కేసీఆర్ టికెట్స్ : కులాల తూకం సూపర్!

September 7, 2018 at 3:45 pm

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఇలా శాసనసభ రద్దును ప్రకటించారో లేదో.. ప్రతిపక్షాలు ఆ నిర్ణయం మీద మీడియాకు తమ కామెంట్స్ వెల్లడించడానికంటె ముందే వారిని టెన్షన్ లో పెట్టేశారు. తమ పార్టీ తరఫున తొలి విడత అభ్యర్థుల జాబితాను కూడా ఆయన కేవలం కొన్ని గంటల వ్యవధిలో ప్రకటించేశారు. మొత్తం 119 స్థానాలు తెలంగాణలో ఉండగా.. 105 స్థానాలకు ఒకే విడతలో టికెట్లు ప్రకటించడం అనేది చిన్న సంగతి కాదు!40940575_2273264816241632_2297144188610805760_n

ఈ టికెట్ల కేటాయింపులో కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కులాల పరంగా మాత్రం ఆయన చాలా చక్కగా సమతూకం పాటించినట్లుగా కనిపిస్తోంది. పైగా అది వ్యూహాత్మక సమతూకం అని కూడా అనిపిస్తోంది.

స్థూలంగా చూసినప్పుడు కేసీఆర్ ఈ 105 టికెట్లలో అగ్రవర్ణాలకు 55 కేటాయించారు. అచ్చంగా సగానికంటె ఎక్కువ సీట్లు అగ్రవర్ణాలకే ఇవ్వడం విశేషం. మిగిలిన 50 లోనూ బీసీలకు 21, ఎస్సీలకు 16, ఎస్టీలకు 11 వంతున కేటాయించారు. ఆ రకంగా చూసినప్పుడు కులాలపరంగా సమతూకం పాటించినట్లే అర్థమవుతుంది.40783838_2273264452908335_8221228275456802816_n (1)

ఇకపోతే మైనారిటీ ముస్లింలకు రెండు సీట్లు మాత్రమే ఇచ్చారు. కానీ.. దీనివలన పార్టీకి పెద్దగా నష్టం జరుగుతుందని, ముస్లింలో వ్యతిరేకత వస్తుందని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. ముస్లింలు తమదిగా భావించే మజ్లిస్ తో తెరాసకు సత్సంబంధాలే ఉన్నాయి. మజ్లిస్ సిటింగ్ స్థానాల్లో బలహీనమైన అభ్యర్థుల కోసం కేసీఆర్ వెతుకుతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారికంగా పొత్తుల రూపంలో వారు బయటకు చెప్పకపోయినప్పటికీ.. మజ్లిస్ సహకారం ఉన్న పార్టీగా తెరాసకు ముద్ర ఉన్నది గనుక.. మిగిలిన ప్రాంతాల్లోనూ ముస్లిం ఓట్లకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు.

తమాషా ఏంటంటే.. అగ్రవర్ణాలకు కేటాయించిన 55 సీట్లలో 33 సీట్ల వరకు రెడ్డి కులానికే కేసీఆర్ కేటాయించారు. మిగిలిన సీట్లు ప్రకటించేలోగా.. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది కూడా.

కేసీఆర్ టికెట్స్ : కులాల తూకం సూపర్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share