ద్వారక మూవీ TJ రివ్యూ

సినిమా : ద్వారక
నటీనటులు : విజయ్ దేవరకొండ, పూజా ఝావేరి, పృథ్విరాజ్, ప్రభాకర్, ప్రకాష్ రాజ్, సురేఖావాని, రఘుబాబు తదితరులు
సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె.నాయుడు
నిర్మాణ సంస్థ : లెజెండ్‌ సినిమా
నిర్మాతలు : ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు,
సంగీతం : సాయికార్తీక్
దర్శకత్వం : శ్రీనివాస్ రవీంద్ర

విజయ్ దేవరకొండ బహుశా ఈ పేరు తెలియని కుర్ర కారు ఎవరు ఉండరేమో, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై యూత్ కి కనెక్ట్ అయ్యే సంబాషణలతో ఆ సినిమాలో నాని ఫ్రెండ్ గా బానే మెప్పించాడు, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా ఐన సంవత్సరానికి తక్కువ బడ్జతో  పెళ్లిచూపులు సినిమా తీసి అమాంతం కోట్ల క్లబ్ లో చేరి క్రేజీ హీరో అయిపోయాడు ఈ విజయ్ దేవరకొండ, ఇవే కాకుండా తన సినిమాలను విడుదలకు ముందే యుట్యూబ్ చానెల్స్ ద్వారా తానే ప్రచారానికి దిగి సినిమా పై ఎక్సపెక్టషన్స్ పెంచేస్తున్నాడు. విజయ్ గురించి చెప్పుకోవాలంటే యాక్టింగ్ పరంగా పెద్ద హావభావాలు పలికించలేకపోయిన తాను ఎన్నుకునే కథ లకు న్యాయం చేయగలడు. తాజాగా “ద్వారక” సినిమాతో మన ముందుకు వచ్చాడు, మరి ఈ సినిమాతో మన విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్ని ఎలా మెప్పించాడో చూద్దాం.

ఈ సినిమాలో మన హీరో చిన్న చితక దొంగ తనాలతో మొదలుపెట్టి కొన్ని అనుకోని పరిస్థితుల్లో దొంగ బాబాగా మారాల్సి వస్తుంది, ఈ దొంగ బాబాకి గుడి కూడా కట్టి పూజలు.. కానుకలు ఇస్తుతుంటారు ఇలా దొంగ బాబాగా మంచి పాపులర్ అవుతాడు. ఇదే అదునుగా చూసి హీరో ఫ్రెండ్స్ డబ్బు సంపాదించడానికి ఇదే అనువైన మార్గంగా ఎంచుకుంటారు. ఇక్కడే హీరో గారికి ఊహించని సంఘటన జరుగుతుంది హీరో ప్రేమించిన అమ్మాయి తల్లి తండ్రులు కూతురికి పెళ్లి కాట్లేదు అని మన దొంగ హీరో బాబా దగ్గిరికి వస్తారు. కానీ హీరోయిన్ మాత్రం హీరోని అస్సలు నమ్మదు, ఇది ఇలా ఉంటె బాబాగారి పాపులారిటీ చూసి ఓ ముఠా కన్ను హీరో మీద పడుతుంది. హీరో బాబాని అడ్డుపెట్టుకొని ఆ ముఠా ట్రస్ట్ చెందాల్సిన 2 వేల కోట్లు కొట్టేయాలని చూస్తారు. ఇక హీరో బాబా నేను బాబా కాదని నిరూపించడానికి ఓ నాస్తికుడు రంగంలోకి దిగి తన ప్రయత్నాలు తాను చేస్తుంటాడు. ఒక పక్క హీరో లవర్ ప్రేమను ఎలా దక్కించుకున్నాడు మరో పక్క ఆ ముఠా బారినుంచి ఎలా బయటపడ్డాడో కథాంశం.

కథ పరంగా కొత్తదనం లేనప్పటికీ దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర కథనాన్ని నడిపించిన తీరు బాగుంది, సినిమా లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే దొంగ శ్రీను బాబాగా మారే తీరు, హీరో చేష్టలు, ప్రజల మూడాచారాలు, మీడియా హంగామా, అలాగే కథలో ఊహించని ట్విస్టులతో ఉల్లాసంగా సాగుతుంది. హీరోయిన్ గా పూజా ఝావేరి పాత్ర పెద్దగా లేన్నప్పటికీ ఉన్నంత సేపు ఆ పాత్రకు న్యాయం చేసింది. అక్కడక్కడా సినిమా స్పీడ్ తగినట్లు అనిపించినా కమిడియన్ పృద్వి ఆ లోటు భర్తీ చేసాడు, సినిమాలో ప్రకాష్రాజ్ పాత్రను దర్శకుడు బాగా డీల్ చేసాడు. కథ పరంగా హీరో విలన్ మధ్య సంభాషణలు బాగుంటాయి, హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సాంగ్స్ బాగా తెరకెక్కించారు అలేగే పాటలు కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్ వచ్చే తప్పటికీ దర్శకుడికి కథ నిడివి చాలక కాస్త కామెడీ ని నమ్ముకోవాల్సి వచ్చింది.

చివరిగా చెప్పుకొనేది ఏంటంటే ఓవరాల్ గా “ద్వారక” సినిమా సరుకు పాతదే అయినా కొత్త రంగు పూసినట్టు ఉంది. కానీ విజయ్ దేవరకొండ కాతాలో పెళ్లి చూపులు సినిమా లాంటి హిట్ పడిందో లేదూ తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.

రేటింగ్ : ౩/5