షాకింగ్‌ న్యూస్‌: జ‌న‌సేన ప్లాన్-బీ ఇదే

May 11, 2019 at 3:37 pm

రాష్ట్రంలో తృతీయ పార్టీగా అవ‌త‌రించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ.. ఆది నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తం గా ప‌వ‌న్ దూకుడు ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే. 2014లో పార్టీ స్థాపించినా.. అప్ప‌టి ఎన్నిక‌ల్లో దూరంగా ఉండి తాజా గా జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీఎస్పీ, క‌మ్యూనిస్టుల‌తో పొత్తు పెట్టుకుని పోటీకిదిగారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు జ‌న‌సేనపై భారీ గానే ఆశ‌లు ఉన్నాయి. అయితే, ఎన్నిక‌ల్లో డ‌బ్బుల పందేరానికి, ప్ర‌జ‌ల‌కు తాయిలాలు ఇవ్వ‌డానికి వ్య‌తిరేకించడంతో ఒకింత వెనుక‌బ‌డింది. దీంతో అసెంబ్లీ, సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకోలేదు. దాదాపు 25 ఏళ్ల ప్ర‌స్థానాన్ని నిర్ణ‌యించుకున్న ప‌వ‌న్ ఆదిశ‌గానే అడుగులు వేయ‌డం స్ప‌ష్టంగా క‌నిపించింది.

అయితే, మ‌ళ్లీ రాష్ట్రంలో ఎన్నిక‌ల కోలాహ‌లానికి తెర‌లేవ‌నుంది. ఈ నెల 23న అసెంబ్లీ, సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లైన వెంట‌నే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా చాటాల‌ని, క్షేత్ర‌స్థాయిలో, ముఖ్యంగా గ్రామ పంచాయితీ స్థాయిలో జ‌న‌సేన స‌త్తాచాటాల‌ని ప‌వ‌న్ ముందుగానే నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ప్లాన్‌-బీని ఆయ‌న తెర‌మీదికి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ట్టు సాధించేందుకు స్థానిక ఎన్నిక‌ల‌ను ఏ పార్టీ అయినా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటుంది. ప్ర‌ధానంగా స్థానిక ఎన్నిక‌లు ఏ పార్టీ గుర్తుపైనా జ‌ర‌గ‌క‌పోయినా.. పార్టీల‌కు గుర్తింపు మాత్రం ఉంటుంది. దీనినే ఇప్పుడు ప‌వ‌న్ త‌న‌కు, పార్టీకి కూడా అన్వ‌యించుకుని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం అంటే ఈ నెల 23 త‌ర్వాత ఏర్ప‌డే కొత్త ప్ర‌భుత్వం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం చేస్తుంది. అన్ని జిల్లాల్లోనూ కార్పొరేష్ల‌ను, మునిసిపాలిటీలు, పంచాయితీల్లో ప‌ట్టు పెంచుకోవ‌డం ద్వారా జ‌న‌సేన స‌త్తాచాటాల‌ని ఇప్ప‌టికే స్థానిక నాయ‌కుల‌కు ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో విజ‌య‌వాడ‌, తిరుప‌తి, విశాఖ కార్పొరేష‌న్లు స‌హా మునిసిపాలిటీలు, పంచాయితీల‌కు జూన్‌లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఇచ్చేందుకు ఇప్ప‌టికే అధికారులు క్షేత్ర‌స్థాయిలో రంగం సిద్ధం చేసుకుని ఉంచారు. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌నే ఈ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌నుంది. దీనికి సంబంధించిన రిజ‌ర్వేష‌న్ల ప్ర‌క్రియ‌ను కూడా అధికారులు ఇప్ప‌టికే పూర్తి చేశారు. ఈ నేప‌థ్యంలో జూలై రెండు లేదా మూడో వారంలో స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నుండ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప‌వ‌న్‌.. వ్యూహాత్మ‌కంగా ప్లాన్‌-బీని స‌క్సెస్ చేసేందుకురెడీ అవుతున్నారు. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.

షాకింగ్‌ న్యూస్‌: జ‌న‌సేన ప్లాన్-బీ ఇదే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share