జనసేనకు కొత్త గుర్తు ..

April 25, 2019 at 1:03 pm

సినీహీరో, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాన్‌కు గుర్తుల గోల తల‌నొప్పులు తెస్తోంది. పార్టీ స్థాపించిన ఐదేళ్ల‌కు బ‌రిలోకి దిగిన జ‌న‌సేనానికి ఎన్నిక‌ల సంఘం గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. మొన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ గ్లాస్ గుర్తుపై బ‌రిలో నిలిచి ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన విష‌యం తెలిసిందే. ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే తెలంగాణ రాష్ర్టంలో ప్రాదేశిక ఎన్నిక‌లకు ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి జ‌న‌సేన సిద్ధ‌మ‌వ‌గా ఈసీ ఏఏ పార్టీకి ఏఏ గుర్తులు కేటాయించాల‌నే యోచ‌న‌లో ప‌డి జ‌న‌సేన‌కు బ్యాట్ గుర్తును కేటాయించింది.

తెలంగాణ‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీల‌కు ఒకేసారి ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న ద్రుష్ట్యా ఈవీఎంలైనా, బ్యాలెట్ బాక్స్‌లైనా రెండు వేర్వేరుగా ఉప‌యోగిస్తారు. సాధార‌ణ ఎన్నిక‌ల్లో మాదిరిగానే పార్టీ గుర్తుల‌పైనే ఈ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి నిర్ణ‌యించినా జ‌న‌సేన‌కు రెండు గుర్తులు కేటాయించ‌డంపై ఇప్పుడు అంత‌టా చ‌ర్చ సాగుతోంది. అయితే ఎన్నిక‌ల సంఘాన్ని ప్ర‌శ్నించ‌డం ఎవ‌రి త‌ర‌ము కాదు కాబ‌ట్టి జ‌న‌సేన ఓ ఆలోచ‌న‌తో ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

తెలంగాణ స్థానిక ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి రెండు గుర్తులు కేటాయించార‌ని ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంటోంది. జెడ్పీటీసీ స్థానాల‌కు జ‌రుగ‌నున్న ఎన్నిక‌ల్లో గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తార‌ని, అలాగే ఎంపీటీసీ స్థానాల‌కు జ‌రుగ‌నున్న ఎన్నిక‌ల‌కు క్రికెట్ బ్యాట్ గుర్తును కేటాయిస్తార‌ని జ‌న‌సేన అధిష్టానం తెలియ‌జేస్తోంది. ప్ర‌జ‌లు అన‌వ‌స‌ర గంద‌ర‌గోళానికి దిగి ఇబ్బందులు ప‌డొద్ద‌ని సూచించింది. మొత్తంగా పార్టీకి రెండు గుర్తులు కేటాయించ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది.

జనసేనకు కొత్త గుర్తు ..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share