మైల‌వ‌రంలో ఉమాకి షాక్ …వైసీపీలోకి వ‌ల‌స‌లు…!

August 20, 2018 at 3:19 pm

రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం! ఎవరు ఎలాంటి యూటర్న్లు తీసుకుంటారో చెప్పడమూ కష్ట మే! ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాలు కూడా ఇలానే తయారయ్యాయి. ఇక్కడ నాయకులు యూటర్న్ తీసుకోవడం కాదు.. ప్రజలే యూటర్న్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు తమకు నాయకత్వం వహించింది చాలు! అంటూ.. సిట్టింగ్ ఎమ్మె ల్యే కమ్ మంత్రి దేవినేని ఉమాకు వారు దణ్ణం పెట్టేందుకు రెడీ అవుతున్నారు. మరి అత్యంత ఆసక్తిగా ఉన్న ఈ నియోజ కవర్గం రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక్కడ వరుస విజయాలతో హవా చలాయిస్తున్నారు మంత్రి దేవినేని ఉమా. ఓ ప్రధాన సామాజికవర్గం ఓట్లను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ సామాజికవర్గంలోనూ ప్రధానంగా చీలిక కనపడుతోంది.37092769_1840900149330131_2318083773381476352_n

గత రెండు ఎన్నికల్లోనూ మైలవరంలో ఉమాకు సానుకూలతలు కలిసి రావడంతో విజయం సాధించారు. 2009లో రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన అప్పసాని సందీప్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఉమా గెలుపు నల్లేరు మీద నడకే అయ్యింది. ఇక గత ఎన్నికల్లో అప్పటి వరకు పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ మైలవరంకు స్థానికుడే అయినా ఇక్కడ చివర్లో కాన్సంట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా జోగి ఉమాకు చెమటలు పట్టించాడు. ఉమా తక్కువ మెజార్టీతోనే భయటపడ్డారు. అయితే, 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ఆయనను మంత్రిని చేశారు చంద్రబాబు. అప్పటి నుంచి దేవినేనిలో మార్పును స్పష్టంగా గమనించారు స్థానికులు. తమకు అందుబాటులో లేకుండా పోవడం, తమను పట్టించుకోకపోవడం కామన్గా మారింది.

ఇలా పరిస్థితి ఉంటే.. కనీసం దీనిని సరిదిద్దేందుకు కూడా దేవినేని ఎలాంటి ప్రయత్నమూ చేయకపోవడం గమనార్హం. పైగా తన గెలుపునకు కృషి చేసిన నాయకులనుకూడా పట్టించుకోవడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో దేవినేని గెలుపు అంత ఈజీ కాదని నిన్న మొన్నటి వరకు వ్యాఖ్యానించిన నాయకులు ఇప్పుడు దేవినేని ఓటమి ఖాయమని చెబుతుండడం గమనార్హం. దీంతో ఇక్కడ వైసీపీ నాయకుడిగా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రజల్లో తిరుగుతున్న వసంత కృష్ణ ప్రసాద్కు మద్దతు పెరుగుతోంది.

వసంత కృష్ణప్రసాద్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఎక్కడ ఎలాంటి కష్టం వచ్చినా వసంత అక్కడ వాలిపో తున్నారు. నేనున్నానంటూ.. ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా, పార్టీలకు అతీతంగా వసంత రెక్కలు కట్టుకుని వాలిపోయారు. అదేవిధంగా స్థానికంగా మంత్రి దేవినేని చేస్తున్న అవినీతిపైనా ఆయన బాణాలు ఎక్కు పెడుతున్నారు. ఈ పరిణామం నియోజక వర్గంలో వైసీపీకి అనుకూలంగా మారింది. ఈ అనుకూల పవనాలను గ్రహించిన స్థానికులు కూడా టీడీపీకి ఎన్నికలకు ముందుగానే రాం రాం చెబుతున్నారు.

ఈ క్రమంలోనే మైలవరం నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తలు టీడీపీ నుంచి సుమారు 250 మంది వైసీపీలో చేరారు. కొండపల్లి మాజీ సర్పంచ్ గురవయ్య, చండ్రగూడెం మాజీ సర్పంచ్ దేవరకొండ ఆంజనేయులు, మాజీ ఉప సర్పంచ్ శీలం అనిమి రెడ్డి, గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు వేమిరెడ్డి సంజీవ రెడ్డిలు ఉండడం గమనార్హం. ఈ పరిణామం.. రాజకీయాల్లో సంచలనంగా మారుతోందని, వచ్చే ఎన్నికల్లో దేవినేని పరాజయానికి ఇది పరాకాష్టగా మారనుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.vasantha-krishna-prasad-is-join-to-ysrcp

మైల‌వ‌రంలో ఉమాకి షాక్ …వైసీపీలోకి వ‌ల‌స‌లు…!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share