ప‌రేషాన్‌లో ప‌వ‌న్‌రెడ్డి… రీజ‌న్ ఇదేనా..!

May 10, 2019 at 11:38 am

జేసీ బ్ర‌ద‌ర్స్. రెండు రాష్ట్రాల తెలుగు ప్ర‌జ‌ల‌కు వీరిని ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. త‌మ వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌తో మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసే ఈ ఇద్ద‌రికి ఇప్పుడు కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా టీడీపీని తిట్టిపోసిన జేసీ దివాక‌ర్ రెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డిలు.. 2014 ఎన్నిక‌ల వేళ‌కు ప్లేట్ ఫిరాయించారు. రాష్ట్ర విభ‌జ‌న, కాంగ్రెస్‌పై ప్ర‌జాగ్ర‌హం కార‌ణంగా.. జేసీ సోద‌రులు కాంగ్రెస్‌కు బై చెప్పి టీడీపీలోకి వ‌చ్చి.. తాడిప‌త్రి నుంచి ప్ర‌భాక‌ర్‌, అనంత‌పురం నుంచి దివాక ర్ రెడ్డిలు టీడీపీ టికెట్‌పై పోటీ చేసి విజ‌యం సాధించారు. ఇక‌, ఇప్పుడు గ‌త నెల్లో జ‌రిగిన తాజా ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇద్ద‌రూ కూడా త‌ప్పుకొని.. తమ కుమారుల‌ను రంగంలోకి దింపారు.

అనంత‌పురం ఎంపీ స్థానం నుంచి దివాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు జేసీ ప‌వ‌న్ కుమార్ రెడ్డి, తాడిప‌త్రి అసెంబ్లీ సీటు నుంచి ప్ర భాక‌ర్ రెడ్డి త‌న‌యుడు అస్మిత్ రెడ్డిలు పోటీ చేశారు. తాడిప‌త్రిలో అస్మిత్ గెలుపు విష‌యంపై ఎలాంటి సందేహం లేదు. అయితే, అనంత‌పురం పార్ల‌మెంటు స్థానం నుంచి ప‌వ‌న్ గెలుపుపైనే ఇప్పుడు చ‌ర్చ మొత్తం న‌డుస్తోంది. ఆ పార్లమెంటు స్థానం ప‌రిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఒక్క ఎస్సీ స్థానం మిన‌హా మిగిలిన‌వి జ‌న‌ర‌ల్‌. ఇక‌, గత ఎన్నిక‌ల మాట ఎలా ఉన్నా… ఇప్పుడు త‌న కుమారుడు గెలుపు గుర్రం ఎక్కాలంటే.. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ బ‌ల‌మైన అభ్య‌ర్థులు ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న జేసీ దివాక‌ర్‌.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న‌కు స‌రిప‌డ‌ని, లేదా వీక్‌గా ఉన్న వారిని ఒత్తిడి చేసి మ‌రీ మార్చారు.

ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో రాయ‌దుర్గం, ఉర‌వ‌కొండ‌, గుంత‌క‌ల్‌, తాడిప‌త్రి, క‌ళ్యాణ‌దుర్గం, సింగ‌న‌మ‌ల‌, అనంత‌పురం అర్బ‌న్ ఉన్నాయి. వీటిలో ఒక్క ఉర‌వ‌కొండ‌లో మాత్రం వైసీపీ అభ్య‌ర్థి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాడు. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అభ్య‌ర్థులే గెలుపొందారు. ఇక‌, తాడిప‌త్రిలో గ‌త ఎన్నిక‌ల్లో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి విజ‌యం సాధించా డు. ఇప్పుడు ఆయ‌న కుమారుడే ఉన్నారు. ఇక‌, సింగ‌న‌మ‌ల విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ నుంచి గెలిచిన యామినీ బాలను త‌ప్పించి.. బండారు శ్రావ‌ణికి జేసీ టికెట్ ఇప్పించుకున్నార‌ని స‌మాచారం. అదేవిధంగా క‌ళ్యాణ దుర్గంలో ఉన్నం హ‌ను మంత‌రాయ చౌద‌రిని త‌ప్పించి ఉమామ‌హేశ్వ‌ర్ నాయుడుకి టికెట్ ఇప్పించుకున్నారు. గుంత‌క‌ల్లులో ఆర్ జితేంద‌ర్ గౌడ్ పోటీ చేశారు.

గుంత‌క‌ల్లులో జితేంద‌ర్‌గౌడ్‌ను త‌ప్పించేందుకు జేసీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ఇక అనంత‌పురం అర్బ‌న్‌లో సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాక‌ర్ చౌద‌రిని త‌ప్పించాల‌ని జేసీ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. ఇక్క‌డ జేసీ వ‌ర్గం ఎమ్మెల్యేకు యాంటీగా చేస్తే, ప్ర‌భాక‌ర్ వ‌ర్గం ఎమ్మెల్యే ఓటు వ‌ర‌కు త‌మ‌కు వేసుకుని… ఎంపీ ఓటు వేయ‌లేద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. వాతావ‌ర‌ణం పైకి జేసీకి అనుకూలంగానే ఉన్నా.. చాప‌కింద నీరులా వ్య‌తిరేకత కూడా వ‌ర్క‌వుట్ అయింద‌ని అంటున్నారు. దీంతో అనంత‌పురం ఎంపీ స్థానంపై జేసీ ప‌వ‌న్ ప‌రేషాన్ అవుతున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

ప‌రేషాన్‌లో ప‌వ‌న్‌రెడ్డి… రీజ‌న్ ఇదేనా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share