపించింది. మ‌రికొంద‌రికి అయితే.. ఈ డ‌బ్బుల‌తో పాటు మంత్రిప‌ద‌వి ఆఫ‌ర్‌ కూడా ఇచ్చార‌ట‌.

ఇంకా చెప్పాలంటే బాబు ఆ పార్టీ నుంచి గెలిచిన వారిలో ఏకంగా న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చారు. అలాగే ఒక‌రికి విప్ ప‌ద‌వి ఇస్తే… మ‌రికొంద‌రు ఎమ్మెల్యేల‌కు ఎమ్మెల్సీలు, ఇత‌ర‌త్రా కార్పొరేష‌న్ ప‌ద‌వులు ఇచ్చారు. అప్ప‌ట్లో వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన‌ప్పుడు వాళ్ల‌కు టీడీపీ నుంచి వెళ్లిన ఆఫ‌ర్ రేటు రూ.30 కోట్లు అన్న ప్ర‌చారం బాగా జ‌రిగింది. అయితే.. తాజాగా.. బాబు ఆక‌ర్ష్ రేట్ రూ.30కోట్లు కాద‌నీ.. అది రూ.50 కోట్లు అని తేలిపోయింది. ఇప్పుడు ఏపీలో ఇదే విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. అప్ప‌ట్లో చంద్ర‌బాబు.. ప్ర‌ధానంగా వైసీపీ బ‌లంగా ఉన్న‌చోట నుంచే ఆ పార్టీ ఎమ్మెల్యేల‌ను లాగేశారు.

ఇందులో భాగంగా.. 2014లో క‌ర్నూలు జిల్లా ఆలూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మనూరు జయరాంను కూడా టీడీపీలోకి తీసుకునేందుకు చంద్ర‌బాబు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నం చేశారట‌. ఇప్పుడు ఈ విషయాన్ని తాజాగా మంత్రిగా మారిన జయరాం చెప్పారు. చంద్ర‌బాబు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ రేట్‌ను బయటపెట్టారు. తనకు చంద్రబాబు ఏకంగా రూ.50 కోట్లతో పాటు మంత్రి పదవిని కూడా ఇస్తాన‌ని చెప్పార‌ని జ‌య‌రాం వెల్ల‌డించారు. ఈ మేర‌కు చంద్రబాబు ఆయన వద్దకు ఓ మధ్యవర్తిని కూడా పంపార‌ట‌.

అయితే.. చంద్ర‌బాబు ఇచ్చిన ఆఫ‌ర్‌ను జ‌య‌రాం లెక్క‌చేయ‌లేదు. వైసీపీని వీడేందుకు తాను సిద్ధంగా లేన‌ని ఆయ‌న సూటిగా చెప్ప‌డంతో చంద్ర‌బాబు ఆయ‌న‌ను వ‌దిలేశార‌ట‌. నిజానికి.. ఇప్పుడు జ‌య‌రాంకు అదే క‌లిసివ‌చ్చింది. అంత నిజాయితో పార్టీని న‌మ్ముకుని ఉన్న ఆయ‌నకు ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో మంత్రిప‌ద‌వి ద‌క్కింది. త‌న‌ను, పార్టీని న‌మ్ముకుని ఉన్న నేత‌ల‌కు జ‌గ‌న్ అండ‌గా నిలిచారు. వారంద‌రికీ ప్ర‌భుత్వంలో స‌ముచిత స్థానం క‌ల్పించారు. గుమ్మ‌నూరు జ‌య‌రాం చెప్పిన మాట‌లు ఇప్పుడు ఏపీలో వైర‌ల్ అవుత‌న్నాయి. నేత‌లంద‌రూ ఇలా.. నిజాయితీ ఉండాల‌ని అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ రేటు గుట్టు ర‌ట్ట‌య్యిందిగా…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share