చిత్రాంగద TJ రివ్యూ

సినిమా:  చిత్రాంగద
రివ్యూ : 1.5/5
టాగ్ లైన్ : చిత్రాంగ “వ్యద”

నటీనటులు – అంజలి, సాక్షి గులాటి, జయప్రకాశ్ వీ, సప్తగిరి, రాజా రవీంద్ర, జ్యోతి, సింధు తొలి
సంగీతం – సెల్వగణేష్
నిర్మాత – శ్రీధర్ గంగపట్నం
కథ/దర్శకుడు – అశోక్ జి

అసలే పరీక్షల సమయం, సంవత్సర మొత్తంలో సినిమాలు రిలీజ్ అవడానికి బాగా డ్రై టైం ఏదైనా ఉందంటే అది ఇదే. ఈ టైములో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే రెండు కారణాలు ఉండొచ్చు, ఒకటి సినిమాలో కంటెంట్ అయినా ఉండాలి లేదా వేరే ఏ టైము లేదు ఈ టైం లోనే సినిమా రిలీజ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికింది అనే సినిమాలు అని అనుకోవచ్చు. సగటు ప్రేక్షకుడు సినిమాకి ఈ టైములో వెళ్ళడానికి సాహసించాడంటే దానికి కారణం మొదటిరకమే. ఈ టైంలో కూడ సినిమా రిలీజ్ అవుతుంది అంటే సినిమాలో కాస్తో కూస్తో కంటెంట్ ఉంటాది అన్న ఆశతోనే ఏ ప్రేక్షకుడైన సినిమాకు వస్తాడు. అదే ఆశ చిత్రంగదా సినిమాకి వెళ్లేలా చేసింది.

ఇవాళ రిలీజ్ అయిన నాలుగు సినిమాలలో బెస్ట్ ఏదా అని తర్జన భర్జన పడి చివరిగా ఎంచుకున్న చిత్రం చిత్రంగదా. నేను ఎంచుకున్న చిత్రం బెస్ట్ కాదు వరస్ట్ అని తెలియడానికి సినిమాలోకి ఎంటర్ అయిన ఐదు నిమషాల్లోపే తెలిసిపోయింది. వరస్ట్ అని ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే హారర్ సినిమా అందులోనూ కామెడీ జత చేయబడిన హారర్ సినిమాలు చాలానే చూసాం ఎంత రొటీన్ గా అనిపించినా కాస్తో కూస్తో కామెడీ తో సినిమాని లాగించేసి ఉంటారు అన్న ఆశతో కాస్త కాలక్షేపం అవుతుంది అన్న ధీమాతో సినిమాకి వచ్చిన ప్రేక్షకుడికి ఇందులో హారర్ కాదు కదా కామెడీ కూడా లేదు. ఇందులో హారర్ లేదు కామెడీ కానరాదు, హారర్ కామెడీ అంతకన్నా లేదు, అన్నిటికి మించి ఇది కాలక్షేపానికి కాదుకదా కసితీరా ప్రేక్షకుడిని సినిమాకి ఎందుకు వచ్చావు? మళ్ళీ వస్తావా? అని తూట్లు పొడుస్తూనే ఉంటది అన్నంత ఘోరంగా తయారు చేసిన ప్రోడక్ట్ ఇది.

ఒక సినిమా హీరోయిన్ కెరీర్ గ్రాఫ్ ఎలా నడవకూడదో అనటానికి బెస్ట్ ఉదాహరణ హీరోయిన్ అంజలి. ఎలాంటి పాత్రలు ఒప్పుకుంటే ఆకాశాన ఉన్న కెరీర్ గ్రాఫ్ కూడా పాతాళానికి పడిపోతుందో దానికి బెస్ట్ ఉదాహరణ అంజలి. అప్ కమింగ్ హీరోయిన్స్ కి అందరికీ అంజలి సినీ కెరీర్ గ్రాఫ్ చక్కని ఉదాహరణ. మొదటి రెండు మూడు సినిమాలతో ఆకాశపు అంచులలోకి ఎగసి ఆమాంతం పాతాళానికి పడిపోవటానికి మరో రెండు మూడు సినిమాలు చాలు అని నిరూపించింది. సినిమా అనే రంగుల ప్రపంచంలో అంచనాలు వేరు అవకాశాలు అంది పుచ్చుకోవడం వేరు, రెండిటిని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేక పోతే ఏ హీరోయిన్ కెరీర్ అయినా అంజలి లాగే పాతాళానికి పడిపోవడం ఖాయం.

అసలీ చిత్రాంగద సినిమా ఈ వారం విడుదల అయిన సినిమాలలో కాస్తో కూస్తో బజ్ క్రియేట్ చేసిన సినిమా. బజ్ అంటే అదేదో హైప్ తో వచ్చిన సినిమా కాదు. విడుదల అవుతున్న మిగతా చిత్రాలతో పోలిస్తే సగటు సినీ అభిమానిని ఆకర్షించే చిత్రం ఇది. దానికి మొదటి కారణం అంజలి అయితే రెండో కారణం హార్రర్ కామెడీ. ఈ రెండిటిలో అంజలి గురించి ఎవరైనా సినిమాకి రావాలి అనుకుంటే ముందుగానే వాళ్లందరికీ ఓ హెచ్చరిక, మీరు అంజలిని ఏ రకంగా అయితే చూడకూడదు అనుకుంటున్నారో అచ్చం అంజలి ఈ సినిమాలో అదే రకంగా ఉంటది. ఇక హార్రర్ కామెడీ ఆశించే సగటు సినీ ప్రేక్షకుడికి ఇందులో కామెడీ కాదు కదా కనీసం కాలక్షేపం కూడా దొరకదు. భయానకమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో క్లోజప్ షాట్స్ తో కెమెరాని అటు ఇటు షేక్ చేసి అదే భయానకం అనుకుంటే అది వాళ్ళ భ్రమవుతుంది తప్ప సినిమాటిక్ గా ఏ మాత్రం సక్సెస్ అవదు అన్నదానికి ఖచ్చిత ఉదాహరణే ఈ చిత్రాంగద.

కథ గురించి మాట్లాడుకొంటే సైకాలజీలో పీహెచ్డీ చేసిన స్టూడెంట్ అదే కాలేజీలో సైకాలజీ ప్రొపెసర్ గా చేరి ,తోటి విద్యార్థులతో అదే హాస్టల్లో ఉంటూ ,హాస్టల్ లో జరిగే విపరీతమైన పరిణామాలు ,అక్కడి పరిణామాలకు కారణమే చిత్ర అని బయటపడటంతో తనని వేరొక సైక్రియార్టిస్టుకి చూపించగా తనలో స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్నదని ,చిత్ర ఒకటి కాదు ఇద్దరు అని వేరే స్వామీజీలు ,సైక్రియార్టిస్టులు సతమతం అవుతున్న తరుణం లో చిత్రే తాను కనే కలకోసం ,తనకు పదే పదే వస్తున్న కలకోసం వెతుకొంటూ అమెరికా వెళ్ళటం ,అమెరికాలో తనకు వస్తున్న కల ఏంటి? దాని వెనక ఉన్న కధ ఏంటి?  ఆ కథతో అంజలికి ఉన్న సంబంధం ఏమిటి ?అదే కాదాంశం .

కథ పరంగా చూస్తే ఇది మరి అంత తీసి పడేసే అంత సినిమా కాదు. దీన్ని పర్ఫెక్ట్ గా హేండిల్ చేస్తే ,తెరపైన సరిగ్గా ప్రజంట్ చేస్తే ప్రేక్షకుడు రెండున్నర్ర గంటలు థియేటర్లో కుర్చూపెట్ట కలిగే కథ వస్తువే. దీన్ని ఏ రకంగా అయితే హేండిల్ చేయకూడదో ఎలా హేండిల్ చేస్తే ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతాడో పక్కాగా దానికి ఏమాత్రం తగ్గకుండా హేండిల్ చేసాడు చిత్ర దర్శకుడు. ఏదైనా సన్నివేశంలో చిత్ర కథా కథనం బాగా గ్రిప్పింగ్గా సాగుతుంది అనుకుంటే అరెరే ఇది ఇలా సాగకూడదే..ఇది ఇలా ఉంటె బాగా వస్తుందేమో..దిన్నీఎలా డల్ చేయాలో అని ప్రయత్నించి మరీ ఓ వైపు కెమెరా మెన్ ఇంకో వైపు చిత్ర దర్శకుడు ఇద్దరు కలిసి కథ కథనాన్ని ఎంతలా నీరు కార్చాలో అంతలా కార్చేసారు.

అంజలి లాంటి హీరోయిన్తో హారర్ సినిమా తీయడం తప్పుకాదుకాని ఈ సినిమాలో అంజలి క్యారక్టరేజషన్, ఈ కథలో హారర్ కామెడీ ఒకటే వస్తువు కాదు. ఒకటే అయితే చాలా సినిమాలు వస్తున్నాయి ఈ సినిమా స్పెషలిటీ ఏమనుకున్నారో కానీ హారర్ కామెడీకి పునర్జన్మ, పునర్జన్మకి సైన్సు.. సైన్సుకి పురాణాలు..పురాణాలకి సైకాలజీ… సైకాలజీకి సైన్సుఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు, అన్నీ జోడించారు కానీ అసలైన బేసిక్ అంశాన్ని గాలికి వదిలేశారు అందుకే సినిమా కూడా తెగిన గాలిపటంలా అలా అలా ఎగురుతూ చివరికి దారి తెలియక దిక్కు తోచక ఆకాశం వైపు ఎగురుతూనే ఉంటుంది. అంజలి నటన అద్భుతం కాకపోయినా పర్లేదు అనిపిస్తుంది.. పాపం అంజలి తనకు తెలియని తనకు రాని నటనని.. బాడీ లాంగ్వేజ్ని స్క్రీన్ పైన ప్రెజెంట్ చేయడానికి బానే కష్టపడింది. అక్కడక్కడా కొంత సక్సెస్ అయినా అది సినిమా సక్సెస్ కి ఏమాత్రం దోహద పడదు. మిగతా పాత్రలన్నీ పెద్దగా చెప్పుకోటానికి ఏమీలేవు, గుర్తింపు తెచ్చే నటన గాని గుర్తుండి పోయే హావ భావాలు కానీ సినిమాలో ఏ పాత్రకి లేవు. ప్రేక్షకుడిని బయపెట్టటమే పనిగా పెట్టుకున్నారు తప్ప ఆ సిట్యుయేషన్ ఏంటి తరువాత వస్తున్న సీన్ ఏంటి, ఎఫెక్ట్ తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అన్న ఆలోచన ఏకోశానా కనిపించదు. ఇక పాటలు, అంజలి చేసిన నృత్యాలు వాటిగురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. కమెడియన్స్ సప్తగిరి, జబర్దస్త్ ఫేమ్ సుధీర్ లను పెట్టుకొని కామెడీ చేసిన అది వికటించిందే తప్ప అది సినిమాకి ఏమాత్రం ఉపయోగపడలేదు.

ఓవరాల్ గా చిత్రాంగద చిత్రం రిలీజ్ అయిన టైం బాగున్నా, సినిమాకి పని చేసిన సాంకేతిక నిపుణులు మరియు నటీనటుల కమిట్మెంట్ ఎక్కడ కనపడదు. సినిమా చూస్తున్నంత సేపు ఎందుకు వచ్చాం రా బాబు అన్న ఫీలింగ్ తప్ప పర్లేదులే వారాంతపు కాలక్షేపం ఉంది అని సర్ది చెప్పుకొనే సన్నివేశం మచ్చుకైనా కనపడదు.