ఎన్టీఆర్‌కు అవ‌మానం… తార‌క్ ఫైర్‌

May 28, 2019 at 12:32 pm

దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వెల‌వెల‌బోయింది. ఓ వైపు ఏపీలో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఏపీ వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ జ‌యంతి చేసేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. ఎన్టీఆర్ వీరాభిమానులు మిన‌హా మిగిలిన వారు జ‌యంతి విష‌యంలో అంటీముట్ట‌న‌ట్టుగా ఉన్నార‌న్న‌ది వాస్త‌వం. చివ‌ర‌కు చంద్ర‌బాబు కూడా ఎన్టీఆర్ జ‌యంతిని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఇదిలా ఉంటే మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా క‌నీసం ఎన్టీఆర్ జ‌యంతి నాడు అయినా పూలతో కలకలలాడాల్సిన సమాధి కల తప్పింది. క‌నీసం ఎన్టీఆర్ ఘాట్‌ను కూడా అలంక‌రించ‌లేదు అంటే అటు ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో పాటు ఇటు చంద్ర‌బాబు నాయుడు ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఏం చేస్తున్నారో తెలియ‌ని ప‌రిస్థితి. ఇక మంగ‌ళ‌వారం ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు వ‌చ్చిన జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ క‌నీసం ఎన్టీఆర్‌ను ఘాట్‌ను అలంక‌రించ‌క‌పోవ‌డంతో తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు.

తాత జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు అర్పించేందుకు వీరిద్ద‌రు ఉద‌యాన్నే ఎన్టీఆర్ ఘాట్‌కు వ‌చ్చారు. కారు దిగి స‌మాధి వ‌ద్ద‌కు రాగానే అక్క‌డ ఎన్టీఆర్ స‌మాధి పూర్తిగా క‌ళ త‌ప్పి ఉంది. ఆ దృశ్యం చూసిన తార‌క్, క‌ళ్యాణ్‌రామ్‌ తీవ్ర‌స్థాయిలో అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజుల్లో ఎప్పుడూ పుష్పాలతో కలకలలాడే ఘాట్.. ఈసారి ఒక్క పువ్వు కూడా లేకుండా వెలవెలబోయింది.

వెంట‌నే తార‌క్‌ భారీ పుష్ఫాల‌ను తెప్పించి తానే స్వ‌యంగా ఎన్టీఆర్ స‌మాధిని అలంక‌రించారు. ఆ త‌ర్వాత తార‌క్‌, క‌ళ్యాణ్ పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు. తాత సమాధి పక్కనే కాసేపు మౌనంగా కూర్చున్నారు. ఇక నుంచి తాత వర్ధంతి, జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి తార‌క్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తార‌క్ మాట‌తో అయినా చంద్ర‌బాబుకు క‌ను విప్పు క‌లుగుతుందో ? లేదో ? చూడాలి.

ఎన్టీఆర్‌కు అవ‌మానం… తార‌క్ ఫైర్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share