చింత‌మ‌నేనిపై కొఠారు పంచ్ డైలాగ్ అదిరిందిగా…

June 18, 2019 at 11:09 am

రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం. ఏ నియోజ‌క‌వ‌ర్గ‌మూ.. ఏ అధికార పీఠ‌మూ ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు. అయితే, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2009, 2014లో విజ‌యం సాధించిన చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మాత్రం.. త‌న‌కంటూ.. ఈ నియోజ‌క‌వ‌ర్గం శాశ్వ‌త‌మ‌ని ప్ర‌క‌టించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచి గ‌ద్దెనెక్కే మొన‌గాడు ఎవ‌రు? అంటూ త‌ల ఎగ‌రేశారు. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ అడుగు పెట్టిన యువ నాయ‌కుడు, ప్ర‌వాసాంధ్రుడు కొఠారు అబ్బ‌య్య చౌద‌రి.. చింత‌మ‌నేనికి ఘాటుగా స‌మాధానం చెప్పారు.

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భంజ‌నానికి తోడు దెందులూరు ప్ర‌జ‌ల మ‌నిషిగా, యువ నాయ‌కుడిగా గుర్తింపు సాధిం చిన కొఠారు విజ‌యం సాధించారు. ఎన్నిక‌ల‌కు ముందు, త‌ర్వాత కూడా త‌న స‌త్తా చాటుతాన‌ని ప్ర‌క‌టించిన కొఠారు.. అదే రేంజ్‌లో రాజ‌కీయాలు చేస్తున్నారు. చింత‌మ‌నేన‌ని ఆటలు ఇక సాగ‌బోవ‌ని తాజాగా ఆయ‌న వెల్ల‌డించారు. దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం చింత‌మ‌నేని అబ్బ‌సొత్తు కాద‌ని, ఆయ‌న అడ్డా అంత‌క‌న్నా కాద‌ని వెల్ల‌డించ‌డం ద్వారా కొఠారు ఎలాంటి గ‌ట్టి నిర్ణ‌యంతో ఉన్నారో స్ప‌ష్టం చేస్తోంది.

యువ నాయ‌కుడిగా చింత‌మ‌నేనిపై విజ‌యం సాధించ‌డం ఒక్క‌టే కొఠారు రికార్డు కాదు. ఇక్క‌డి ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఆయ‌న చోటు సంపాయించుకున్నారు. వాస్త‌వానికి సుదీర్ఘ కాలం లండ‌న్‌లోనే ఉన్న కొఠారు ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు మాత్ర‌మే జ‌గ‌న్ సూచ‌న‌ల‌తో రాజ‌కీయా ల్లోకి వ‌చ్చారు. వ‌చ్చీ రావ‌డంతో రాజ‌కీయాల్లో త‌న‌ను తానే టైగ‌ర్ అని చెప్పుకొనే చింత‌మ‌నేనిపై పోటీకి సిద్ధ‌మ‌య్యారు. అనేక అవాంత‌రాలు, అనేక ఇబ్బందులు, కేసుల‌ను కూడా త‌ట్టుకుని.. కొఠారు దెందులూరు ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకున్నారు.

ఈ క్ర‌మంలోనే రాబోయే రోజుల్లోనూ త‌న స‌త్తా చాటుతాన‌ని, చింత‌మ‌నేని ఇప్పుడు ఓడిపోవ‌డం కాద‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కు డి పాజిట్లు రాకుండా చేసేలా ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తాన‌ని, కొఠారు అడ్డాగా దెందులూరును తీర్చిదిద్ది ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో స్థిర స్థానం చిర‌కాలం సంపాయించుకుంటాన‌ని చెప్పారు. మొత్తానికి ఈ దెబ్బ‌తో చింత‌మ‌నేనికి ఇక‌, రాజ‌కీయ స‌న్యాస‌మే గ‌తి అంటున్నారు నెటిజ‌న్లు.

చింత‌మ‌నేనిపై కొఠారు పంచ్ డైలాగ్ అదిరిందిగా…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share