హరీష్ రావు కు మళ్లీ చుక్కెదురు

March 25, 2019 at 3:48 pm

అదేమిటోగానీ.. టీఆర్ఎస్ పార్టీలో హ‌రీశ్‌రావు క‌ద‌లిక‌లపై అన్ని రాజకీయ వ‌ర్గాలు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తాయి. పార్టీలో ఆయ‌న స్థానంపై నిత్యం చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, హ‌రీశ్‌ల మ‌ధ్య ఆధిప‌త్యం ఉందంటూ రాజ‌కీయ‌వ‌ర్గాల‌తోపాటు సామాన్య‌ప్ర‌జ‌ల్లోనూ ఆ టాక్ ఉంది. ఈ క్ర‌మంలోనే హరీశ్‌కు సంబంధించిన ప్ర‌తీ విషయాన్ని అంద‌రూ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తుంటారు. ఇప్పుడు తాజాగా.. మ‌రో విష‌యం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాలో హ‌రీశ్‌రావు పేరు లేక‌పోవ‌డంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ పార్ల‌మెంట్‌ ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్లుగా తెలంగాణ‌లోని మూడు పార్టీల నుంచి 62 మంది పేర్లకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఇందులో అధికార టీఆర్ఎస్‌ నుంచి 20 మంది జాబితాను ఆ పార్టీ ఎన్నికల సంఘానికి పంపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, రాష్ట్ర క్యాబినెట్‌లోని 11 మంది మంత్రులు, సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, అయిదుగురు ప్రధాన కార్యదర్శులు జె.సంతోష్‌కుమార్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్‌.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, బండా ప్రకాశ్‌, టీ రవీందర్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పేర్లను ఎన్నికల సంఘానికి పంపింది. అయితే.. ఆ జాబితాలో హ‌రీశ్‌రావు పేరు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

దీంతో మ‌ళ్లీ హ‌రీశ్‌రావు అంశం రాజ‌కీయవ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. స్టార్ క్యాంపెన‌యిర్ల జాబితాలో ఆయ‌న పేరును చేర్చ‌క‌పోవ‌డంలో కేసీఆర్ ఆంత‌ర్యం ఏమిట‌నే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక మజ్లిస్‌ పార్టీ నుంచి స్టార్‌ క్యాంపెయినర్లుగా అన్నదమ్ములు లోక్‌సభకు పోటీ చేస్తున్న పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ, శాసనసభా పక్ష మాజీనేత అక్బరుద్దీన్‌ ఓవైసీలు మాత్రమే ఉన్నారు. బీఎస్పీ నుంచి 40 మంది జాబితాను ఎన్నికల సంఘం ఆమోదించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పార్టీ సమన్వయకర్తలు వీర్‌సింగ్‌, గౌరి ప్రసాద్‌ ఉపాసక్‌, తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్తలు సిద్ధార్థపూలే, దేవళ్ల గంగాధర్ త‌దిత‌రులు ఉన్నారు.

హరీష్ రావు కు మళ్లీ చుక్కెదురు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share