వైసీపీపై జేసీ పొలిటిక‌ల్ స‌టైర్లు

July 13, 2019 at 12:34 pm

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు, వ్యూహ ప్ర‌తివ్యూహాలు కామ‌న్‌. అయితే, పాలిటిక్స్‌లో లైవ్‌లో ఉన్న‌వారు ఇలాం టి ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చేశారంటే అర్ధం ఉంటుంది. కానీ, తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నాన‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా అనంత‌పురం మాజీ ఎంపీ, సీనియ‌ర్ నాయ‌కుడు జేసీ దివాక‌ర్ రెడ్డి ప‌దే ప‌దే వైసీపీపై కామెంట్లు కుమ్మ‌రి స్తున్నారు. రాజ‌కీయాల్లో త‌న ప‌దునైన వ్యాఖ్య‌ల‌కు వ్యంగ్యాంన్ని జోడించి మాట్లాడే నాయ‌కుల్లో జేసీ ఒక‌రు.

ఆయ‌న ఏం మాట్లాడినా ఇటీవ‌ల కాలంలో చాలానే పాపుల‌ర్ అవుతున్నారు. ఎన్నిక‌ల‌కు కొద్ది రోజుల ముందు.. టీడీపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు. పసుపు కుంకుమ లేక‌పోతే.. టీడీపీ ప‌రిస్థితి ఎప్పుడో అయిపోయేద‌ని వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల‌కు ముందు చేసిన ఈ ప్ర‌క‌ట‌న రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించింది. తాజాగా వైసీపీ ప్ర‌భుత్వంపై న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు జేసీ. రాష్ట్రం లో జ‌గ‌న్ అవినీతి ర‌హిత పాల‌న కోరుతున్నార‌ని, అయితే, వైసీపీ నాయ‌కులు మాత్రం ఎక్క‌డిక‌క్కడ సంపాయించుకు నేందుకు రెడీ అవుతున్నార‌ని విమ‌ర్శించారు.

ప్ర‌తి విష‌యంలోనూ జ‌గ‌న్ క‌రెక్టుగా ఉన్నాడ‌ని కితాబిస్తూనే.. ఆయ‌న మం చిగానే ఉన్నాడు కానీ, ఆయ‌న సైన్యం మాత్రం సంపాద‌న‌పై దృష్టి పెట్టింద‌ని వ్యాఖ్యానించారు. అవినీతి ఎక్క‌డున్నా స‌హించేది లేద‌ని ముఖ్య‌మంత్రి అంటుంటే, అవ‌కాశం కోసం కొంత‌మంది ఎదురుచూస్తున్నారంటూ జేసీ చేసిన వ్యాఖ్య లు కాస్త సీరియ‌స్‌గానే భావించాలి. మ‌రోప‌క్క‌, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటై.. కేవ‌లం నెల రోజులు మాత్రమే అయిన నేప‌థ్యంలో రాష్ట్రంలో ఆయ‌న ప‌నితీరును భేరీజు వేసుకునేందుకు మ‌రో ఆరు మాసాల స‌మ‌యం ప‌డుతుంద‌ని అప్ప‌టి వ‌ర‌కు విమ‌ర్శ‌ల జోలికి ఎవ‌రూ వెళ్ల‌కుండా ఉంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.

మొత్తానికి చూస్తే.. టీడీపీ ఓడిపోయిన నేప‌థ్యంలో ఆ పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల్లో టికెట్లు తెచ్చుకుని పోటీ చేసి ఓడిపోయిన త‌న కుమారుల‌ను ఆ పార్టీ నుంచి దూరం చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అదేస‌మ‌యంలో బీజేపీ నుంచి వ‌స్తున్న ఆఫ‌ర్ల‌పైనా జేసీ స్పందించారు. రాజ‌కీయాల్లో త‌ట‌స్థంగా ఉన్నాన‌ని చెబుతున్న జేసీ.. బీజేపీ నేత‌లంతా త‌న‌కు ట‌చ్‌లోనే ఉన్నార‌ని చెప్పుకొచ్చారు. అయితే, తాను ఏ పార్టీ త‌ర‌ఫునా వ‌కాల్తా పుచ్చుకోన‌ని అన్నారు. మొత్తానికి తాను రాజ‌కీయాల్లో లేనంటూనే జేసీ త‌న‌దైన శైలిలో స్పందించారు.

వైసీపీపై జేసీ పొలిటిక‌ల్ స‌టైర్లు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share