పవన్ వల్లే గాజువాకలో విచిత్రమైన టాక్ !

May 20, 2019 at 3:07 pm

గ‌త నెల 11న జ‌రిగిన రాష్ట్ర ఎన్నిక‌ల‌లో అనేక ఆస‌క్తిక‌ర ఘ‌ట్టాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా కీల‌క నాయ‌కులు పెద్ద ఎత్తున పోటీలో నిల‌వ‌డంతో నాయ‌కుల మ‌ధ్య మాత్ర‌మే కాకుండా ప్ర‌జ‌ల్లోనూ ఎవ‌రు గెలుస్తార‌నే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఇలాంటి అత్యంత ఆస‌క్తిక‌ర నియోజ‌క‌వ‌ర్గం విశాఖ జిల్లా గాజువాక‌. ఇక్క‌డ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస రావు పోటీ చేయ‌గా, వైసీపీ నుంచి తిప్ప‌ల నాగిరెడ్డి పోటీ చేశారు. అయితే, అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా మార్పులు తెస్తా నంటూ.. ప్ర‌శ్నించ‌డ‌మే త‌న విజ‌న్ అంటూ దూసుకు వ‌చ్చిన జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా ఇక్క‌డ నుంచి పోటీ చేశారు. ప‌వ‌న్ ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గం గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం లేనివారు కూడా దీని గు రించి తెలుసుకుని లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఇక‌, ఎన్నిక‌లు జ‌రిగిన తీరును గ‌మ‌నిస్తే.. ఇక్క‌డ టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన అన్న‌ట్టుగా సాగింద‌ని ఎన్నిక‌లు పూర్త‌యిన తొలి వారంలో విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నాయి.దీనికి అనేక కార‌ణాలు కూడా ఉన్నాయి. ప‌వ‌న్ ఇక్క‌డ ప్ర‌చారాన్ని ఉద్రుతంగా చేయ‌డం, విశాఖ నుంచి గెలిచి.. ఇక్క‌డ జ‌న‌సేన‌ను మ‌రింత డెవ‌ల‌ప్ చేయ‌డంతోపాటు ఐటీ రాజ‌ధాని వంటి విశాఖ‌లో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతోనే ప‌వ‌న్ ఇక్క‌డ నుంచి పోటీ చేశార‌ని విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. ఇక్క‌డ కాపు ఓటు బ్యాంకు కీల‌కం. దీంతో ప‌వ‌న్ ఏరికోరి మ‌రీ ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకున్నార‌నే ప్ర‌చారం సాగింది. ఇక‌, ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే ప‌ల్లాకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు టికెట్ ఇచ్చి.. గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపు కూడా ఇచ్చారు.

గత 2014 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య పోటీ నెలకొంటే, ఈ పర్యాయం జనసేన అభ్యర్థిగా పవన్‌కల్యాణ్‌ పోటీ చేయడంతో సమీకరణలు మారిపోయాయి. తొలుత టీడీపీ, జనసేన మధ్య పోటీ వుంటుందని భావించారు. ప‌ల్లా వ‌ర్సెస్ ప‌వ‌న్ అనే రేంజ్‌లో విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. అయితే, మూడో కృష్ణుడిగా నాగిరెడ్డి రంగ ప్ర‌వేశంతో ప‌రిస్థితి మూడుముక్క‌లా టగా మారిపోయింది. వైసీపీ భారీగా డబ్బు ఖర్చు చేయడంతో సీన్‌ మారింది. ఇక నియోజకవర్గంలో భారీ సంఖ్యలో మహిళలు అర్ధరాత్రి వరకు పోలింగ్‌ బూత్‌లలో క్యూ కట్టి ఓటు వేయడంతో ఫలితంపై అంచనాలు దొరకని పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతలను పలకరిస్తే తమకు కనీసం ఐదు వేల ఓట్ల మెజారిటీ ఖాయమని చెబుతున్నారు. అదే వైసీపీ నాయకులు 15 వేలు, జనసేన నేతలు పది వేలు కనీసం మెజారిటీ వస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు విజ‌యం సాధిస్తార‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది.

పవన్ వల్లే గాజువాకలో విచిత్రమైన టాక్ !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share