ఆ విషయంలో చిరు,పవన్ ద్వంద్వ వైఖ‌రి..!

July 13, 2019 at 4:13 pm

కుర‌సాల క‌న్న‌బాబు. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవికి ఎన్నోరూపాల్లో ఆయ‌న రాజ‌కీయంగా స‌ల‌హాలు, స‌మాచారం ఇచ్చార‌ని, పార్టీనిన‌డిపించార‌ని పేరు తెచ్చుకున్నారు. అయితే, అనూహ్యంగా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన త‌ర్వాత ఆయ‌న‌పార్టీకి దూర‌మ‌య్యారు. ఇక‌, ఆ త‌ర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకుని తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఆయ‌న మంత్రిగా కూడా జ‌గ‌న్ కేబినెట్‌లో చోటు సంపాయించుకున్నారు.అ త్యంత కీల‌క‌మైన వ్య‌వ‌సాయ శాఖ‌కు మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఆయ‌న సోద‌రుడు హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు.

ఈ క్ర‌మంలో చిరంజీవి నేరుగా ఆయ‌న ఇంటికి వెళ్లి కుర‌సాల కుటుంబాన్ని ఓదార్చారు. ఇదే ఇప్ప‌డు రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ రాజ‌కీయాల‌పై లుక‌లుక‌లు వ‌చ్చేలా చేసింది. దీనికి కార‌ణం.. ఎన్నిక‌లకు ముందు.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లు చోట్ల మాట్లాడుతూ.. త‌న అన్న పెట్టిన ప్ర‌జారాజ్యం పార్టీ నిర్వీర్యం కావ‌డానికి చ‌క్రం తిప్పిన నాయ‌కుల్లో కుర‌సాల కూడా ఉన్నార‌ని, వారి అంతు తేలుస్తాన‌ని గంభీర‌మైన ఉప‌న్యాసాలు చేశారు. దీంతో క‌న్న‌బాబు డిఫెన్స్ లో ప‌డ్డారు. ప్ర‌జారాజ్యంలో తాను కీల‌క పాత్ర పోషించాన‌ని, కానీ, ప‌వ‌న్ త‌న‌ను త‌ప్పుగాఅర్ధం చేసుకున్నార‌ని ఆయ‌న త‌న అనుచ‌రుల వ‌ద్ద వాపోయారు.

ఆ రాజకీయ రచ్చ సంగతి పట్టించుకోకుండా కన్నబాబు ఇంట విషాదం నెలకొనడంతో, పెద్దమనిషి తరహాలో తనకు అత్యంత ఆప్తుడైన కన్నబాబు ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చారు చిరంజీవి. ఇప్పుడిది పవన్‌కళ్యాణ్‌ అభిమానుల్లో ఒకింత ఆగ్రహానికి కారణమవుతోంది. చిరంజీవి, తన తమ్ముడికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ పవన్‌ అభిమానుల్లో కొందరు సోషల్‌ మీడియా వేదికగా నానా రచ్చా చేసేస్తున్నారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. అటు చిరంజీవి అభిమానులకీ, ఇటు పవన్‌కళ్యాణ్‌ అభిమానులకీ మధ్య అస్సలేమాత్రం పొసగడంలేదన్నది నిర్వివాదాంశం. ఒకప్పటి పరిస్థితి వేరు. చిరంజీవి అభిమానుల్లోనే, పవన్‌ అభిమానులుండేవారు. ఇప్పుడు పరిస్థితులు అది కాదు.దీంతో ఈ ప‌రిణామం మెగా కుటుంబంలో రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది. మ‌రి రాబోయే రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

ఆ విషయంలో చిరు,పవన్ ద్వంద్వ వైఖ‌రి..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share