అదే జరిగితే ఎన్టీఆర్ వాళ్లకు దూరమే !

July 23, 2019 at 11:19 am

ఏపీలో ఎన్నిక‌లు ముగిసినా.. అంత‌కుమించిన ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు.. ఏపీ రాజ‌కీయాల్లో హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు సంబంధించి హాట్‌హాట్‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న చుట్టూ ఆనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎన్టీఆర్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించే అవ‌కాశాలు ఉన్నాయ‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. అయితే.. ఇక ఏపీలో టీడీపీ కాపాడాలంటే.. అది ఒక్క ఎన్టీఆర్‌తోనే సాధ్య‌మ‌వుతుంద‌ని తెలుగు త‌మ్ముళ్లు అనుకుంటున్న వేళ‌.. ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎన్టీఆర్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మిస్తుంద‌నే టాక్ రావ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి.. గ‌తంలో టీడీపీ కోసం ఎన్టీఆర్ బాగానే క‌ష్ట‌ప‌డ్డాడు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో జోరుగా పాల్గొన్నారు. ఇక ఆ త‌ర్వాత ఆయ‌న సినిమాలకే ప‌రిమితం అయ్యారు. మ‌రెన్న‌డు కూడా రాజ‌కీయాల గురించి మాట్లాడలేదు. కానీ.. ఆయ‌న చుట్టూ రాజ‌కీయ పుకార్లు వ‌స్తూనే ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ‌రికృష్ణ కూతురు సుహాసిని టీడీపీ త‌రుపున‌ పోటీ చేసినా.. కేవ‌లం ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారే త‌ప్ప ఎన్టీఆర్ మాత్రం ఎక్క‌డ కూడా మాట్లాడ‌లేదు. కేవ‌లం సినిమానే లోకంగా ఉంటున్నారు. ఇక ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల సంద‌ర్బంగా కూడా టీడీపీ త‌రుపున ఎన్టీఆర్ ప్ర‌చారం చేస్తార‌నే ఊహాగానాలు వినిపించాయి.

అయితే.. ఇక్క‌డ ట్విస్ట్ ఏమిటంటే.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఎన్టీఆర్ మామ‌, ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీ‌నివాస‌రావు వైసీపీలో చేరారు. ఏకంగా చంద్రబాబుపై కూడా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. అప్పుడు కూడా ఎన్టీఆర్‌పై అనేక ఊహాగానాలు వినిపించాయి. అయినా.. ఎక్క‌డ కూడా ఆయ‌న స్పందించ‌లేదు. త‌న‌ప‌ని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర‌ప‌రాజ‌యం త‌ర్వాత‌.. టీడీపీకి స‌రికొత్త నాయ‌కుడు కావాల‌నే టాక్ తెలుగు త‌మ్ముళ్ల‌లో మొద‌లైంది. అదికూడా కేవ‌లం ఎన్టీఆర్‌తోనే సాధ్య‌మ‌వుతుంద‌ని, ఆయ‌న రావాల‌ని కోరుతున్నారు. ఈ స‌మ‌యంలోనే ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎన్టీఆర్‌ను నియ‌మించేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సానుకూలంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

నార్నే శ్రీ‌నివాస‌రావు, కొడాలి నాని క‌లిసి.. ఎన్టీఆర్‌ను ఒప్పించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఒక‌వేళ ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేందుకు ఎన్టీఆర్ ఒప్పుకుంటే.. తెలుగుత‌మ్ముళ్ల‌కు ఆయ‌న దూరం అవుతారు. ఈ నేప‌థ్యంలో హీరో ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది. మ‌రోవైపు.. ఎన్టీఆర్ ఎలాంటి ప‌ద‌వులూ తీసుకోర‌ని, ఆయ‌న ఎప్ప‌టిలాగే.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటార‌ని, సినిమానే లోకంగా కొన‌సాగుతార‌నే టాక్ కూడా వినిపిస్తోంది. మ‌రి ఈ స‌స్పెన్స్ ఎప్పుడు వీడుతుందో చూడాలి.

అదే జరిగితే ఎన్టీఆర్ వాళ్లకు దూరమే !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share