తూర్పు జోరు ఏ వైపు… ఏ పార్టీ లెక్క‌లేంటి…!

May 8, 2019 at 4:03 pm

తాజాగా ముగిసిన ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌ధానంగా మూడు పార్టీలు హోరా హోరీగా త‌ల‌ప‌డ్డాయి. అధికారం నిల‌బె ట్టుకునేందుకు టీడీపీ, అధికారంలోకి వ‌చ్చేందుకు వైసీపీలు భారీ ఎత్తున పోటీ ప‌డ్డాయి. ఇక‌, ముచ్చ‌ట‌గా మూడో పార్టీ ప‌వ‌న్ నేతృత్వంలోని జ‌న‌సేన కూడా గ‌ట్టి పోటీ ఇచ్చింది. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఏ పార్టీ ఊపు ఎలా ఉంది? ఏ పార్టీ ఏ జిల్లాలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ క్ర‌మంలోనే కాపులు స‌హా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ప్రాతినిధ్యం ఎక్కువ‌గా ఉన్న తూర్పు గోదావ‌రి జిల్లాలో ఈ మూడు పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది.

తూర్పుగోదావ‌రి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీ పీ కేవ‌లం 5 స్థానాల్లో మాత్రమే విజ‌యం సాధించింది. తుని, ప‌త్తిపాడు, కొత్త‌పేట‌, జ‌గ్గంపేట‌, రంప‌చోడ‌వ‌రం నియోజ‌కవ ర్గాల్లో వైసీపీ విజ‌యం సాధించింది. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్క రాజ‌మండ్రి సిటీ నుంచి బీజేపీ గెలుపొంద‌గా.. మిగిలి న నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం టీడీపీ విజ‌యం సాధించింది. మొత్తంగా ఈ ప‌రిణామంతో టీడీపీ జిల్లాలో కంచుకోట‌ను ఏర్పా టు చేసుకుంది. పెద్దాపురం నుంచి ఎన్నికైన చిన్న‌రాజ‌ప్ప హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఇలా.. ఇక్క‌డ నుంచి గెలిచిన వారు మంచి గుర్తింపు కూడా పొందారు.

అయితే, మ‌ధ్య‌లో చోటు చేసుకున్న రాజ‌కీయ మార్పులు, సమీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించిన వైసీపీ నాయ‌కులు టీడీపీ బాట ప‌ట్టారు. దీంతో ఇప్పుడు తాజాగా ముగిసిన ఎన్నిక‌ల్లో వైసీపీ మ‌రింత క‌సిగా ప్ర‌చారం చే సింది. త‌న పార్టీ త‌ర‌ఫున గెలిచి.. టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేల‌కు చెక్ పెట్టేలా ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. ఇక‌, టీడీపీ కూడా సిట్టింగులకే ఛాన్స్ ఇచ్చింది. అయితే, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీకి మ‌ద్ద‌తు పలికిన జ‌న‌సేనాని ప‌వ‌న్ ఈ ద‌ఫా.. నేరుగా నే రంగంలోకి దిగారు. ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌పై ఆయ‌న దృష్టి పెట్టారు. గెలుపు గుర్రాల‌కే ఆయ‌న కూడా టికెట్లు కేటాయించారు.

ఈ నేప‌త్యంలో ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో కాపు సామాజిక వ‌ర్గం మొత్తం సైలెంట్‌గా త‌మ ఓట్ల‌ను ప‌వ‌న్‌కే వేశార‌ని అంటున్నారు. అయితే తాము కాపు కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేశాం కాబ‌ట్టి.. త‌మ‌కే ఓట్లు వేస్తార‌ని టీడీపీ, లేదు ఈ రెండు పార్టీల‌క‌న్నా ముందు తామే హామీలు ఇచ్చాం కాబ‌ట్టి ప్ర‌జ‌లు త‌మ‌తోనే ఉంటార‌ని వైసీపీ పేర్కొంటున్నాయి. ఈ ప‌రిణామంతో ప‌రిస్థితి మూడు ముక్క‌లాటగా మారిపోయింది. ఎవ‌రు ఏ పార్టీ టికెట్‌పై గెలిచినా.. స్వ‌ల్ప మెజారిటీతో నే గ‌ట్టెక్కుతార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

తూర్పు జోరు ఏ వైపు… ఏ పార్టీ లెక్క‌లేంటి…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share