కాంగ్రెస్ మేనిఫెస్టో విడుద‌ల.. ఏపీపై వరాలు

April 2, 2019 at 3:29 pm

ఎన్నిక‌ల వేళ పార్టీలు త‌మ‌త‌మ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. ప్ర‌తీ విష‌యాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటూ ముందుకుసాగుతున్నాయి. పోటాపోటీగా జ‌రుగుతున్న ప్ర‌చార ప‌ర్వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ పార్టీ దూసుకెళ్తున్న విష‌యం తెలిసిందే. గతంలోనే వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు త‌మ‌త‌మ మేనీఫెస్టోల‌ను విడుద‌ల చేసి ప్ర‌జ‌ల ముందు ఉంచాయి. ఈ క్ర‌మంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ త‌న మేనిఫెస్టోను మంగ‌ళ‌వారం మధ్యాహ్నం విడుద‌ల చేసింది. ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి వండివార్చిన‌ట్టు తాము అధికారంలోకి వ‌స్తే చేప‌ట్ట‌బోయే కార్య‌క్రమాలను హామీల రూపంలో ముందుంచారు.

రాష్ర్ట విభ‌జ‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్న కాంగ్రెస్ ఆ రాష్ర్టంలో దిద్దుబాటు చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించింది. చేసిన త‌ప్పును కొంచెమైన స‌ర్ధుకుని మ‌రోమారు ప్ర‌జ‌ల‌ను చేరువ‌వ‌డానికి ప్ర‌ణాళిక‌లు పొందుప‌ర్చుకుంది. పార్టీ పూర్తిగా మ‌ట్టికొట్టుకుపోయే ప‌రిస్థితులు ఉంద‌న్న ప్ర‌మాదం గ్ర‌హించి ఇప్ప‌టికే ప‌లు పార్టీల‌తో పొత్తుల‌కు మొగ్గుచూపిన ఆ పార్టీ ఇప్పుడు మేనిఫెస్టోలో ఏపీపై ప్ర‌త్యేక ప్రేమ‌నే కురిపించింది. మేనిఫెస్టో క‌మిటీ చైర్మ‌న్ చిదంబ‌రం ముఖ్య అంశాల‌ను విడుద‌ల చేస్తూ చ‌దివిని వ్యాఖ్య‌ల‌ను చూస్తే ఆ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఏపీలో చేప‌ట్ట‌బోయే కార్యాలు మ‌న‌క అవ‌గ‌తం అవుతాయి.

దేశ‌వ్యాప్తంగా రైతులు, యువ‌త‌, మ‌హిళ‌లు, పేద‌లు, ర‌క్ష‌ణ‌తో పాటు ఏపీ విష‌యానికి వ‌చ్చే ప్ర‌త్యేక హోదాను ఇచ్చి తీరుతామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అలాగే ప్ర‌తి పేద కుటుంబానికి ఏడాదికి రూ.72వేలు ఇస్తామ‌ని పేర్కొ్న్నారు. 2030 నాటికి పేద‌రికాన్ని పూర్తిగా నిర్మూలించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఏపీలో పార్టీని ఎలాగైనా బ‌తికించుకోవాల‌ని తీవ్ర తాప‌త్ర‌యం పార్టీ మేనిఫెస్టోలో స్ప‌ష్టంగా కనిపించింది. ఆంధ్ర‌ప్ర‌జ‌ల కోపానికి మాడిపోయిన పార్టీని తిరిగి చిగురింప‌జేయాల‌నే ఉబ‌లాటం మేనిఫెస్టో క‌మిటీలో కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. చూడాలి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు ప్ర‌జ‌లు ఫిదా అవుతారో. గ‌త మోసాన్ని తలుచుకుని మ‌రోర‌క‌మైన తీర్పు చెబుతారో చూడాలి మ‌రీ.

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుద‌ల.. ఏపీపై వరాలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share