త్వరలోనే చెప్పుత బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఏంటో ..కెసిఆర్

May 7, 2019 at 4:01 pm

మే 23న ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏపీలో జ‌గ‌న్‌కే అనుకూలంగా ఉంటాయ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ఆంధ్ర‌ప్రదేశ్‌లో జ‌గ‌న్ నేత్రుత్వంలో ఏర్పాటు కాబోయే ప్ర‌భుత్వ ప్ర‌మాణ స్వీకారానికి తాను హాజ‌రుకాబోతున్న‌ట్టు చెప్పారు. ఈ మ‌ధ్య పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప‌లు అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ఈ సంద‌ర్బంగా ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్‌పైనే ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఆ స‌మ‌యంలో ఆయ‌న త‌న అనుచ‌ర గ‌ణంతో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యే వివిష‌య‌మై, ఆ కార్య‌క్ర‌మానికి త‌ను, త‌న కూతురు ఎంపీ క‌విత‌తో హాజ‌ర‌య్యే విష‌య‌మై మాట్లాడిన‌ట్టు స‌మాచారం.

ఈ సంద‌ర్భంగా ప‌లువురు కేసీఆర్ ముందు కొన్ని అనుమానాలు వ్య‌క్తం చేయ‌డంతో ఆయ‌న నివ్రుత్తి చేశారు. అందులో ముఖ్యంగా జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవుతార‌ని మీరెలా న‌మ్ముతున్నార‌ని ప్ర‌శ్నించ‌డంతో కేసీఆర్ ప‌లు ఆసక్తి క‌ర‌మైన అంశాలు వెల్ల‌డించారు. త‌న‌కు పూర్తి స‌మాచారం ఉంద‌ని, త‌న చేయించిన స‌ర్వేల‌న్నీ జ‌గ‌న్‌కే ప‌ట్టం క‌ట్టే అవ‌కాశాల‌ను సూచించాయ‌ని కేసీఆర్ చెప్పారు. త‌న‌కు ఇంటెలిజెన్స్ స‌మాచారం కూడా ఉంద‌ని, అందున కూడా జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి పీఠాన్ని ద‌క్కించుకోబోతున్నాడ‌ని స్ప‌ష్టంగా ఉంద‌ని చెప్పుకొచ్చారు.

అన్ని స‌ర్వేలు చూశాక‌, ఒక ప్ర‌త్యేక లెక్క తీసుకుని నిర్దిష్ట‌మైన ప‌రిగ‌ణ‌లోకి వ‌చ్చిన‌ట్టు కేసీఆర్ చెప్పారు. పూర్తి స్థాయిలో జ‌గ‌న్ గెలుస్తాడ‌ని నిర్ధారించుకున్నాకే తాను ఈ వ్యాఖ్య‌లు అంటున్న‌ట్టు పేర్కొన్నారు. తాను జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రైతే చంద్ర‌బాబుకు ఇచ్చే రిట‌ర్న్ గిఫ్ట్ కూడా అవుతుంద‌ని నేత‌ల‌తో అన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం రిట‌ర్న్ గిఫ్ట్ ప్రాసెస్‌లో ఉంద‌ని, జ‌గ‌న్ ప్ర‌మాణాస్వీకారానికి వెళ్లాక ఆ గిఫ్ట్ ఏంటో బాబుకు అర్థం అవుతుంద‌ని, ఆ కార్య‌క్ర‌మంలో అస‌లు విష‌యం చెబుతాన‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్న‌ట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ గెలుపుతో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ బ‌లోపేతం దిశ‌గా కూడా అడుగులు ప‌డుతాయ‌ని కేసీఆర్ అభిప్రాయం వెలిబుచ్చిన‌ట్టు తెలుస్తోంది.

త్వరలోనే చెప్పుత బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఏంటో ..కెసిఆర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share