నాడు ఎన్టీఆర్ … నేడు బాల‌య్య ఇద్ద‌రూ చేతులు ఎత్తేశారు..

June 25, 2019 at 12:17 pm

ఒక్కోసారి ఎవ్వ‌రూ ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు కూడా జ‌రుగుతుంటాయి. మ‌న‌కు అన్ని అనుకున్న వాళ్లే మ‌న‌కు దూర‌మ‌వుతుంటారు. అలాంటోళ్లను ఆపే ప‌రిస్థితి కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. తాజా విష‌యానికి వ‌స్తే ఏపీ మాజీ ఫిల్మ్, టెలివిజన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ చైర్మన్ అంబికా కృష్ణ టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకి ఎప్ప‌టి నుంచో వీర‌విధేయుడిగా ఉన్న ఆయ‌న బాల‌య్య‌కు అత్యంత స‌న్నిహితుడు. బాల‌య్య‌తో ప‌ట్టుబ‌ట్టి మ‌రీ వీర‌భ‌ద్ర లాంటి సినిమా చేశారు. అంబికా నిర్మాత‌గా ఉన్న ఆ సినిమా ప్లాప్ అయ్యింది.

2009లో బాల‌య్య ప‌ట్టుబ‌ట్టి మ‌రీ అంబికాకు సీటు ఇప్పించారు. ఇలా వారిద్ద‌రి మ‌ధ్య ఎంతో సాన్నిహిత్య ఉంది. ఏపీలో టీడీపీ చిత్తుగా ఓడిపోవ‌డంతో ఆయ‌న కాషాయ కండువా క‌ప్పేసుకున్నారు. 2014లో ఆయ‌న సీటు వ‌దులుకున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇస్తామ‌ని హామీ ఇచ్చి నిల‌బెట్టుకోలేదు. చివ‌ర‌కు అంబికా కృష్ణను ఫిల్మ్, టెలివిజన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు.

ఇప్పుడు పార్టీ ఓడిపోవ‌డంతో ఆయ‌న బీజేపీలోకి వెళ్లిపోయారు. త‌న‌కు అత్యంత స‌న్నిహితుడిని కూడా బాల‌య్య పార్టీ మార‌కుండా ఆప‌లేక‌పోయారు. చంద్ర‌బాబు విదేశాల్లో ఉండ‌డంతో ఆయ‌న‌కు చెప్ప‌డం కుద‌ర్లేద‌ని… బాల‌య్య‌కు మాత్రం తాను పార్టీ మారుతున్న విష‌యం చెప్పాన‌ని అంబికా చెప్ప‌డం విశేషం.
పార్టీ మారిన ఆయ‌న‌ తానేమీ తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేయలేదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే గ‌తంలో 2014 ఎన్నిక‌ల‌కు ముందు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న ప్ర‌స్తుత ఏపీ మంత్రి కొడాలి నాని కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. అప్పుడు ఎన్టీఆర్‌పై చాలా అనుమానాలు వ‌చ్చాయి. అప్ప‌టిక‌ప్పుడు ఎన్టీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ నాని పార్టీ మార‌డానికి త‌న‌కు ఏ మాత్రం సంబంధం లేద‌ని చెప్పుకొచ్చారు. అయితే అప్ప‌ట్లో ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎన్టీఆర్ ప‌ట్టుబ‌ట్టి ఉంటే నాని పార్టీ మారే వాడు కాద‌ని… నేడు బాల‌య్య కూడా అంబికా పార్టీ మారుతున్నా చేసేదేం లేక చూస్తూ ఊరుకుండిపోయాడ‌ని టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

నాడు ఎన్టీఆర్ … నేడు బాల‌య్య ఇద్ద‌రూ చేతులు ఎత్తేశారు..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share