ఇంగ్లాండ్ సూప‌ర్ విక్ట‌రీ…

July 15, 2019 at 11:41 am

గ‌త నెల‌న్న‌ర రోజులుగా సాగుతున్న క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 ఎట్ట‌కేల‌కు విశ్వ‌విజేతగా క్రికెట్ పుట్టినిట్టికే ద‌క్కింది. న‌రాలు తెగె ఉత్కంఠ న‌డుమ క్రికెట్ చ‌రిత్ర‌లోనే క‌నివిని ఎరుగ‌ని రీతిలో ఎండ్ కార్డ్ ప‌డింది. క్రికెట్ ప్రేమికుల‌కు ఈ మ్యాచ్ ఓ మ‌రుపురాని జ్ఞాపంగా నిలిచిపోవ‌డం ఖాయం. ప్ర‌పంచ క‌ప్ ముగింపు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. 10 దేశాలు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో చివ‌రి పోరుకు న్యూజిలాండ్ ఇంగ్లాండ్‌లు స‌మాయ‌త్తం అయ్యాయి. ఆదివారం రోజున జ‌రిగిన ఈ మెగా క‌ప్ ఫైన‌ల్ ఎవ‌రికి అంతుచిక్క‌కుండా విజేత‌ను నిర్ణ‌యించింది. ఈ ఫైన‌ల్ పోరులో ఎట్ట‌కేల‌కు క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్‌కే సొంత‌మైంది.

టాప్ గెలిచిన‌ న్యూజిలాండ్ జ‌ట్లు మొద‌ట బ్యాటింగ్ ఎంచ‌కుంది. ముందుగా బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ 8వికెట్లు కోల్పొయి 241 ప‌రుగులు చేసింది. 242ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ న‌రాలు తెగు ఉత్కంఠ న‌డుమ చివ‌రి బంతికి 241 ప‌రుగులు చేయ‌డంతో స్కోర్ స‌మం చేసి ఆలౌట్ అయింది. దీంతో ఫ‌లితం తేల‌లేదు.. మ్యాచ్ టై కావ‌డంతో సూప‌ర్ ఓవ‌ర్‌కు దారితీసింది.

న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్ న‌డుమ మ్యాచ్ టై కావ‌డంతో సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీయ‌డంతో మొద‌ట‌గా ఇంగ్లాండ్ సూప‌ర్ ఓవ‌ర్‌లో 15 ప‌రుగులు చేసింది. 16 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ కూడా 15ప‌రుగులే చేసి మ్యాచ్‌ను టై చేసింది. సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై కావ‌డంతో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంది అని అంద‌రు న‌రాలు తెగె ఉత్కంఠతో ఎదురు చూసారు. అయితే సూప‌ర్ ఓవ‌ర్‌లో ఇంగ్లాండ్ మెరుగైన బౌండ‌రీలు బాద‌డం, న్యూజిలాండ్ బౌండ‌రీలు సాధించ‌క‌పోవ‌డంతో ఇంగ్లాండ్ విజ‌యం సాధించిన‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో ప్ర‌పంచ‌క‌ప్ ఇంగ్లాండ్ వ‌శ‌మైంది. క్రికెట్ పుట్టింటికి క‌ప్ ఎట్ట‌కేల‌కు చేరింది.

1975లో మొద‌లైన ప్ర‌పంచ క‌ప్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఇంగ్లాండ్ ఒక్క‌సారి కూడా గెలుచుకోలేదు. ఇక న్యూజిలాండ్ కూడా ఒక్క‌సారి కూడా క‌ప్ గెలుచుకోలేదు. దీంతో ఇరుజ‌ట్లు క‌ప్ కోసం చివ‌రి వ‌ర‌కు హోరాహోరిగా పోరాడాయి. యుద్ధంలో సైనికుల్లా చివ‌రికంటా పోరాడిన ఇరుజ‌ట్లు చివ‌రికి విశ్వ‌విజేత‌గా ఇంగ్లాండ్‌ను నిలిచింది.

ఇంగ్లాండ్ సూప‌ర్ విక్ట‌రీ…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share