చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డికి పోటీగా టీడీపీ అభ్యర్థి రెడీ!

December 19, 2018 at 12:00 pm

చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంపై చంద్ర‌బాబు క‌న్నుప‌డింది. టీడీపీ స్థాపించిన కొత్త‌లో ఆ పార్టీకి ఈ నియోజ‌క‌వ‌ర్గం కంచుకోట‌లా వ‌ర్ధిల్లింది. ఆ త‌ర్వాత గ‌ల్లా కుమారి రాక‌తో ఇక్క‌డ పార్టీ అడ్ర‌స్ గ‌ల్ల‌తైంది. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గ‌ల్లా అరుణ‌కుమారి టీడీపీలో చేరి పోటీచేయ‌గా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి చేతిలో ఓట‌మిపాల‌య్యారు. అయితే ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెల‌వాలంటే బ‌ల‌మైన అభ్య‌ర్థి కావాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యూహాత్మక రాజకీయాలకు పెట్టింది పేరు అని చంద్ర‌బాబుకు బాగా తెలుసు. అందుకే ఆయ‌న్ను ఢీకొట్ట‌గ‌ల సామ‌ర్థ్య‌మున్న అభ్య‌ర్థి కోసం గాలింపు చేప‌డుతున్న ఆయ‌న‌కు యువనేత, టీడీపీ జిల్లా అధ్యక్షుడయిన పులివర్తి నాని రూపంలో స‌మాధానం దొరికింద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేర‌కు నానిని చంద్రగిరి అభ్యర్థిగా బాబు ప్రకటించ‌డం టీడీపీ నేతల్లోనే కాదు- జిల్లా రాజకీయవర్గాల్లోనే సంచలనం రేపింది.

పాకాల మండలం పులివర్తివారిపల్లెకు చెందిన కమ్మ సామాజికవర్గీయుడైన పులివర్తి నానికి నియోజ‌క‌వ‌ర్గంలో మంచి పట్టు ఉంద‌ని తెలుస్తోంది. దాన్ని గ‌మ‌నించే చంద్ర‌బాబు ఆయ‌న‌ అభ్యర్ధిత్వాన్ని ఖరారుచేసిన‌ట్లు తెలుస్తోంది. దీనికితోడు గ‌ల్లా అరుణ కూమారి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని తేల్చిచెప్ప‌డం కూడా నాని వైపు బాబు మొగ్గు చూపేలా చేసింద‌ని తెలుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన తొలి సీటు అని కూడా చెప్పాలి. చిత్తూరు జిల్లాలో చంద్రగిరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. హేమాహేమీలైన నేతలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.18VJPAGE3TDP

ఈ నియోజకవర్గంలోని నారావారిపల్లెకు చెందిన చంద్రబాబు 1978లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీచేసి గెలిచారు. ఎమ్మెల్యేగా చట్టసభలోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ప్రారంభించాక 1983, 1985, 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు చంద్రగిరిలో విజయం సాధించారు. 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరఫున గల్లా అరుణకుమారి నాలుగుసార్లు గెలుపొందారు. 2014లో ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి చంద్రగిరిని కైవసం చేసుకున్నారు.

చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డికి పోటీగా టీడీపీ అభ్యర్థి రెడీ!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share