స్క్రీనింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఆ సీటు నుండే పవన్ పోటీ !

February 17, 2019 at 2:44 pm

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఆయా పార్టీల అగ్రనేత‌లు పోటీ చేసే స్థానాల‌పై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత‌,ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌లు పోటీ చేసే స్థానాల‌పై దాదాపుగా క్లారిటీ ఉన్నా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ విష‌యంలో మాత్రం ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. ఆయ‌న పోటీ చేసే స్థానంపై చాలా రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ కూడా ప‌లుమార్లు.. ప‌లుచోట్లు.. ప‌లు విధాలుగా స్పందించారు. ఒక‌సారేమో అన్ని కుదిరితే పిఠాపురం నుంచి చేస్తాన‌ని, మ‌రొక‌సారేమో.. అనంత‌పురం నుంచి బ‌రిలోకి దిగుతాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆమ‌ధ్య ఏలూరు పేరు కూడా వినిపించింది.51791281_772020916530519_4468718020411260928_n

ఇక తాజాగా మ‌రో కొత్త నియోజ‌క‌వ‌ర్గం పేరు వినిపిస్తోంది. ప‌వ‌న్ జ‌నంలోకి వ‌చ్చిన మొద‌ట్లో ఎక్కువ‌గా ఉత్త‌రాంధ్ర‌లో ఎక్కువ‌గా ప‌ర్య‌టించారు. అక్క‌డి నుంచే త‌న ప్ర‌జాపోరాట‌యాత్ర చేప‌ట్టారు. అక్క‌డే ఎక్కువ‌గా హ‌డావుడి చేశారు. ఇక ఆ త‌ర్వాత ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ ఆయ‌న బాగానే ప‌ర్య‌టించారు. అంతేగాకుండా.. ఆయ‌న సొంత సామాజిక‌వ‌ర్గం కూడా ఎక్కువ‌గా ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఉంది. ఇక ఆ త‌ర్వాత ఏపీలోని ఏ ఇత‌ర ప్రాంతాల్లోనూ ఆయ‌న పెద్ద‌గా ప‌ర్య‌టించ‌లేదు. పార్టీ నిర్మాణం కూడా అనుకున్నంత స్థాయిలో జ‌ర‌గ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పోటీ చేసే స్థానంపై అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.51381331_772019966530614_4206220064640204800_n

అయితే.. పార్టీ అభ్య‌ర్థులు ఎవ‌రు ఎక్క‌డి నుంచి పోటీ చేయాల‌న్న విష‌యంపై పార్టీలో స్ర్కీనింగ్ క‌మిటీ వేశారు. ఈ క‌మిటీ మాత్రం ప‌వ‌న్ ఉత్త‌రాంధ్ర నుంచి పోటీ చేయాల‌ని, అదికూడా గాజువాక నుంచి బ‌రిలోకి దిగాల‌ని సూచించిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కోసం చేప‌ట్టిన మిస్డ్ కాల్ కు కూడా అక్క‌డి నుంచే ఎక్కువ‌మంది న‌మోదు అయ్యార‌ని, అందుకే అక్క‌డి నుంచే పోటీచేయాల‌ని సూచించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రొక కార‌ణం కూడా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ‌గా రాయ‌ల‌సీమ ప్రాంతం నుంచే ముఖ్య‌మంత్రులు అయ్యార‌ని, ఉత్త‌రాంధ్ర నుంచి కాలేద‌ని, ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప‌వ‌న్ ఉత్త‌రాంధ్ర నుంచి బ‌రిలోకి దిగితే ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పంద‌న ఉంటుంద‌న్న అంచ‌నాతో ఆ క‌మిటీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యంలో క్లారిటీ రావాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే మ‌రి.

స్క్రీనింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఆ సీటు నుండే పవన్ పోటీ !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share