ఆ మూడు జిల్లాలో జనసేన బెట్టింగుల హ‌వా..!

April 30, 2019 at 3:19 pm

ఏపీలో ముచ్చ‌ట‌గా మూడో ప్రధాన పార్టీగా అవ‌త‌రించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పై కూడా రాష్ట్రంలో బె ట్టింగులు న‌డుస్తున్నాయి. ప్ర‌శ్నిస్తానంటూ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్‌.. జ‌న‌సేన పేరుతో 2014 ఎన్నిక‌ల‌కు ముందు పెద్ద ఎత్తున ఊపు తెచ్చారు. అయితే, అప్ప‌టి ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీకి దూరంగా ఉన్నారు. ఇక‌, తాజాగా ముగిసిన ఎన్నిక‌ల్లో మాత్రం క‌మ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల్లో పోటీకి దిగారు. ముఖ్యంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాలు, గుం టూరు, విజ‌య‌వాడ‌, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల‌ను టార్గెట్ చేసుకుని ఎన్నిక‌ల్లో ప్ర‌చార జోరు పెంచారు. ఆయా జిల్లాల్లో పోటీకి దిగారు. ప‌వ‌న్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేశారు. విశాఖ‌లోని గాజువాక‌, ప‌శ్చిమ గోదావ‌రిలోని భీమ‌వ‌రం నుంచి ఆయ‌న బ‌రిలో నిలిచారు.

కానిస్టేబుల్ కుమారుడు సీఎం సీటులో కూర్చునేందుకు అర్హుడు కాదా? అంటూ సెంటిమెంటును రెచ్చ‌గొట్టి.. మాస్ జ‌నా ల మ‌న‌సుల్లో నిలిచారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా అవ‌త‌రించారు. వైసీపీ, టీడీపీల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు ప‌వ న్‌. ప్ర‌సంగాల్లోనూ ప‌దును పెంచుకుని ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలోనే అన‌తి కాలంలోనే ఊ హించ‌ని రేంజ్‌కు పార్టీని ప‌రుగులు పెట్టించారు. దీంతో ఎన్నిక‌ల స‌మ‌యానికి వ‌చ్చే స‌రికి పార్టీకి ప్ర‌జ‌ల్లో మంచి గుర్తిం పు వ‌చ్చింది.ప్ర‌ధానంగా సీబీఐ మాజీ జేడీ వంటి వారు వ‌చ్చి పార్టీలో చేర‌డం ద్వారా అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగి పోయా యి. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల అనంత‌రం టీడీపీ, వైసీపీలగెలుపు ఓట‌ముల‌పై ఏ విధంగా అయితే పందేలు క‌డుతున్నా రో.. జ‌న‌సేనపై కూడా బెట్టింగులు క‌డుతున్నారు.

అయితే, పార్టీ అధికారంలోకి వ‌స్తుందా? రాదా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి.. అభ్య‌ర్థుల వారీగా జ‌న‌సేన త‌ర‌ఫున బెట్టిం గులు క‌డుతున్న వారు పెరుగుతున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లోని కొన్ని స్థానాలపై ఆ పార్టీ అభిమానులు పందేలు వేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, తూర్పుగోదావరి జిల్లా రాజోలు, కృష్ణా జిల్లా పెడన, అవనిగడ్డ, విజయవాడ(తూర్పు) తదితర నియోజకవర్గాల్లో తమ పార్టీయే గెలుస్తుందని.. పవన్‌ కల్యాణ్‌ స్వయంగా పోటీచేసిన భీమవరం, గాజువాక స్థానాల్లోనూ తమదే విజయమని జోరుగా పందేలు కాస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినా.. అది జనసేన మద్దతుతోనేనని బెట్టింగుల జోరు సాగుతోంది. పోలింగ్‌ ముగిశాక కొన్నిరోజులు ఉన్న అంచనాలకు.. ఇప్పటికీ జనసేన నేతల్లో అంచనాలు అనూహ్యంగా మారాయి. తొలుత పవన్‌ పోటీచేసిన భీమవరం, గాజువాకల్లో ఏదో ఒక స్థానంలో గెలుస్తారని అభిమానులు భావించారు. ఇప్పుడు లెక్కలు వేసుకుని.. రెండు చోట్లా విజయం సాధిస్తామంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌య్యే మే 23 నాటికి ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

ఆ మూడు జిల్లాలో జనసేన బెట్టింగుల హ‌వా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share