కేసీఆర్‌కు టాలీవుడ్ దాసోహం… దాసోహం..!

June 24, 2019 at 10:33 am

టాలీవుడ్‌. ఏపీ, తెలంగాణ‌ల్లో ప్ర‌జ‌ల‌కు వినోదాన్ని పంచుతున్న సినీ ప‌రిశ్ర‌మ‌. అయితే, ఇప్పుడు కేవ‌లం ఈ సినీ ప‌రిశ్ర మ తెలంగాణ‌కే ప‌రిమిత‌మైందా? ఏపీ ఈ ప‌రిశ్ర‌మ‌కు అవ‌స‌రం లేదా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. డిసెంబరు లో తెలంగాణ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ స‌మ‌యంలో టాలీవుడ్ నుంచి ఒక‌రిద్ద‌రు ప్ర‌చారానికి దిగారు. అదేస‌మ‌యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏపీలోనూ ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే, టాలీవుడ్ నుంచి ముఖ్యంగా కీల‌క న‌టుల నుంచి పెద్ద‌గా స్పంద‌న క‌నిపించ‌లేదు.

క‌మెడియ‌న్లు ఆలీ, పృధ్వీ, పోసాని వంటి వారు కొంద‌రు మాత్ర‌మే జ‌గ‌న్‌కు అనుకూలంగా ప్ర‌చారం చేశారు.
ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సొంత పార్టీ పెట్టుకుని రాజ‌కీయాల్లోకి దిగినా కూడా టాలీవుడ్ నుంచి పెద్ద స్పంద‌న క‌నిపించ లేదు. అయితే, ఇప్పుడు తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌.. ప్ర‌పంచంలోనే గొప్ప‌గా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టును ప్రారం భించారు. ఈ సంద‌ర్భంగా టాలీవుడ్ ప్ర‌శంస‌లు కురిపించింది.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నుంచి ద‌గ్గుబాటి రానా వ‌ర‌కు అంద‌రూ కూడా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఇంద్రుడు, చంద్రుడు అంటూ కీర్తించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో టాలీవుడ్ అనుస‌రించిన విధానంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నిజానికి టాలీవుడ్ ఆదాయం అంతా కూడా ఏపీలోనే ఉంద‌నేది వాస్త‌వం. తెలంగాణ‌లో ఒక్క హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్ మిన‌హా పెద్ద‌గా మార్కెట్ ఉండ‌దు. కానీ, ఏపీలో మాత్రం ప్ర‌తి జిల్లా కూడా టాలీవుడ్‌కు ప్ర‌ధాన కేంద్ర‌మే.

అయితే, ఏపీ రాజ‌కీయాల్లోకానీ, ఏపీలో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల విష‌యంలో కానీ ఎక్క‌డా టాలీవుడ్ ప్ర‌మేయం, ముఖ్యంగా కీల‌క న‌టుల ప్ర‌మేయం ఉండ‌డం లేదు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కానీ, విశాఖ‌జోన్ విష‌యంలో కూడా టాలీవుడ్ అంటీ ముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించింది. ఏపీ ప్ర‌జ‌ల నుంచి ఆదాయం తింటూ కూడా టాలీవుడ్ కేవ‌లం తెలంగాణ ప‌క్ష‌పాతిగా వ్య‌వ‌హ‌రించ‌డం న్యాయ‌మేనా? అనే మాట వినిపిస్తోంది. మ‌రి టాలీవుడ్ ప్ర‌ముఖులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

కేసీఆర్‌కు టాలీవుడ్ దాసోహం… దాసోహం..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share